Vande Bharat Express: భారతీయ రైల్వేలో సెమీ హై-స్పీడ్ ట్రైన్ వందే భారత్. ఈ రైళ్ల రాకతో భారతీయ రైల్వే వేగం పుంజుకుంది. వందే భారత్ నిర్మాణంలో జరిగిన ఓ తప్పిందం ఇండియన్ రైల్వేకు సమస్యగా మారింది. పశ్చిమ రైల్వే నడుపుతున్న సబర్మతి-గుర్గావ్ వందే భారత్ స్పెషల్ (09401) ఇప్పటి వరకు అత్యధిక దూరం ప్రయాణించిన రైలుగా రికార్డుకెక్కింది. ఈ ట్రైన్ 28 గంటల్లో దాదాపు 1,400 కిలోమీటర్లు ప్రయాణించింది. తగిన ప్రణాళిక లేకపోవడమే ఈ ఆలస్యానికి కారణమైంది.
వందే భారత్ రైలు మెహ్సానా సమీపంలో ఒక గంట, దాదాపు 60 కిలోమీటర్ల ప్రయాణ మార్గంలో చిక్కుకుంది. ఆ తర్వాత 898 కి.మీ సబర్మతి-అజ్మీర్-జైపూర్-గుర్గావ్ మార్గంలో 15 గంటలు ప్రయాణించి ప్రయాణికుల సహనాన్ని పరీక్షించింది.
సబర్మతి-అజ్మీర్-జైపూర్-గుర్గావ్ మార్గంలో ప్రయాణించాలంటే హై-రీచ్ పాంటోగ్రాఫ్ ఉండాలి. కానీ వందే భారత్ కు హై-రీచ్ పాంటోగ్రాఫ్ లేదు. ఈ మార్గంలో ఉపయోగించే హై-రైజ్ ఓవర్ హెడ్ పరికరాలు రైలు ప్రయాణించడానికి చాలా అవసరం. సాధారణంగా సరుకు రవాణా కార్యకలాపాల కోసం, పశ్చిమ రైల్వే జోన్‌లోని కొన్ని మార్గాల్లో సాధారణం కంటే ఎక్కువ ఓవర్ హెడ్ ట్రాన్స్‌మిషన్ వైర్లు ఉంటాయి. ఎందుకంటే అవి డబుల్-స్టాక్ కంటైనర్ రైళ్లను తీసుకువెళ్తుంటాయి.
సాధారణ ఓవర్ హెడ్ వైర్లు రైలు నుండి 5.5 మీటర్ల ఎత్తులో ఉంటాయి. కానీ డబుల్-స్టాక్ సరుకు రవాణా మార్గాల కోసం ఈ వైర్లను 7.45 మీటర్లకు ఎత్తులో ఏర్పాటు చేస్తారు. హై-రీచ్ పాంటోగ్రాఫ్‌లు ఉన్న రైళ్లు లేదా లోకోమోటివ్‌లు మాత్రమే ఈ వైర్ల నుంచి శక్తిని పొందగలవు. సబర్మతి-గుర్గావ్ వందే భారత్ రైలు విషయంలో ఇక్కడే పొరపాటు జరిగింది. వందే భారత్ కు హై-రీచ్ పాంటోగ్రాఫ్ లు ఉండవు.
పాంటోగ్రాఫ్ అనేది ఎలక్ట్రిక్ రైలు లేదా లోకోమోటివ్ పైన అమర్చే మెటల్ ఫ్రేమ్‌వర్క్. ఇది ఓవర్ హెడ్ ఎక్విప్‌మెంట్ (OHE) వైర్ నుండి ఎనర్జీ సేకరిస్తుంది. ఇది స్ప్రింగ్ లేదా ఎయిర్ ప్రెజర్ మెకానిజం ద్వారా వైర్‌తో నిరంతరం సంబంధాన్ని కలిగి ఉంటుంది. రైలు ట్రాక్షన్ మోటార్లను మూవ్ చేయడానికి శక్తినిచ్చే విద్యుత్తును తీసుకుంటుంది.
వందే భారత్ ప్రణాళికాబద్ధంగా మార్గంలో ముందుకు సాగడానికి మార్గం లేకపోవడంతో, రైల్వే అధికారులు ఇబ్బందుల్లో పడ్డారు. దీంతో ఈ రైలును అహ్మదాబాద్-ఉదయపూర్-కోట-జైపూర్-మధుర మీదుగా మళ్లించాల్సి వచ్చింది. దీంతో వందల కిలోమీటర్లు ప్రయాణం పెరిగింది. ఆ తర్వాత 28 గంటల పాటు ప్రణాళిక లేకుండా ప్రయాణించి గంటల తరబడి ఆలస్యంగా గుర్గావ్ చేరుకుంది.
Also Read: SBI UPI Down: యూపీఐ సేవల్లో అంతరాయం.. కస్టమర్లకు ఎస్బీఐ కీలక సూచన
“సాంకేతికపై అవగాహన లేకపోవడం, ఈ మార్గాన్ని ముందు తనిఖీ చేయకోవడం” అని సీనియర్ రైల్వే అధికారి తెలిపారు. “హై-రీచ్ పాంటోగ్రాఫ్ లేకుండా ఎత్తైన OHE విభాగంలో వందే భారత్‌ను నడపడం ఎసాధ్యం కాదని తెలిపారు. ఏ వందే భారత్ రైలు ఒకేసారి ఇంత దూరం ప్రయాణించలేదు. అతితక్కువ సమయం, అత్యధిక వేగం ఆశించిన ప్రయాణికులకు సమస్యలు సృష్టించింది.