Abhishek Sharma Car: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో అభిషేక్ శర్మ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో మొత్తం ఏడు మ్యాచ్ లు ఆడిన అభిషేక్ శర్మ 314 పరుగులు చేసి దుమ్ము లేపాడు. టీం ఇండియాను ఫైనల్ కు చేర్చి ట్రోఫీ అందించాడు అభిషేక్ శర్మ. అలాంటి అభిషేక్ శర్మ టోర్నమెంట్ ఆఫ్ ద సిరీస్ గా కూడా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అభిషేక్ శర్మకు ఇచ్చిన కారు ( Abhishek Sharma Car) ఇండియాకు తీసుకురాలేదట. దాన్ని అక్కడే వదిలివేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో షేక్ చేస్తోంది.
Also Read: Inzamam-ul-Haq: రోహిత్ శర్మ ఓ ముసలోడు, పందిలాగా ఉంటాడు…అందుకే కెప్టెన్సీ పీకిపారేశారు !
టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ భయంకరమైన బ్యాటింగ్ ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో అందరూ చూసిన సంగతి తెలిసిందే. ఏడు మ్యాచ్ లలోనే 314 పరుగులు చేసి పాకిస్తాన్ అలాగే ఇతర ఆసియా దేశాలకు చుక్కలు చూపించాడు అభిషేక్ శర్మ. దీంతో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా కూడా అభిషేక్ శర్మ నిలిచాడు. ఇందులో భాగంగానే ఆసియా క్రికెట్ కౌన్సిల్ అతనికి అరుదైన గిఫ్ట్ ఇచ్చింది. దాదాపు 35 లక్షల విలువైన Haval H9 SUV కారును అభిషేక్ శర్మకు గిఫ్టుగా ఇచ్చింది ఆసియా క్రికెట్ కౌన్సిల్. ఈ కారు తన చేతికి వచ్చిన తర్వాత గిల్ మొదటగా డ్రైవింగ్ చేశాడు. ఆ సందర్భంగా అభిషేక్ శర్మ ( Abhishek Sharma ) పక్కన కూర్చున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ కారును ఇండియాకు అభిషేక్ శర్మ తీసుకురాలేదు.
దీనికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి. దుబాయ్ వేదికగా ఇచ్చిన ఆ అరుదైన కారు డ్రైవింగ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అంటే డ్రైవర్ లెఫ్ట్ సైడ్ లో కూర్చుంటాడు. ఇండియాలో మాత్రం డ్రైవర్ రైట్ సైడ్ కు కూర్చుని డ్రైవింగ్ చేస్తాడు. కానీ దుబాయ్ లో అభిషేక్ శర్మకు ఇచ్చిన కారు ఇండియాకు తీసుకువస్తే, మన కేంద్ర ప్రభుత్వ చట్టాల ప్రకారం బ్యాండ్ విధిస్తారు. ఎడమచేతి వైపు స్టీరింగ్ ఉన్న వాహనాలకు ఇండియాలో పర్మిషన్ లేదు. అందుకే టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఆ కారును అక్కడే వదిలేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు చైనాకు సంబంధించిన ఈ కారు త్వరలోనే ఇండియాలో లాంచ్ కాబోతున్నట్లు చెబుతున్నారు. అప్పుడు లాంచ్ అయితే కచ్చితంగా స్టీరింగ్ ఇండియాలో ఉన్నట్లుగా కుడి చేతి వైపుకు వస్తుంది. ఆ సమయంలో అభిషేక్ శర్మ కారును తీసుకునే ఛాన్సులు ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఆ కారును షోరూం వాళ్లకు అప్పగించి, ఇండియాలో లాంచ్ అయిన తర్వాత కారణం తీసుకునే ఛాన్సులు ఉన్నాయని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
Also Read: Gautam Gambhir: గంభీర్ మహాముదురు.. ట్రోలింగ్ కు చెక్ పెట్టేందుకు బీరు, బిర్యానీలు పెట్టి మరీ !