Bigg Boss Telugu 9 Elimination: బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ వచ్చేస్తోంది. ఈ వీకెండ్కి హౌజ్లో దసరా సంబరాలు జరగబోతున్నాయి. స్టేజ్ పై స్పెషల్ గెస్ట్స్ ఆటపాట ఉండబోతుంది. మాజీ బిగ్బాస్ కంటెస్టెంట్ హారికతో డ్యాన్స్ పర్ఫామెన్స్తో పాటు సింగర్ లిప్సిక పాట ఉండబోతుందట. శనివారం ఎపిసోడ్ని దసరా ఈవెంట్గా చూపించబోతున్నారట. ఇప్పటికే హౌజ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. మరోకరి కూడా ఈ వీకెండ్ ఎపిసోడ్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఉండబోతోంది. హౌజ్‌మేట్స్ అందరిని ఇంటి నుంచి బయటకు పంపించి.. స్టేజ్ పైకి ముసుగుతో ఒక కంటెస్టెంట్స్ తీసుకువస్తున్నాడట బిగ్బాస్.
అది సంజన రీఎంట్రీ అయినా, లేక వైల్డ్ కార్డ్ అయినా ఉండోచ్చు. ఇక వీకెండ్ ఎపిసోడ్ అంటేనే ఎలిమినేషన్. శనివారం ఈ దసర ఈవెంట్ లాస్ట్.. ఎలిమినేషన్ ని ప్రకటిస్తారట. ఈ శనివారం మూడోవారం ఎలిమినేషన్ ఉండబోతుందట. అయితే ఈ వారం హౌజ్ నుంచి బయటకు వెళ్లేది ప్రియ అని తెలుస్తోంది. కాగా మూడో వారం నామినేషన్లో ఆరుగురు ఉన్న సంగతి తెలిసిందే. ప్లోరా షైనీ, మాస్క్ మ్యాన్ హారిక హరీష్, కళ్యాన్ పడాల, రాము రాథో డ్, రీతూ చౌదరి, ప్రియా శెట్టిలు ఉన్నారు. వారంలో జరిగిన గురి తప్పకు టాస్క్ లో గెలిచి ఇమ్యునిటీ సాధించింది. దీంతో ఆమె ఈ వారం నామినేషన్స్ నుంచి సేఫ్ అయ్యింది. నిజానికి నామినేషన్స్ ఫ్లోరా ఓటింగ్లో టాప్లో చేరింది. ఆ తర్వాత ఓటింగ్ శాతం తగ్గుతూ వచ్చింది.
ఒకవేళ నామినేషన్స్లో ఉంటే మాత్రం ప్లోరా ఎలిమినేషన్ ఉండేది. దీంతో ఆమె సేఫ్ అవ్వడంతో.. ప్రస్తుతం నామినేషన్లో ఐదుగురు ఉన్నారు. వారిలో రాము రాథోడ్ అత్యధిక ఓట్లతో టాప్లో ఉన్నాడు. డేంజర్ జోన్లో రీతూ, ప్రియా శెట్టి, కళ్యాణ్ పడాల, మాస్క్ మ్యాన్‌లో ఉన్నారు. వీరిలో లీస్ట్ ఓట్లు రీతూ చౌదరి, ప్రియాలకు పడ్డాయట. నామినేషన్లో చివరిలో నిలిచిన వీరిద్దరిలో కామనర్ ప్రియ శెట్టి ఎలిమినేట్ కానుందట. అందరికి తక్కువ ఓట్లు ఆమెకే పడటంతో మూడోవారంలోనే ప్రియ హౌజ్ని వీడనుందట.
మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌తో పాటు ఆడియన్స్కి షాకిచ్చాడు. దీంతో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అంతా అభిప్రాయపడ్డారు. కానీ, ఈ వారం సింగిల్ ఎలిమినేషనే ఉంటుంది. అంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ పేరుతో సంజనను సీక్రెట్ రూంలో పెట్టారట. కాగా రెడ్ కలర్ విత్తనం వచ్చిన కంటెస్టెంట్స్ అంతా ఏకాభిప్రాయంతో ఒకరిని హౌజ్ నుంచి బయటకు పంపించాలి. అంత కలిసి సంజనను నామినేట్ చేసి బయటకు పంపించారు. అయితే సీక్రెట్ రూం టాస్క్ అని ఈరోజు హోస్ట్ నాగ్ బయటపెట్టబోతున్నాడు. ఈవెంట్లో మధ్యలో సంజన హౌజ్ లోకి రీఎంట్రీ ఇవ్వనుందట.