BigTV English

Bigg Boss Seetha : ‘దానికి బాగా అడిక్ట్ అయ్యాను’… వీక్ నెస్ బయటిపెట్టిన బిగ్ బాస్ బ్యూటీ..

Bigg Boss Seetha : ‘దానికి బాగా అడిక్ట్ అయ్యాను’… వీక్ నెస్ బయటిపెట్టిన బిగ్ బాస్ బ్యూటీ..

Bigg Boss Seetha : గత ఏడాది బిగ్ బాస్ సీజన్ 8 మొత్తం కన్నడ బ్యాచ్ తో సందడి గా మారింది. కన్నడ బ్యాచ్ కు పోటీగా యూట్యూబర్ సీత కూడా సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొంది. అందరితో పోటీపడి మరి బాగానే ఆటలోనూ మాటలోనూ ఎక్కడ తగ్గకుండా తన సత్తా చాటింది కిర్రాక్ సీత.. ఫైనల్ లో ఉంటుందని అందరు అనుకున్నారు. కానీ అనుకోని విధంగా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది.. హౌస్ లో ఉన్నన్ని రోజులు ఎక్కడ తగ్గకుండా మంచి పాపులాటిని అందుకున్న సీత బయటికి వచ్చిన తర్వాత సోషల్ మీడియాకే అంకితమైంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను రీల్స్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. తాజాగా ఓ వీడియోను షేర్ చేసిన సీత తనకు ఇష్టమైన దాన్ని కూడా అందులో యాడ్ చేసింది. అది లేకుండా నేను అస్సలు ఉండలేనట్టు సీక్రెట్ ని బయట పెట్టింది. దాంతో వీడియో వైరల్ గా మారింది..


తెలుగు టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 8 ఇటీవలే పూర్తయింది. ఈ సీజన్ ఈసారి కొత్తగా జరిపించారు యాజమాన్యం. అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అంటూ సరికొత్త కాన్సెప్ట్ తో ఆ సీజన్ ను పూర్తి చేశారు. అయితే గతంలో లాగా సెలబ్రిటీలను కాకుండా సీరియల్ బ్యాచ్ తో కానీ చేశారని టాక్ అని అందుకుంది బిగ్ బాస్.. వీరిలో ఒకరు కిర్రాక్ సీత. రాయలసీమలోని కర్నూలు జిల్లా నంద్యాలలో పుట్టారు కిర్రాక్ సీత. ఆమె తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆయన ఉద్యోగ రీత్యా హైదరాబాదులోని సెటిల్ అయ్యారు.. చదువుల్లో బాగా రానిచ్చిన సీత ఆ తర్వాత మెల్లమెల్లగా యాక్టింగ్ పై ఆసక్తితో అటువైపు అడుగులు వేసింది. అలా పలు వీడియోలు, షార్ట్ స్టోరీలను తీస్తూ యూట్యూబర్ గా మంచి గుర్తింపును తెచ్చుకుంది.. ఆ క్రేజ్ తోని సినిమాలో అవకాశాన్ని అందుకుంది.. ఆనంద్ దేవరకొండ నటించిన హీరోగా వచ్చిన బేబీ సినిమాలో హీరోయిన్‌ను చెడగొట్టి ఆమెను చెడు వ్యసనాలకు బానిసను చేసే అమ్మాయిగా అద్భుతంగా నటించింది కిర్రాక్ సీత. ఈ పాత్ర చేసిన తర్వాత తనను ఎంతో మంది తిట్టుకున్నారని , ఏకంగా రేప్ చేస్తామంటూ బెదిరింపులు కూడా వచ్చాయని ఆమె ఓ వీడియోలో వెల్లడించారు..

ఆ సినిమాతో మంచి పాపులాటిన్ అయితే అందుకుంది కానీ ఆ తర్వాత పెద్దగా సినిమాల ఆఫర్లు ఆమెను పలకరించినట్టు లేదు. యూట్యూబర్ గా మంచి క్రేజ్ ఉన్న ఈమెకు బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం వచ్చింది. అలా బిగ్ బాస్ సీజన్ 8 లో ఎంట్రీ ఇచ్చింది. తన మాటలతో ఆటలతో ప్రేక్షకులను బాగానే మెప్పించింది. కొన్ని మిస్టేక్స్ వల్ల ఫైనల్ వరకు వెళ్లలేకపోయింది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె మళ్ళీ సోషల్ మీడియాలో బిజీ అయిపోయింది. ఎప్పటికప్పుడు రీల్స్ వీడియోలను చేస్తూ అభిమానులకు షేర్ చేస్తుంది. తాజాగా ఓ వీడియోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో సీతు చీరకట్టి తన ఇంటి కిచెన్‌లో టీ పెట్టుకునే వీడియోను ఆమె షేర్ చేశారు. టీ లేకుండా తాను ఉండలేనంటూ స్వాతిముత్యం మూవీలోని సువ్వి సువ్వి సీతాలమ్మ సాంగ్‌ వెనకాల వినిపిస్తుంది. ఈ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. టీ కోసం ఇంత బిల్డప్ ఇచ్చిందా అని సీత పై కొందరు మండిపడుతున్నారు. మొత్తానికి వీడియో అయితే ట్రెండింగ్ లో ఉంది..


Related News

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Big Stories

×