BigTV English
Advertisement

Bigg Boss: ఏడవ వారం నామినేషన్స్ జాబితా.. డేంజర్ జోన్ లో ఆ ఇద్దరు..!

Bigg Boss: ఏడవ వారం నామినేషన్స్ జాబితా.. డేంజర్ జోన్ లో ఆ ఇద్దరు..!

Bigg Boss : బిగ్ బాస్ సీజన్ 8 అలా ప్రారంభమైందో లేదో అప్పుడే ఆరువారాలు పూర్తి చేసుకుంది. ఇక ఆరవ వారంలో భాగంగా కిర్రాక్ సీత ఎలిమినేట్ అయింది. మొదటినుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకున్న సీత సడన్ గా ఎలిమినేట్ అవ్వడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వాస్తవానికి గతవారం యష్మీ ఎలిమినేట్ అవుతుందని చాలామంది బలంగా నమ్మారు. మరికొంతమంది విష్ణు ప్రియ ఎలిమినేట్ అవుతుందని కామెంట్లు కూడా చేశారు. అయితే ఎవరి అంచనాలు నిజం కాలేదు.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. వీకెండ్ లో నామినేషన్ నుండి సేవ్ అయిన రెండవ కంటెస్టెంట్ గా నిలిచిన సీతకు పెద్దదెబ్బ తగిలిందని చెప్పాలి.


ట్విస్ట్ ల మధ్య నామినేషన్ షురూ..

ఆ తర్వాత ఆమె ఎలిమినేట్ అవ్వడం కూడా అందరికీ కోలుకోలేని షాక్ అని చెప్పవచ్చు. అయితే నిన్నటి నామినేషన్స్ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. ఈ నామినేషన్ ప్రక్రియ ఇంతకుముందు వారాల కంటే చాలా కొత్తగా ప్లాన్ చేశాడు బిగ్ బాస్. 2 ఎరుపు రంగుతో ఉన్నటువంటి బోర్డ్స్ ఉంచి , రెండు గుర్రాలు కూడా ఉంచాడు. మరోపక్క స్టాండ్ ఉంటుంది. దానిపైన హ్యాట్ ఉంటుంది. ప్రేరణ, హరితేజ కిల్లర్ లేడీస్ గా ఉంటారు. గుర్రం శబ్దం వినపడగానే అటుపక్క కంటెస్టెంట్స్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఎరుపు రంగు బోర్డ్స్ మీద నిల్చోవాలి. అలాగే టేబుల్ మీద ఉన్న హ్యాట్ కోసం కిల్లర్ లేడీస్ కూడా పరిగెత్తాలి. ఇక ఎవరి చేతిలో అయితే హ్యాట్ ఉంటుందో వాళ్ళు నామినేషన్స్ చేయడానికి వచ్చిన ఇద్దరు కంటెస్టెంట్స్ చెప్పే పాయింట్స్ లో ఎవరిది కరెక్టు అనిపిస్తే వాళ్ల పాయింట్స్ ను పరిగణలోకి తీసుకొని నామినేట్ చేయాల్సి ఉంటుంది. అలా సాగిన ఈ ప్రక్రియలో 9 మంది కంటెస్టెంట్స్ ఏకంగా ఈ వారం నామినేషన్ లోకి వచ్చారు.


ఏడవ వారం నామినేషన్స్ జాబితా..

ఏడవ వారం నామినేషన్స్ లోకి వచ్చిన జాబితా విషయానికి వస్తే.. హరితేజ , యష్మీ , ప్రేరణ, మణికంఠ, నిఖిల్, పృథ్వి, టేస్టీ తేజ, నబీల్, గౌతమ్ కృష్ణ. నామినేషన్స్ ప్రక్రియ చాలా ట్విస్టుల మధ్య జరిగిందని చెప్పాలి. ఇక ఇందులో ఎక్కువసార్లు హ్యాట్ పట్టుకున్నందున హరితేజ ముందుగా సేవ్ అవ్వగా మరో కిల్లర్ లేడీ ప్రేరణ నామినేట్ అయింది.

అవినాష్ కోసం హరితేజను నామినేట్ చేసిన మెగా చీఫ్..

రాయల్ క్లాన్ లో హరితేజ కంటే ముందుగా అవినాష్ నామినేట్ అయ్యాడు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రాయల్ క్లాన్ కి ఉన్నటువంటి ఇమ్యూనిటీ షీల్డ్ ను ఉపయోగించి అవినాష్ ను సేవ్ చేసి హరితేజను నామినేషన్ లోకి పంపించాడు మెగా చీఫ్ మెహబూబ్.

డేంజర్ జోన్ లో ఆ ఇద్దరే..

ప్రస్తుతం 9 మంది కంటెస్టెంట్స్ నామినేషన్ లోకి రాగా వారిలో వైల్డ్ కార్డు కంటెస్టెంట్ టేస్టీ తేజ డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈయనతోపాటు పృథ్వి, గౌతమ్ కూడా డేంజర్ లోకి వచ్చేసారు. అందరికంటే అత్యధిక ఓట్లతో హరితేజ ప్రస్తుతం మొదటి స్థానంలో నిలిచింది. చివరిగా గౌతమ్, టేస్టీ తేజ డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనే విషయం ఆసక్తికరంగా మారింది.

Related News

Bigg Boss Tamil: ప్రాంక్‌ పేరుతో కొట్టుకున్న కంటెస్టెంట్స్‌.. ఫైర్‌ అయిన హోస్ట్‌!

Bigg Boss 9 Elimination: డబుల్‌ ట్విస్ట్‌, డబుల్‌ ఎలిమినేషన్‌.. రాము రాథోడ్‌ అవుట్‌!

Bigg Boss 9 Promo : బిగ్ బాస్ హౌస్ లో ఆర్జీవి, అందరూ అమ్మాయిలే కావాలి అంటూ..

Bigg Boss 9: ఏడుపుగొట్టు చెత్తను బయటకు తోసేయండి, లైవ్ చూడలేకపోతున్నాం

Bigg Boss 9: ఇన్ సెక్యూరిటీ లోకి పోయి గేమ్ పాడు చేసుకుంటున్నా ఇమ్మానియేల్

Bigg Boss 9 Telugu Day 61 : రీతూ బంగారంరా… తనూజాపై అంత కక్షగట్టేశావ్ ఏంటి దివ్య? నక్కతోక తొక్కిన ఇమ్మూ

Bigg Boss 9 Telugu : ఇమ్మూనా మజాకా? బిగ్ బాస్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రికార్డ్… కానీ ఆ బుర్ర తక్కువ పనే మైనస్ మావా

Bigg Boss 9: చివరిలో చేజారిన తనూజ కెప్టెన్సీ.. అతడే కొత్త కెప్టెన్!

Big Stories

×