Bigg Boss8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ చివరి దశకు చేరుకుంది. మరో వారంలో సీజన్ ముగుస్తుంది. అయితే బిగ్ బాస్ చివరి వారంలో ఆట రంజుగా ఉంటుందని అందరు అనుకున్నారు. కానీ 13 వ వారం డబుల్ ఎలిమినేషన్ అయ్యింది. 14 వ వారం హౌస్ లో నామీనేషన్స్ లేవు.. విచిత్రమైన టాస్క్ లతో బిగ్ బాస్ ఏదో రచ్చ చేయిస్తున్నాడు తప్ప నిజంగానే పస లేదు.. ఆడియన్స్ ను ఈ వారం బిగ్ బాస్ నిరాశ పరిచాడు. ఇక హౌస్ లో బుధవారం ఎపిసోడ్ టాస్క్ పెద్ద రచ్చగా సాగింది. అరవాల్సిన అవసరం లేదు కానీ రోజంతా అందరు అరుస్తూ బోర్ కొట్టించారు. అయితే ఈ టాస్క్ లో నబీల్, ప్రేరణ మధ్య భీకర యుద్ధం అయితే జరిగింది.
బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం ఓట్ అప్పీల్ చేసుకునేందుకు హౌస్‌మేట్స్‌కి టాస్కులు జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్నటాస్కుల్లో గెలిచి ప్రేరణ ఓట్ అప్పీల్ చేసుకుంది. ఇక ఈరోజు పెట్టిన టాస్కుల్లో మొదటగా క్రాస్ పాత్ అనే టాస్క్ ను ఇచ్చారు. దాంట్లో నబీల్ అద్భుతంగా ఆడాడు. కానీ సంచాలక్‌గా ఉన్న ప్రేరణ కోడిగుడ్డుపై ఈకలు పీకినట్లు నబీల్ ఆటలో మిస్టేక్స్ వెతుకుతూ తప్పించే ప్రయత్నం చేసింది. కానీ నబీల్‌కి రోహిణి, అవినాష్ సపోర్ట్ చేయడంతో ప్రేరణ ఇరుక్కుంది. ఇక తాను గెలిచినా ఇన్ని లాజిక్కులు మాట్లాడిన ప్రేరణకు నబిల్ చుక్కలు చూపించాడు. ఒకరు కాదు ముగ్గురు నబిల్ ను సపోర్ట్ చేశారు. ఆ టాస్క్ లో నబీల్ కు అన్యాయం జరిగిందని తెలుస్తుంది.
సాయంత్రం వరకు నబీల్ తప్పు అని ప్రేరణ వాదిస్తుంది. రోహిణి, అవినాష్ లు అతనికి సపోర్ట్ గా నిలుస్తారు. కానీ ప్రేరణ చెప్పిందే రైట్ అన్నట్లు మాట్లాడుతుంది. కానీ ఆమెకు కొందరు సపోర్ట్ చేస్తే మరికొందరు నబీల్ కరెక్ట్ అని అంటారు. కానీ చివరకు బిగ్ బాస్ కలుగ చేసుకోవడంతో నబీల్ సైలెంట్ అయ్యారు. రచ్చ చేసి ఇంట గెలవడం అన్నట్లు ప్రేరణ మొత్తానికి గెలిచింది. ఒకవైపు నిఖిల్ మరో టాస్క్ ఉంది అంటున్న కూడా నేను చెప్పిందే రైట్ అంటూ అందరికి షాక్ ఇచ్చింది. గెలిచినా అని సంబర పడిపోయింది. ఎపిసోడ్ లో ప్రేరణ డిష్కర్శన్ బాగుందనే చెప్పాలి. మొత్తానికి కన్నడ బ్యాచ్ లో గొడవలు మొదలయ్యాయి. ఏది ఏమైనా ప్రేరణ నోరు ముందు గెలవడం ఎవరి వల్ల కాదని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక నబీల్ కు అన్యాయం జరిగిందని తెలుస్తుంది. రేపు ఏం జరుగుతుందో చూడాలి.. ఇక ఈ వారం ఎలిమినేషన్ ఉన్నట్లు కనిపించలేదు. మరి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. ఏది ఏమైనా ఈ వారం టాస్క్ లు పస లేవని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక విన్నర్ అవ్వాలంటే టాస్క్ లలో గెలవాలని బిగ్ బాస్ కండిషన్ పెట్టాడు. ఈ వారంలో ఎటువంటి టాస్క్ లను ఇస్తాడో చూడాలి..