OTT Movie : సైకో కిల్లర్ సస్పెన్స్ సినిమాలను చూడటానికి మూవీ లవర్స్ ఎక్కువగా ఇష్టపడతారు. ఈ సి నిమాలలో వచ్చే సస్పెన్స్ తట్టుకోవడం కష్టంగానే ఉంటుంది. చివరివరకు సైకో ఎవరు అనేది తెలుసుకోవడం దాదాపు అసాధ్యమనిపించే విధంగా కొన్ని సినిమాలు తెర మీదకు వచ్చాయి. అయితే వాటిలో ఒక మూవీ బాక్సాఫీస్ ని షేక్ చేసి, ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పేరేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో
ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు “స్క్రీమ్” (Scream) ఈ మూవీలో సైకో కిల్లర్ చేసే అరాచకం అంతా ఇంతా కాదు. అతడు పోలీసులతో సహా చాలామందిని చంపుతూ ఉంటాడు. ఈ మూవీలో క్లైమాక్స్ మామూలుగా ఉండదు. 2022 లో వచ్చిన ఈ సైకో కిల్లర్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
తార అనే అమ్మాయికి రాత్రిపూట ఒక సైకో కిల్లర్ ఫోన్ చేసి, మూడు ప్రశ్నలకు కరెక్ట్ గా సమాధానం చెప్తే నిన్ను వదిలేస్తానని లేకపోతే నీతో పాటు నీ ఫ్రెండ్స్ ని కూడా చంపుతానని బెదిరిస్తాడు. తార భయంతో మొదట రెండు ప్రశ్నలకు కరెక్ట్ సమాధానం చెబుతుంది. మూడో ప్రశ్నకి సమాధానం తప్పుగా చెప్తుంది. ఆ వెంటనే సైకో కిల్లర్ వచ్చి ఆమెపై దాడి చేస్తాడు. కొన ఊపిరితో ఉన్న తారని హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు. అక్కడికి ఆమెను చూడటానికి ఫ్రెండ్స్ తో పాటు, సిస్టర్ శ్యామ్ కూడా వస్తుంది. అక్కడికి వచ్చిన శ్యామ్ ని చూసి తార చాలా బాధపడుతుంది. ఎందుకంటే తారకి చెప్పకుండా ఆమె వేరొక చోటికి వెళ్లిపోయి ఉంటుంది. ఎందుకు అలా వెళ్లిపోయావని హాస్పిటల్లో శ్యామ్ ని నిలదీస్తుంది. దానికి సమాధానంగా శ్యామ్ మన తల్లి ఒక్కరే కానీ తండ్రులు వేరని చెప్తుంది. ఈ విషయం నాకు తెలిసినప్పుడు అలా వెళ్లిపోయానని చెప్తుంది. ఆ తర్వాత ఆ సైకో కిల్లర్ శ్యామ్ మీద కూడా దాడి చేస్తాడు.
శ్యామ్ బాయ్ ఫ్రెండ్ తో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేస్తే, వాళ్ళు సరిగ్గా పట్టించుకోరు. తర్వాత వీరికి తెలిసిన ఒక పోలీస్ ఆఫీసర్ ను హెల్ప్ అడుగుతారు. అతడు మొదట నిరాకరించినా, ఆ తర్వాత సాయం చేస్తానని ఒప్పుకుంటాడు. ఈ లోగా హాస్పిటల్ లో సెక్యూరిటీని సైకో కిల్లర్ చంపేస్తాడు. తారని చంపడానికి ప్రయత్నిస్తాడు. ఆ పోలీస్ ఆఫీసర్, శ్యామ్ ఒకచోట ఉండగా అక్కడికి కూడా సైకో కిల్లర్ వస్తాడు. పోలీస్ ఆఫీసర్ పై దాడి చేస్తూ సైకో కిల్లర్ కూడా గాయపడతాడు. ఆ తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ ని కూడా తీవ్రంగా గాయపరుస్తాడు. చివరికి ఆ పోలీస్ ఆఫీసర్ ఆ సైకో కిల్లర్ ని పట్టుకుంటాడా? ఆ సైకో కిల్లర్ వీళ్ళందర్నీ ఎందుకు చంపుతున్నాడు? తార ఫ్రెండ్స్ లోనే ఆ సైకో కిల్లర్ ఉన్నాడా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సైకో కిల్లర్ మూవీని తప్పకుండా చూడండి.