BigTV English

BiggBoss 8 Telugu : నిఖిల్ కు షాకిచ్చిన ప్రేరణ.. కన్నడ బ్యాచ్ లో గొడవలు.. అస్సలు ఊహించలేదు..

BiggBoss 8 Telugu : నిఖిల్ కు షాకిచ్చిన ప్రేరణ.. కన్నడ బ్యాచ్ లో గొడవలు.. అస్సలు ఊహించలేదు..

BiggBoss 8 Telugu : బిగ్ బాస్ లో అసలు ఏం జరుగుతుంది? నామినేషన్స్ లేకుండా ఈ కొత్త రచ్చ ఏంటి అని ఆడియన్స్ జుట్లు పీక్కుంటున్నారు. 13 వ వారం డబుల్ ఎలిమినేషన్ తర్వాత ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అందరు అనుకున్నారు. కానీ బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ కు అయోమయంలో పడ్డారు. బిగ్‌బాస్ ఈ సీజన్‌లో టాస్కుల్లో కింగ్ ఎవరంటే ఖచ్చితంగా నిఖిల్‌ పేరే ఎక్కువ మంది చెబుతారు. ఎందుకంటే నిఖిల్ ఆట ఆ రేంజ్‌లో ఉంది. మాటలు, నామినేషన్స్ విషయం పక్కన పెడితే టాస్కుల్లో మాత్రం నిఖిల్ తనని తాను తోపు అని చాలా సార్లు నిరూపించుకున్నాడు.. కానీ నిన్నటి ఎపిసోడ్ లో ప్రేరణ ఓడించింది. నిఖిల్ కు డైజెస్ట్ అవ్వలేదని తెలుస్తుంది. దాంతో కన్నడ బ్యాచ్ లో మిగిలిన ఇద్దరిలో గొడవలు మొదలయ్యాయని తెలుస్తుంది. అసలు గొడవ ఎక్కడ మొదలైందో ఇప్పుడు తెలుస్తుందాం…


నిన్నటి ఎపిసోడ్ లో క్రాస్ పాత్ టాస్క్ ను ఇచ్చాడు బిగ్ బాస్. ఆ టాస్క్ లో తాడును పోల్ కు చుట్టాలని బిగ్ బాస్ చెబుతాడు. కానీ అక్కడ పెద్ద రచ్చే జరుగుతుంది. నిఖిల్‌పై అన్ని రకాలుగా ఆధిపత్యం చూపించి టాస్కులో గెలిచింది ప్రేరణ. గెలిచిన కారణంగా చాలా ముఖ్యమైన ఓట్ అప్పీల్ అవకాశం సాధించుకుంది. మరి తన ఫ్యాన్స్, ఆడియన్స్‌కి ప్రేరణ చేసిన రిక్వెస్ట్ ఏంటి? నిఖిల్‌పై ఎలా గెలిచింది అనేది ఆసక్తిగా మారింది. తాడును రోప్ చెయ్యడంలో తానే తోపు అని ప్రేరణ నబీల్ తో గొడవకు దిగింది. ఈ క్రమంలో పెద్ద యుద్ధమే హౌస్ లో జరుగుతుంది. మొదట అందరు నబీల్ కు సపోర్ట్ చేస్తారు. కానీ చివరకు ప్రేరణ కరెక్ట్ అని ఆమెను సపోర్ట్ చేస్తారు. ఇక రోజంతా ప్రేరణ రచ్చే హౌస్ లో వినిపిస్తుంది. మధ్య లో నబీల్ కలుగ చేసుకొని రెచ్చిపోతాడు.

బిగ్ బాస్ లో బుధవారం ఎపిసోడ్ లో హౌస్‌మేట్స్‌కి ఓట్ అప్పీల్ చేసుకునేందుకు ఓ అవకాశం ఇచ్చాడు. ఈ వారం మీరు మీ ఆడియన్స్, అభిమానులను నేరుగా కలుసుకొని వారు మీకు ఓటు వేసి ఎందుకు మిమ్మల్ని సీజన్ 8 విన్నర్‌ని చేయాలో.. అందుకు మీలో ఉన్న అర్హతలేంటో వారికి చెప్పి కన్విన్స్ చేసి ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం లభిస్తుంది.. మీరు ఆ అవకాశాన్ని సంపాదించుకోవడానికి కొన్ని ఛాలెంజెస్‌లో పాల్గొని గెలవాల్సి ఉంటుంది.. మొదటి టాస్క్ లో ఎలాగోలా ప్రేరణ గెలుస్తుంది. మొదట నిఖిల్ కరెక్ట్ అన్న ఆమె చివరికి తప్పు అంటుంది. ఇక నిఖిల్ ఊరుకుంటాడా? నీ బండారం బయట పెడతాను అని అంటాడు. ఇది ప్రేరణ అస్సలు ఊహించి ఉండదు అని తెలుస్తుంది. మొత్తానికి వీరిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయని తెలిసిపోతుంది. ఇక ఒకవారం హౌస్ లో వీరిద్దరూ కలిసే ఉండాలి. ఇంకా ఎన్ని గొడవలు అవుతాయో చూడాలి.. ఏది ఏమైనా ఎపిసోడ్ హైలెట్ అయ్యింది.


Tags

Related News

Bigg Boss 9 Telugu: డబుల్ హౌస్.. డబుల్ డోస్..బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Big Stories

×