Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9, 54వ రోజు మరికొన్ని ట్విస్టులతో కెప్టెన్సీ పోరు మొదలైంది. ఈ క్షణానికి కలిసి ఉన్న వాళ్లే మరుక్షణం తిట్టుకుంటారు. అది బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్. హౌస్ లో జరిగే పరిణామాలు అన్ని చూస్తుంటే ఈ షో స్క్రిప్ట్ అని అనిపించక మానదు. అందుకే బయట కూడా ఎక్కువగా బిగ్ బాస్ షో అనేది స్క్రిప్ట్ ఆ అని ప్రశ్నలు వస్తుంటాయి.
ఇప్పటికే బయటికి వచ్చిన కొంత మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ స్క్రిప్ట్ కాదు మీరు చూసేదంతా నిజమే అని చెబుతూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం సెమీ స్క్రిప్ట్ అంటుంటారు. బయటకొచ్చిన కంటెస్టెంట్లు చెప్పట్లేదు అంటే వాళ్లకి టెన్స్ అండ్ కండిషన్స్ లో అక్కడ విషయాలు తెలియకూడదు అని చెప్పి ఉంటారేమో. ఇలా కూడా ఉండొచ్చు.
తనూజకి కెప్టెన్సీ టాస్క్ లో ఇమ్మాన్యుయేల్, భరణి, సుమన్ ఎవరూ సపోర్టు చేయలేదు. ఫ్రెండ్ అని ఇమ్మాన్యుయేల్,కూతురు కూతురు అని అన్న భరణి తనూజ వైపు లేరు. భరణి న్యూట్రల్ గా ఉన్నాడు.
కానీ, ఇమ్మాన్యుయేల్ నేరుగా దివ్యకు సైడ్ ఉండి ఆమెకు సపోర్టు చేశాడు. భరణి తనూజ వైపు లేకుండ మధ్యలో నిలబడి చూశాడు. సపోర్టు ఇవ్వమని అడిగిన ఇవ్వలేదు. దీంతో ఈ తండ్రి కూతుళ్ల బంధం తెగిపోయినట్టే ఉంది.
ఎందుకంటే ఇప్పుడు అర్థమైందా నాకు ఎవరి సపోర్టు లేదని. అందరు మాటల వరకే. ఎవరూ నా వాళ్లు కాదు. ఇకపై ఎవరిని నా మన మన అనుకోవద్దని అర్థమైంది అని రీతూ, మాధురితో అంటుంది.
మొత్తానికి ఈ టాస్క్ తర్వాత మొత్తానికి ఈ టాస్క్ తర్వాత తనూజ భరణి కు దూరమైపోతుంది అని చెప్పాలి. గతంలో చాలాసార్లు భరణి తనుజాకు సపోర్ట్ చేశాడు. ఇలా సపోర్ట్ చేసే తరుణంలో తన గేమ్ కూడా సరిగ్గా ఆడుకోలేకపోయాడు అనే విమర్శలు కూడా ఉన్నాయి.
అయితే భరణి మాత్రం తాను గేమ్ సరిగ్గా ఆడలేదు, తనుజా దివ్య వలన తన గేమ్ డిస్టర్బ్ అయింది అంటే మాత్రం ఒప్పుకోడు. కొంతమంది ఆడియన్స్ కూడా మీరు బంధాల్లో ఇరుక్కుపోయి సరిగ్గా ఆడటం లేదు అని భరణి చెప్పారు. దీనిని బట్టి ప్రస్తుతం భరణి రియలైజ్ అయ్యాడా అనిపిస్తుంది.
Also Read : Bigg Boss Telugu 9 : పోలీసులను ఆశ్రయించిన బిగ్ బాస్ కంటెస్టెంట్, పూర్తి ఆధారాలున్నాయంటూ ఆవేదన