 
					Bigg Boss 9 Priya Shetty : బిగ్ బాస్ సీజన్ మొదలైనప్పుడు అందరూ మాక్సిమం సెలబ్రిటీలే వచ్చారు. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన మొదటి సీజన్ చాలా అద్భుతంగా జరిగింది. ఎక్కువమంది సెలబ్రిటీలు ఆ షోలో ఉండడం కూడా మంచి ఆసక్తిని కలిగించింది. అయితే సీజన్లు పెరిగిన కొద్దీ తెలిసిన సెలబ్రెటీల కంటే కూడా తెలుసుకోవలసిన వ్యక్తులు ఎక్కువైపోయారు అనేది వాస్తవం.
మొత్తానికి ఈ రియాలిటీ షో 8 సీజన్లు పూర్తిచేసుకుని తొమ్మిదవ సీజన్ మొదలైపోయింది. తొమ్మిదవ సీజన్ మొదలై దాదాపు 50 రోజుల పైగా అవుతుంది. ఎవరు ఊహించని విధంగా ఈ సీజన్ లో మొత్తం ఆరుగురు కామనర్స్ ఎంట్రీ ఇచ్చారు. అయితే వారిలో ఆల్మోస్ట్ నలుగురు బయటికి వెళ్లిపోయారు.
ఈ సీజన్ మాత్రం చాలా ట్విస్ట్లతో కొనసాగింది. హౌస్ నుంచి బయటికి వెళ్లిపోయిన వాళ్ళు కూడా లోపలికి వచ్చే అవకాశాన్ని కల్పించారు బిగ్ బాస్. అయితే ఈ అవకాశం కేవలం ఇద్దరికి మాత్రమే దక్కింది ఒకటి కామనర్ అయిన శ్రీజ మరియు సెలబ్రిటీ అయిన భరణి. దీనిపైన ప్రియా శెట్టి రియాక్ట్ అయ్యారు. ఇంస్టాగ్రామ్ వేదికగా స్టోరీ పెట్టింది.
ప్రేక్షకుల ఓట్ల ద్వారా ఎలిమినేట్ అయిన ఒక వ్యక్తికి మాత్రమే రెండవ అవకాశం లభించడం నిజంగా చాలా నిరాశపరిచింది. ఓటింగ్ నుండి తొలగించబడిన మనందరి సంగతేంటి? మనం కూడా అదే అవకాశం పొందేందుకు అర్హులం కాదా? ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలి. నిజమైన న్యాయం అంటే అదే.
రాము రాథోడ్ కంటే భరణికి తక్కువ ఓట్లు పడటం వల్లే హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయారు. శ్రీజ ఎలిమినేట్ అయినప్పుడు జస్టిస్ ఫర్ శ్రీజ అంటూ చాలామంది సోషల్ మీడియాలో హడావిడి చేశారు. మొత్తానికి సోషల్ మీడియా ఎఫెక్ట్ వలన శ్రీజ కూడా హౌస్ లోకి ఎంటర్ ఇచ్చింది.
అయితే భరణిని ఎందుకు తీసుకున్నారు అనేది ప్రియా శెట్టి ఆవేదన. మమ్మల్ని కూడా అలానే హౌస్ లోకి ఎంటర్ చేయాలి కదా అనేది ఆవిడ ఉద్దేశం. కానీ ఒక సెలబ్రిటీ ఒక కామనర్ ను మళ్ళీ లోపలికి పంపించే ప్రయత్నం అని కూడా అనుకోవచ్చు. నిజమైన బిగ్బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత యాజమాన్యాన్ని ఈ రేంజ్ లో క్వశ్చన్ చేయటం అనేది సాహసం అనే చెప్పాలి.
అయితే సోషల్ మీడియాలో మరో వెర్షన్ కూడా నడుస్తుంది కేవలం. తనుజాన్ని సపోర్ట్ చేయడం కోసమే భరణిను బిగ్బాస్ లోపలికి పంపించారు అనేది కొంతమంది అభిప్రాయం. అయితే బిగ్ బాస్ యాజమాన్యం తనుజ విషయంలో కొంతమేరకు సపోర్ట్ గా ఉన్నట్లు కొన్ని ఎపిసోడ్లు చూస్తే అర్థమవుతుంది.
Also Read: Champion Movie : రిస్కు తీసుకొని కొనుక్కోవాల్సిందే, రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు