 
					Rashmika Mandanna On Bigg Boss Telugu 9: ఈ వీకెండ్ హోస్ట్ నాగార్జున రాకతో బిగ్ బాస్ తెలుగు 9కి మరింత ఆసక్తిగా మారనుంది. ఈ వారం హౌజ్లో జరిగిన రచ్చ అంత ఇంత కాదు. టెంపరరీ హౌజ్‌మేట్ వచ్చిన శ్రీజ టెంపర్ చూపిస్తూ ఓవరాక్షన్ చేస్తుంది. మరోవైపు రీతూ, డిమోన్లు సంబంధం లేకుండ గొడవలు పడుతున్నారు. వారిక ఈ వారం నాగ్ సర్ నుంచి గట్టి కొటింగ్ పడాలని ఆడియన్స్ అంత కొరుకుంటున్నారు. దీంతో దీంతో బిగ్బాస్ ప్రియులంత నాగార్జున రాక కోసం ఎదురుచూస్తున్నారు. నిజానికి బిగ్బాస్ షో ఆసక్తికరమైన ఘట్టమేదైన ఉందంటే అది వీకెండ్ ఎపిసోడ్సే.
ఆ వారం కంటెస్టెంట్స్ ఆట తీరుపై రివ్యూ ఇస్తూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్న కంటెస్టెంట్స్ లెక్కలు తేలెస్తాడు హోస్ట్. అందుకే వారమంత షో చూడని వారు వీకెండ్ ఎపిసోడ్ చూసేందుకు అమితాసక్తి చూపిస్తారు. అయితే వీకెండ్ నాగార్జునతో పాటు మరో బిగ్ సెలబ్రిటీ మరింత గ్లామర్ టచ్ ఇవ్వబోతుంది. బిగ్ బాస్ షోలోకి స్టార్ హీరోయిన్ రాబోతోంది. ఆమె మరెవరో కాదు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ఈ వీకెండ్ ఎసిపోడ్‌లో రష్మిక మందన్నా బిగ్ బాస్ స్టేజ్‌పై సందడి చేయబోతుంది. దసరా ఫేం రక్షిత్ శెట్టి హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ ‘గర్ల్ ఫ్రెండ్’.
నటుడు, దర్శకుడు రాహుల్ రవింద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 7న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ భాషలో వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్తో బిజీగా ఉంది. వరుస ఇంటర్య్వూలు, ప్రెస్ మీట్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమం గర్ల్ ఫ్రెండ్ టీం బిగ్ బాస్ షోకి రాబోతోంది. బిగ్ బాస్ స్టేజ్‌పైకి వచ్చిన గర్ల్ ఫ్రెండ్ మూవీ విశేషాలతో పాటు కంటెస్టెంట్స్తో సరదగా ఆడిపాడనుంది.
Also Read: Bigg Boss : బిగ్బాస్ తనూజపై మాజీ కంటెస్టెంట్స్ యష్మీ, శ్రీసత్య ట్రోలింగ్.. వీడియో వైరల్!
ఈ క్రమంలో గర్ల్ ఫ్రెండ్ మూవీ డైరెక్టర్ రాహుల్ రవింద్రన్, హీరో రక్షిత్తో పాటు రష్మిక కూడా బిగ్బాస్ స్టేజ్‌పైకి రానుందట. ఈ సందర్భంగా కంటెస్టెంట్స్ తో సరదాగా మాట్లాడుతూ వారితో ఆడిపాడుతూ సందడి చేయబోతుంది. దీంతో ఈ వీకెండ్ ఎపిసోడ్ నాగార్జునతో పాటు రష్మిక రాకతో మరింత గ్లామర్గా, సందడి ఉండబోతుందంటూ ఆడియన్స్ అంత మురిసిపోతున్నారు. కాగా ఇంటెన్స్ లవ్‌స్టోరీగా వస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, రావు రామేష్, రోహిణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్త నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడిలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.