Ramya Moksha: బిగ్ బాస్ సీజన్ 9 లో ఎవరు ఊహించని విధంగా ఫైర్ స్ట్రోమ్ వచ్చింది. హౌస్ నుంచి ఇప్పటికే ఆరుగురు కంటెస్టెంట్లు బయటకు వెళ్లిపోయారు. ఆరుగురు కంటెస్టెంట్లు బయటకు వెళ్లిపోయిన కూడా మరో ఆరుగురిని హౌస్మేట్స్ గా రీప్లేస్ చేశారు. వాళ్లలో దువ్వాడ మాధురి, అలేఖ్య చిట్టి పికిల్స్ మోక్ష రమ్య సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు కాబట్టి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
బిగ్ బాస్ హౌస్ లోకి కామనర్స్ ఎందుకు తీసుకురాకూడదు అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా వాళ్ళు మారారు. ముఖ్యంగా మోక్ష రమ్య మాట్లాడిన తీరు చాలా మందికి చిరాకు పుట్టిస్తుంది. ఎంతొస్తే అంతా మాట్లాడటం మొదలుపెడుతుంది. హౌస్ మేట్స్ పైన కొన్ని ఒపీనియన్స్ నలుగురు మధ్య మాట్లాడుతుంది. ఈ తరుణంలో వాళ్లను ఆడియన్స్ చూస్తున్నారు అనే విషయం మర్చిపోయినట్లు ఉంది.
ఆర్మీ ఆఫీసర్ కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. టాస్కులు విషయంలో కూడా కళ్యాణ్ గేమ్ ఆడే తీరు చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం 6వ వారం కెప్టెన్ గా కూడా కళ్యాణ్ ఉన్నాడు. అటువంటి కళ్యాణ్ పైన పచ్చళ్ళ పాప నోరు పారేసుకుంది.
దువ్వాడ మాధురి తో పాటు కూర్చుని కళ్యాణ్ కు అమ్మాయిలు పిచ్చి ఎక్కువగా ఉంది. అని పచ్చళ్ళు పాప చెప్పేసింది. నన్ను కూడా ట్రై చేశాడు నేను పెద్దగా పట్టించుకోలేదు అనేటట్లు మాట్లాడింది. తనుజ ఎక్కువగా అవకాశం ఇవ్వడం వల్ల పైన చేతులేస్తూ మరీ మాట్లాడుతున్నాడు అని చెప్పింది.
అలేఖ్య చిట్టి పీకిల్స్ వలన వీళ్లు పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో పచ్చళ్ళు కాస్ట్ అడిగినందుకు ఒక వ్యక్తి పైన దురుసుగా మాట్లాడి అవమానపరిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వీళ్ళ మీద విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. కెరియర్ మీద ఫోకస్ అనే దాన్ని పట్టుకొని చాలామంది ట్రోల్ చేశారు. అంత ట్రోలింగ్ జరిగిన తర్వాత మళ్లీ క్షమాపణలు చెబుతున్నట్టు ఒక వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
అయితే అక్కడితో కథ సుఖాంతం అనుకుంటే ఇప్పుడు మోక్ష రమ్య చేస్తున్న కామెంట్స్ ఇంకా సంచలనం రేపుతున్నాయి. టీవీ చూస్తున్న ప్రేక్షకుల అంతా కూడా కళ్యాణ్ అమ్మాయిల పిచ్చోడు అని రమ్య మాటలను పరిగణలోకి తీసుకుంటే.?
కళ్యాణ్ ఆర్మీ ఆఫీసర్. అలాగే సెలబ్రెటీ కాదు.. ఓ సాధరణ కుటుంబానికి చెందిన అబ్బాయి. అతన్ని పట్టుకుని రమ్య అమ్మాయిల పిచ్చోడు అని కోట్లాది మంది చూస్తున్న టీవీలో అంది.
ఇప్పుడు ఆ అబ్బాయి పరిస్థితేంటి.. పాపం పెళ్లి అవుతుందా ? అతనితో ఏదైనా ఇష్యూ ఉంటే తనకు పర్సనల్ గా చెప్పాలి. అంతే కానీ, ఇలా బయటికి చెప్పడం వల్ల ఆర్మీ ఆఫీసర్ అని చెప్పుకునే వాళ్ల తల్లిదండ్రులు ఏం అయిపోతారు. అని మినిమం ఆలోచించలేదు.. రమ్య పక్కాగా… కళ్యాణ్ ను టార్గెట్ చేయడానికే హౌస్ లోకి వచ్చినట్టు మాట్లాడుతుంది. దీనిపై నాగార్జున ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Also Read: Bigg Boss 9 Emmanuel : ఇమ్మానుయేల్ కి ఎందుకు అంత భయం? దొంగ చాటు మాటలు