Bigg Boss Thanuja : బిగ్ బాస్ 9లో వైల్డ్ కార్డు ఎంట్రీస్ ద్వారా ఆరుగురు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వారిలో ఆయేషా ఒకరు. తమిళ్ బిగ్ బాస్ హౌస్ లో ఆయేషా దాదాపు 65 రోజులు పాటు ఉన్నారు. మళ్లీ ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ లో వైల్డ్ కార్డుతో ఎంట్రీ ఇచ్చారు. ఆయేషా ఎంట్రీ ఇచ్చినప్పుడే మంచి ఎనర్జీగా స్టేజి మీద కనిపించింది. కింగ్ నాగార్జున కూడా వావ్ వాట్ ఏ ఎనర్జీ అని అప్పుడే అన్నారు. హౌస్ లో ఎనర్జీ లేదు కదా అని రివర్స్ లో కూడా అనేసింది ఆయేషా.
ఫైర్ స్ట్రోమ్ వాళ్లకి నామినేషన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి. ఆయేషా తనూజను నామినేట్ చేశారు. ఆయేషా తనూజ ని నామినేట్ చేస్తూ చెప్పిన ప్రతి పాయింట్ హౌస్ మేట్స్ అందరికీ గట్టిగా తాకింది. నిజాన్ని నిర్భయంగా మాట్లాడింది ఆయేషా. హౌస్ మేట్స్ అందరూ కూడా ఆలోచించే విధంగా తన పాయింట్స్ ను మాట్లాడింది.
అందరూ ఇక్కడికి ఫ్యామిలీను వదిలేసి వచ్చారు. రేపు అనే రోజు నువ్వు నేను నామినేషన్ లో నిలుచుంటే.. ఆయన నీకు ఫేవర్ గా సేవ్ చేస్తాడు. 5 మంత్స్ బేబీ ని కూడా వదిలేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నాన్న నాన్న అంటున్నావ్ నీ సొంత నాన్న కాదు కదా. బిగ్ బాస్ అంటే ఒకటే విన్నర్, నీ చేయి పట్టుకొని స్టేజి మీదకి ఎక్కించి కప్పు ఇవ్వడానికి నాన్నగారు ఇక్కడికి రాలేదు.
అందరూ వినండి ఈ సీజన్ ఎలా ఉందంటే బాయ్ ఫ్రెండ్, నాన్న ఉంటే చాలు ఫైనల్ వరకు వెళ్ళిపోవచ్చు అనేలా ఉంది. ఇండివిడ్యువల్ గా ఆడండి. ఇది నాకు సెకండ్ ఛాన్స్ కాబట్టి దీని వ్యాల్యూ నాకు తెలుసు. ఇక్కడ చాలా ఫేవరిజం ఉంది. నేను రానున్న రోజుల్లో అన్ని బయటకు తీస్తాను అని ఆయేషా చెప్పింది.
నేను ఇండివిడ్యువల్ గా ఆడడానికి వచ్చాను. తనుజాను ఉద్దేశిస్తూ.. “నువ్వు ఏ ఒక్క రోజైనా ఇండివిడ్యువల్ గా ఆడావా? నీకు సపోర్ట్ లేకపోయినా.. నాకు నాన్న ఎందుకు స్టాండ్ తీసుకోవట్లేదు అని ఏడుస్తున్నావ్. ఎమోషనల్ స్టేటస్ ని నువ్వు ఎప్పుడూ వాడొద్దు అని ఆయేషా తనుజాకి చెప్పింది. అది లేకుండా ఆడి గెలిచే కెపాసిటీ నీకు ఉంది. అది చూపించు అని ఆయేషా చెప్పింది. ఇద్దరి మధ్య కొద్దిసేపు హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది.
అయితే అలా గొడవ జరుగుతున్న సమయంలోనే.. తనూజ భరణిని నాన్న కాదు సార్ అని అంటుంది. అంటే గేమ్ కోసమే నాన్న… ఇప్పుడు అంతా తెలిసిపోయింది కాబట్టి సార్ అనే వచ్చేసింది. నిజమైన బంధమే అయితే… గేమ్ కాకపోతే… ఎంత మంది ఎన్ని అన్నా కూడా నాన్న అనే పిలిచేది కదా.. అలా మొత్తానికి ఆయేషా దెబ్బకి తనూజ బయటపడింది. మరి ఇప్పటికైనా భరణి శంకర్ జాగ్రత్త పడతారేమో చూడాలి అంటూ బిగ్ బాస్ లవర్స్ కామెంట్లు చేస్తున్నారు.
ఇకపోతే హౌస్ లో వీరిద్దరి మధ్య ఆర్గుమెంట్ అంతా జరుగుతుంటే హౌస్మేట్స్ చాలా ఆసక్తికరంగా చూశారు. వాస్తవానికి ఆయేషా చెప్పిన ప్రతి పాయింట్ కూడా ఆడియన్స్ కి కూడా కరెక్ట్ అనిపించేలానే ఉన్నాయి. ఆయేషా పాయింట్స్ చూస్తుంటే ఫైర్ స్ట్రోమ్ అనే పేరు ఖచ్చితంగా ఈమెను చూసి పెట్టారేమో అనే ఫీలింగ్ కలుగుతుంది.
ALSO READ:Kantara Chapter 1 : బాహుబలి రికార్డును చిత్తు చేసిన రిషబ్ శెట్టి… సాహోరే అనాల్సిందేనా ?