Bigg Boss 9 Emmanuel : బిగ్ బాస్ సీజన్ 9 మొత్తానికి ఆరువ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. హౌస్ లో ఉన్న ఆరుగురు కంటెస్టెంట్లు ఆల్రెడీ బయటికి వెళ్లిపోయారు. షో తుది దశకు చేరిపోతుంది అనుకున్న తరుణంలో, ఫైర్ స్ట్రోమ్ అంటూ మరో ఆరుగురుని వైల్డ్ కార్డు ద్వారా లోపలికి పంపించారు. వారిలో ఇద్దరు కామనర్స్ ఉన్నారు. ఇద్దరు కూడా సోషల్ మీడియాలో బాగా ఫేమస్.
ఆల్రెడీ హౌస్ మేట్స్ కి ఒకరి పైన ఒకరికి కనీస అవగాహన వచ్చి ఉంటుంది. వాళ్ల మైండ్ సెట్ పెట్టి గేమ్ ఆడుదాము అని వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటారు. ఈ తరుణంలో కొత్తగా నలుగురు హౌస్ మేట్స్ రావడం, ఆల్రెడీ హౌస్ లో ఉన్న వాళ్ళకి కూడా షాకింగ్ గా అనిపించింది. ఇప్పటివరకు చూస్తున్న ఆడియన్స్ కి గాని, హౌస్ మేట్స్ కు గాని ఫేవరెట్ కంటెస్టెంట్ అనగానే మొదటి గుర్తుచేది ఇమ్మానుయేల్. ఎంటర్టైన్మెంట్ చేయడమే కాకుండా కొన్ని సార్లు ఇమ్మానుయేల్ ఆడే తీరు చాలా తెలివిగా ఉంది అని చెప్పాలి.
గేమ్ విషయంలోనూ, హౌస్ మేట్స్ తో ప్రవర్తించే విషయంలోనూ ఇమ్మానియేల్ కి ఎవరితో కూడా పెద్దగా గొడవలు లేవు. పైగా చాలామంది వీక్షకులకు అతని ఇచ్చే ఎంటర్టైన్మెంట్ బాగా నచ్చుతుంది. చాలామంది కామన్ ఆడియన్స్ కూడా అతనిని ఫేవరెట్ కంటెస్టెంట్ గా చెబుతున్నారు.
కానీ ఇమ్మానుయేలు కంటే బాగా ఆడుతున్న ప్లేయర్స్ ని చూసినప్పుడు తను దొంగ చాటుగా వెనక్కు మాట్లాడటం మొదలు పెడుతున్నాడు. ఈ ఐదు వారాలు జరిగిన షో అబ్జర్వ్ చేస్తే, మొదట కళ్యాణ్ బాగా ఆడుతున్నాడు అని తెలిసి అతని గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. తర్వాత శ్రీజ బాగా ఆడుతుంది అని చెప్పి ఆమె గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు.
ఇక తాజాగా జరిగిన ఎపిసోడ్ లో రాము గురించి రీతు చౌదరితో వాష్ రూమ్ లో మాట్లాడిన మాటలు వింటే, ఇమ్మానుయేల్ ఇన్ సెక్యూర్ ఫీల్ అవుతున్నాడు అని ఖచ్చితంగా అనిపిస్తుంది.
రాము తన తప్పు ఉన్నప్పుడు సరే అది వదిలేద్దాం అని తప్పుకుంటాడు. తన తప్పులు గురించి ఎక్కువగా మాట్లాడడు. మొన్న బిగ్ బాస్ వచ్చినప్పుడు కూడా అతి తెలివిగా నేను సంచాలక్ గా ఉన్నప్పుడు రీతుకి పవన్ కి చెప్పాను సార్ కానీ వాళ్ళు వినలేదు అని చాలా ఈజీగా తప్పించుకున్నాడు.
నేను అలా చెప్పకపోవడం వలన దొరికిపోయాను అని రీతు చౌదరితో ఇమ్మానుయేల్ చెబుతున్నాడు. మరోవైపు రీతూ చౌదరిని నామినేట్ చేశాడు కాబట్టి రాము మీద మామూలుగానే తనకి ఒక కోపం ఉంటుంది అందుకే వీళ్ళిద్దరూ కలిసి రాము గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. ఈ విషయాలన్నీ అబ్జర్వ్ చేస్తుంటే ఎక్కడో మూల ఇమ్మానుయేల్ భయపడుతున్నాడు అని ఈజీగా అర్థమవుతుంది. ప్రస్తుతం అలానే హౌస్ మేట్స్ అందరినీ డీకోడ్ చేసే పనిలో ఉన్నాడు
Also Read: Duvvada Madhuri : మాధురికి సినిమా చూపిస్తానంటున్న సంజన.. జుట్టు జుట్టు పట్టుకొని…