Duvvada srinivas: తెలుగు బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) కార్యక్రమం ప్రస్తుతం ఐదు వారాలను పూర్తిచేసుకుని 6వ వారంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఐదవ వారంలో భాగంగా ఆరుగురు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా కంటెస్టెంట్ లో హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇలా వెళ్లిన వారిలో దివ్వెల మాధురి(Divvela Madhuri) ఒకరు. ఈమె ప్రముఖ రాజకీయ నాయకుడు దువ్వాడ శ్రీనివాస్(Duvvada Srinivas) ద్వారా పెద్ద ఎత్తున పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టడంతో ఒక్కసారిగా ఈ కార్యక్రమానికి భారీ హైప్ రావడమే కాకుండా హౌస్ లో నువ్వా నేనా అంటూ పోటీ నెలకొంది.
ఇక మాధురి బిగ్ బాస్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్లడంతో బయట దువ్వాడ శ్రీనివాస్ పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఆమెకు కావాల్సినంత మద్దతును అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దువ్వాడ శ్రీనివాస్ మాధురి గురించి బిగ్ బాస్ కార్యక్రమం గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఒకవేళ మాధురి బిగ్ బాస్ విన్నర్ గా బయటకు వస్తే వచ్చిన ప్రైజ్ మనీ(Prize Money)తో మీరేం చేస్తారు అంటూ ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ.. భగవంతుడు మాకు చాలా ఇచ్చారు. బిగ్ బాస్ ప్రైజ్ మనీతో మాకు ఎలాంటి పని లేదని తెలిపారు.
ఇక మాధురి బిగ్ బాస్ విజేతగా బయటకు వస్తే ఆమె గెలిచిన ఆ ప్రైజ్ మనీ మొత్తం వికలాంగుల కోసం ఉపయోగిస్తామని అలాగే క్యాన్సర్ పేషంట్ల కోసం ఉపయోగిస్తామని తెలియజేశారు. చాలామంది వికలాంగులు జీవనం గడపడం కోసం ఎంతో కష్టపడుతుంటారు అలాంటి వారి కోసం ఈ డబ్బును ఉపయోగిస్తామని వెల్లడించారు. ఇలా పేద ప్రజల కోసం ఆ డబ్బును ఖర్చు పెడితే వారికి సహాయంగా ఉంటుందని తెలిపారు. ఇప్పటికే మాకు భగవంతుడు కావలసినంత డబ్బు ఇచ్చారు ఆ డబ్బుతో మేము ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్నాము. ఇక బిగ్ బాస్ ప్రైస్ మనీ కూడా అందులోకి కలుపుకొని సర్వీస్ చేస్తామంటూ ఈయన తెలిపారు.
క్యాన్సర్ పేషెంట్ల కోసం..
ఇలా బిగ్ బాస్ డబ్బులు క్యాన్సర్ పేషెంట్ల కోసం పేదవారికోసం ఉపయోగిస్తానని ఈయన చెప్పడంతో ఒక్కసారిగా ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. దివ్వెల మాధురి బిగ్ బాస్ విజేత అవుతుందని అంత నమ్మకం ఏంటి రాజా అంటూ కామెంట్లు చేయగా మరికొందరు మీలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అంటూ ఈయనపై విమర్శలు కురిపిస్తున్నారు. దివ్వెల మాధురి పై అన్ని అంచనాలు ఏమి పెట్టుకోవద్దు మరొక వారంలో ఆమె బయటకు వచ్చేస్తుంది అంటూ దువ్వాడ వ్యాఖ్యలపై కామెంట్లు కురిపిస్తున్నారు. ఇక వైల్డ్ కార్డు ద్వారా మాధురి, రమ్య మోక్ష వంటి వాళ్లు హౌస్ లోకి వెళ్లడంతో ఈ కార్యక్రమం కూడా కీలక మలుపు తిరిగిందని చెప్పాలి. మరి మాధురి తన ఆటతీరుతో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది.
Also Read: Siddu Jonnalagadda : చేతిలో మైక్ ఉంటే… ఊమనైజర్ కామెంట్స్‌పై హీరో సిద్దు ఘాటు కౌంటర్