E-Paper
Advertisement

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?
Advertisement

Bigg Boss : బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న టాప్ రియాల్టీ షో అంటే టక్కున గుర్తొచ్చేది మాత్రం బిగ్ బాస్.. తెలుగులో ఇప్పటికే 9 సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది పదో సీజన్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో అప్పుడే బిగ్ బాస్ లో కంటెస్టెంట్లుగా పాల్గొనే వాళ్ళ కోసం వేట మొదలుపెట్టింది. ఈసారి పదో సీజన్ మామూలుగా ఉండదు అంటూ సోషల్ మీడియాలో అప్పుడే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు బిగ్ బాస్ లోకి కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చిన చాలామంది సినిమా అవకాశాలు సీరియల్ అవకాశాలు లేకపోవడంతో సొంతంగా బిజినెస్ లు చేసుకుంటూ బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది ఇండస్ట్రీకి దూరమై ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. ఇంకొంతమంది అవకాశాలు వస్తాయని ఎదురు చూస్తూనే ఉన్నారు. బిగ్ బాస్ చాలామంది జీవితాలకు శాపంగా మారిందన్న వార్తలు ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి.. అలాంటి వారిలో అశ్విని శ్రీ, తేజస్వి మదివాడ కూడా ఉన్నారు. మిగిలిన వాళ్ళు ఏదో ఒక విధంగా ప్రేక్షకులను అలరిస్తూ డబ్బులు సంపాదిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మలు ఏం చేస్తున్నారు అన్నది ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

ఆ ఇద్దరికి శాపంగా మారిన బిగ్ బాస్..

ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న యాక్టర్స్ బిగ్ బాస్ లోకి అడుగు పెడుతుంటారు. ఈమధ్య స్టార్ ఇమేజ్ ఉన్న చాలా మంది బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చేందుకు ఇంట్రెస్ట్ కనబరుస్తున్నారు.. కొంతమంది మంచి ఆఫర్ ని వదులుకోలేక హౌస్ లోకి వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఈ షో చాలామందికి జీవితాన్ని ఇచ్చిందని చెప్పాలి. యూట్యూబ్ వీడియోల ద్వారా ఫేమస్ అయినా కొంతమందికి సినిమా అవకాశాలు వచ్చేలా చేసింది బిగ్ బాస్. కానీ కొంతమందికి మాత్రం శాపంగా మారింది. గత సీజన్లలో కంటెస్టెంట్ లో విషయానికి వస్తే తేజస్వి మదివాడ ఒకప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉండేది.. కానీ ఇప్పుడు పెద్దగా సినిమాలలో కనిపించలేదు. కేవలం పులితరపై ప్రసారమవుతున్న షోలలో మాత్రమే కనిపిస్తూ వస్తుంది.. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు మతిపోకూడదు..

Advertisement

అదేవిధంగా ఒకప్పుడు సినిమాలతో బిజీగా ఉన్నా ముద్దుగుమ్మ అశ్విని శ్రీ.. సరిలేరు నీకెవ్వరు లాంటి సూపర్ హిట్ సినిమాల్లో కూడా ఏమైనా నటించింది.. ఆ తర్వాత పలు సినిమాలలో నటించి బిజీగా మారింది. బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఆమె లైఫ్ పూర్తిగా మారిపోయింది అని ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టింది.. ప్రస్తుతం ఆడపాదడపా సినిమాలతో, యూట్యూబ్ వీడియోలతో తన జీవితాన్ని ముందుకు సాగిస్తుంది. వీర్లే కాదు చాలామంది అవకాశాలు లేక సొంతంగా వ్యాపారాలు మొదలుపెట్టారు.

బిగ్ బాస్ సీజన్ 10.. 

బిగ్ బాస్ సీజన్ 10 విషయానికి వస్తే.. ఈసారి కూడా గత ఎపిసోడ్ లాగే అగ్ని పరీక్షను నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారిని మాత్రమే హౌస్ లోకి తీసుకొని ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ సీజన్లో కూడా ఎక్కువగా కామనర్స్ ని తీసుకునే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కూడా బిగ్ బాస్ సీజన్ 10 కోసం అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. మరి ఈ సీజన్ ఎప్పుడు ప్రారంభమవుతుందో చూడాలి..

Advertisement

Also Read :యూట్యూబ్ ద్వారా తేజు నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Tags

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Big Stories

Advertisement
×