BigTV English

Bigg Boss 9 : పులిహోర పంచాయతీలు, ఎంగిలి చాక్లెట్లు, కెప్టెన్సీ కోసం కాలచక్ర ఛాలెంజ

Bigg Boss 9 : పులిహోర పంచాయతీలు, ఎంగిలి చాక్లెట్లు, కెప్టెన్సీ కోసం కాలచక్ర ఛాలెంజ

Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ 9 ఈరోజు ఎపిసోడ్ చాలా స్లోగా స్టార్ట్ అయింది. కానీ ఎండింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. రీతు చౌదరి పులిహార కోసం కొంతమందితో పులిహోర కలిపింది. ఆ తర్వాత డిమోన్ పవన్ కి గోరుముద్దలు తినిపించింది.


డిమోన్ పవన్

డిమోన్ పవన్ రీతు చౌదరి గురించి బెస్ట్ క్వాలిటీస్ చెప్పాడు చెప్పాడు. బాధ వస్తే ఎక్కువసేపు ఉండకూడదు ఆ బాధలో అనుకుంటుంది. అది చాలా మంచి హ్యాబిట్. ఏదన్న కూడా ఇన్స్టెంట్ గా మాట్లాడుతుంది. తర్వాత చూసుకుందాం తర్వాత మాట్లాడదాం అనుకునే టైపు కాదు. అందంగా ఉంటుంది. ముందు ఆ పాయింట్స్ అన్ని చెప్పిన తర్వాత చివర్లో అందంగా ఉంటుందని చెప్పాడు అది కొసమెరుపు.

హరీష్

మాస్క్ మెన్ హరీష్ ఫ్లోరాకి తంసప్ విషయంలోనూ, అలానే షాంపూ కండిషనర్ విషయంలో కూడా తనకు సారీ చెప్పారు. సంజనాను ఎంటర్టైన్మెంట్ చేసే ప్రాసెస్ లో తనుజాతో ఫోన్ కాల్ మాట్లాడుతున్నట్లు ఫన్ క్రియేట్ చేశాడు ఇమ్మానుయేల్.


తనుజ మాస్క్ మెన్ హరీష్ తో మాట్లాడుతూ మీ నవ్వు నేను ఇప్పటివరకు చూడలేదు. అంటూ హరిత అనే పేరుతో తనకున్న అనుభవాన్ని కూడా షేర్ చేసింది తనూజ.

కెప్టెన్ సంజన స్టేట్మెంట్ 

సంజన మొదటి కెప్టెన్ గా ఎంపికైన తర్వాత. హౌస్ మేట్స్ అందరితో మాట్లాడింది. టెనెంట్స్ ఓనర్స్ మధ్య అభిప్రాయ బేధాలు ఉండకూడదు. టెనెంట్స్ బానిసల్లాగా తక్కువగా చూడకూడదు అని సంజనా చెప్పగానే, శ్రీజ దమ్ము మేము ఎప్పుడు అలా చూడలేదు మీరు కొత్త కొత్త పదాలు తీయకండి అంటూ మాట్లాడింది.

ఎమోషనల్ మూమెంట్స్ 

తనుజ ఇమ్మానుయేల్ రీతు చౌదరి వీళ్ళ ముగ్గురు కూర్చుని చాలా ఎమోషనల్ గా మాట్లాడుకున్నారు. ఇక్కడ నాకు ఉన్నది మీరిద్దరే అంటూ ఇమ్మానుయేల్ ఎమోషనల్ అయ్యాడు. మొత్తానికి ముగ్గురు కలిసి ఒక్కసారిగా ఏడ్చేశారు. ఎందుకు ఏడ్చారు అనేది అదో గండికోట రహస్యం.

పవన్, కళ్యాణ్ ఒకరి తర్వాత ఒకరు వచ్చి రీతుతో మాట్లాడుతూనే ఉన్నారు. ఇక రీతు సగం చాక్లెట్ తిని ఎంగిలి చాక్లెట్ పవన్ కు ఇచ్చింది.

కెప్టెన్సీ కంటెండర్ కోసం టాస్క్

కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కోసం బిగ్ బాస్ రెండు గ్రూపులుగా పోటీ పడాలి అని చెప్పారు.. వీళ్లకు కాలమా చక్ర వ్యూహమా అనే టాస్క్ ను ఇచ్చారు. ఓనర్స్ టైం 10 నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ ఐ జీరో కి చేరుతుంది. టెనెంట్స్ టైం 12 గంటల నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ ఐ జీరో. సమయాన్ని బట్టి బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ ని కంప్లీట్ చేసి తమ టైమర్ జీరో కి తగ్గించుకోవచ్చు. ఈ గ్రూప్ అయితే తమ టైమర్ ను ముందుగా జీరోకి తీసుకెళ్తారో. వాళ్లే ఈ టాస్క్ విజేతలు. ఈ గ్రూప్ టైమర్ జీరో కి చేరేవరకు ఎవరు నిద్రపోకూడదు అని కండిషన్ పెట్టారు.

బిగ్ బాస్ 2 గ్రూప్స్ ముందు ఒక చక్రాన్ని పెట్టారు. దానిని బట్టి ఒక ఛాలెంజ్ ఇచ్చారు. ఆ ఛాలెంజ్ లో గెలవడం వలన ఇచ్చిన కౌంట్ డౌన్ లో వన్ అవర్ తగ్గించుకోవచ్చు. ఈ ఛాలెంజ్ లో ప్రతి గ్రూప్ నుండి ఐదుగురు సభ్యులు మాత్రమే పాల్గొంటారు. కాలచక్రానికి 10 హ్యాండిల్స్ ఉన్నాయి. ఒక గ్రూప్ సభ్యుడు పక్కన మరో గ్రూప్ సభ్యుడు ఉండేటట్లు నిల్చుని దానిని పట్టుకోవాలి. ఏ గ్రూప్ అయితే ఎక్కువసేపు ఈ కాలచక్రాన్ని పట్టుకొని ఉంటుందో వాళ్లే ఈ ఛాలెంజ్ లో విజేతగా నిలుస్తారు అని బిగ్ బాస్ చెప్పారు. ప్రియా తనుజ ఈ చాలెంజ్ కు  సంచాలకులుగా వ్యవహరించారు.

Also Read: OG Ticket: ఏపీలో ‘ఓజి’ స్పెషల్ షోకు గ్రీన్ సిగ్నల్.. టికెట్ ధర తెలిస్తే షాకే!

Related News

Bigg Boss 9 Promo : కామనర్స్ మరీ ఇంత కరువులో ఉన్నారా… హౌస్‌లో అందరూ చూస్తుండగానే

Bigg Boss 9: ముద్దుల వర్షం కురిపించిన ఇమ్ము.. తనూజా ఏం చేసిందంటే?

Bigg Boss 9 Telugu : తినడం కోసమే బిగ్ బాస్ కు వస్తారా? భరణిపై ఎందుకు అంత పగ..?

Bigg Boss 9 : దమ్ముంటే బిగ్ బాస్ ని అడగండి, ఆడవాళ్ళందరూ కలిసి మాస్క్ మెన్ పై రెచ్చిపోయారు

Bigg Boss 9 : అమ్మ బాబోయ్ ఇది వేరే లెవెల్. గుండు అంకుల్, రెడ్ ఫ్లవర్ పంచాయతీ ఇంకా తెగలేదు 

Bigg Boss 9 : నీకు నచ్చినట్టు నేను ఉండను, రీతు చౌదరి రెచ్చిపోయిందిగా..

Bigg Boss 9 Promo: నరాలు కట్ అయ్యే ప్రోమో, ఈరోజు ఎపిసోడ్ రచ్చ రచ్చే

Big Stories

×