OG Ticket: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఓ జి. సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాలో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పాటలు కూడా మంచి హైప్ క్రియేట్ చేశాయి.
ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో రాత్రి ఒంటిగంటకు షోస్ వేయడం అనేది ఆనవాయితీగా మారిపోయింది. ఒకప్పుడు సినిమా అంటే పొద్దున్నే ఫస్ట్ షో పడేది. ఇప్పుడు డేట్ మారితే చాలు సినిమా చూసేసే అవకాశం అభిమానులకు దక్కుతుంది. ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓ జి సినిమాకు ఆంధ్రాలో రాత్రి 1:00 కి షోస్ మొదలుకానున్నాయి.
హోం డిపార్ట్‌మెంట్ సినిమాస్ శ్రీ డివివి దానయ్య, నిర్మాత, డివివి ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి, హైదరాబాద్ “ఓజి” సినిమా టికెట్ ధరలను పెంచమనే అభ్యర్థన అభ్యర్థనకు అనుమతి లభించింది.
డివివి దానయ్య ఉదహరించబడిన రిఫరెన్స్‌లో నివేదించబడిన పరిస్థితులలో, ప్రభుత్వం ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని థియేటర్లకు 1 మరియు 2వ ఉదహరించబడిన రిఫరెన్స్‌లలో పేర్కొన్న నియమాలు/మార్గదర్శకాలను సడలిస్తూ, 25.09.2025న “OG” సినిమా విడుదల కోసం క్రింద వివరించిన విధంగా ఒక బెనిఫిట్ షోను ప్రదర్శించడానికి మరియు టిక్కెట్ ధరలను పెంచడానికి ఇందుమూలంగా అనుమతిస్తున్నట్లు. అధికారికంగా ప్రకటించారు.
25.09.2025న ఉదయం 1.00 గంటలకు రూ. 1000/- (GSTతో సహా) బెనిఫిట్ షో టికెట్ ధరతో ఒక బెనిఫిట్ షోను ఫిక్స్ చేశారు. ప్రదర్శించడానికి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక రోజులో ఐదు షోలకు మించకూడదు. ఒక విధంగా ఇది కొంచెం భారీ కాస్ట్ అని చెప్పాలి. పుష్ప సినిమాతో పోలిస్తే కొంతమేరకు తక్కువ అని చెప్పుకోవాలి. పుష్ప సినిమా టికెట్ దాదాపు 1200 వరకు వెళ్ళింది.
రీసెంట్ టైమ్స్ లో పవన్ కళ్యాణ్ సినిమా మాత్రమే కాకుండా మిగతా హీరోల సినిమాలకు కూడా భారీ టికెట్ కాస్ట్ పెట్టారు. అయితే అభిమానులు మాత్రం టికెట్ రేటు ఎంతున్న తమకిష్టమైన నటుడిని చూడటానికి థియేటర్ వరకు వస్తారు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం కొంతమేరకు ఆలోచిస్తారు.
ఒక కుటుంబంలో నలుగురు ఉంటే నాలుగు వేలు పెట్టుకొని సినిమా చూడాల్సిన పరిస్థితి. అలానే థియేటర్ లోపల పాప్కాన్ రేట్లు కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. దాదాపు ఒక సినిమా కోసం 6 నుంచి 7000 వరకు ఒక ఫ్యామిలీకి అయిపోతుంది. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. అయితే మరుసటి రోజు నుంచి తక్కువ రేట్ కాబట్టి సినిమా మంచి టాక్ ఉంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వస్తారు.
Also Read : OG Censor : ఓజి సినిమా సెన్సార్ పూర్తి, కొత్త రికార్డులు ఖాయం