Bigg Boss 9 : బాస్ సీజన్ 9 డే 32వ రోజు ఎపిసోడ్ బ్లాక్ బస్టర్ పాటతో మొదలైంది. కొన్ని డిస్కషన్ తర్వాత ఇచ్చిన టాస్కులు బట్టి అలసిపోయారు కాబట్టి ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ మోడ్ లోకి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను అని బిగ్ బాస్ చెప్పారు. నవ్వుతూ నవ్విస్తూ టాస్క్ ఎంజాయ్ చేయాలి అని చెప్పారు. ఎంటర్టైన్మెంట్ అవ్వడం మాత్రమే కాకుండా టాస్క్ లో గెలవాలి అని కండిషన్ కూడా పెట్టారు. ఇందుకోసం బిగ్బాస్ నాచోరే నాచ్ అనే టాస్క్ ఇచ్చారు.
గార్డెన్ ఏరియాలో ఉన్న గోడ వెనుక నిలుచుని మ్యూజిక్ వస్తునంతసేపు డాన్స్ చేయాలి. మ్యూజిక్ ఆగిన వెంటనే గోడకు ఉన్న కలర్ హోల్స్ లో బిగ్ బాస్ చెప్పిన కలర్ హోల్ నుండి బయటికి రావాలి ఇది టాస్క్. ఇమ్మానుయేల్, రాము రాథోడ్ సంచాలకులుగా వ్యవహరించారు. ఒక రౌండ్ లో గెలిచిన జంట ఇంకో రౌండ్లో పాల్గొనవలసిన అవసరం లేదు.
ఈ టాస్క్ లో మొదట కళ్యాణ్ గెలిచాడు. కళ్యాణ్ చాలా కష్టపడి ఈ టాస్క్ లో గెలిచాడు. మరోవైపు కళ్యాణ్ ప్యాంటు కూడా అలాగే ప్రయత్నం చేశారు. దీనిపైన తనుజ కూడా హౌస్ మేట్స్ పైన ఫైర్ అయ్యారు. దీని మీద విపరీతమైన ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. టాస్క్ రీ టేక్ చేసే ప్రయత్నం కూడా చేశారు. బిగ్బాస్ లో అలాంటివి చెల్లవు అని బిగ్ బాస్ చెప్పారు. మొత్తానికి కళ్యాణ్ ను విన్నర్ గా డిసైడ్ చేశారు సంచాలకులు. అయితే శ్రీజ వాళ్లతో ఆర్గుమెంట్ లోకి దిగింది.
సెకండ్ రౌండ్ లో దివ్య గెలిచారు. దివ్య గలడంతో భరణి మంచి జోష్ లో ఉన్నారు. మూడవ రౌండ్ లో పవన్ గెలిచాడు. యాజ్ ఇట్ ఈజ్ గా రీతూ ఒక హగ్ ఇచ్చింది. 4వ రౌండ్ లో సుమన్ శెట్టి గెలిచారు. సుమన్ శెట్టి పర్ఫామెన్స్ పై హౌస్ మేట్స్ ప్రశంసలు కురిపించారు.
ఈ టాస్క్ లో గెలిచిన తర్వాత మొదటి లీడ్ బోర్డ్ లోకి భరణి మరియు దివ్య చేరిపోయారు. చివరి లీడ్ బోర్డ్ లో ఫ్లోరా మరియు సంజన ఉన్నారు. తర్వాత సుమన్ శెట్టి, శ్రీజ ఉన్నారు. టాస్క్ లో గెలిచిన కారణంగా భరణి మరియు దివ్య కు ఒక ప్రత్యేకమైన అధికారాన్ని ఇచ్చారు. లాస్ట్ లో ఉన్న లీడ్ బోర్డ్ వాళ్ళకి టాస్క్ లో పాల్గొనే అర్హత లేదు అని స్కోర్ తో సంబంధం లేకుండా డిసైడ్ చేయమని చెప్పారు.
దివ్య మరియు భరణి మాట్లాడుకునే టైంలో సంజన వచ్చే రిక్వెస్ట్ చేయడం మొదలుపెట్టింది. మరోవైపు సుమన్ శెట్టి శ్రీజ కూడా వచ్చి వాళ్లను రిక్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. మొత్తానికి ఫ్లోరా మరియు సంజన టీంను అర్హత లేదు అని డిసైడ్ చేసేసారు.
ఫిజికల్ టాస్క్ తన వలన కావట్లేదు ఇలా ఉంటే నా వలన అవదు ఇంటికి వెళ్ళిపోతాను అని సంజన కన్నీళ్లు పెట్టుకుంది. గర్ల్స్ తో పోరాడుతాను గాని బాయ్స్ తో ఎలా పోరాడుతాను అంటూ బిగ్ బాస్ ని ఎమోషనల్ గా ప్రశ్నించింది. ఇమ్మానుయేలు వచ్చి ఓదార్చే ప్రయత్నం చేశాడు.
మరోవైపు తనూజ కూడా వచ్చి నేను ఒకదాని గురించి మాట్లాడినప్పుడు నాన్న ఏమి మాట్లాడకుండా మొత్తం దివ్య నే మాట్లాడింది. తరువాత ఏమైంది అని నాన్న అడుగుతున్నాడు. ఏమీ అర్థం కావట్లేదు అంటూ తనుజ కూడా భరణి మీద మాట్లాడేసింది.
పిరమిడ్ టాస్కు కు ఎప్పటిలానే ఇమ్మానుయేల్ మరియు రాము సంచాలకులుగా వ్యవహరించారు. ఫస్ట్ ప్లేస్ లో కళ్యాణ్ అండ్ తనుజ, సెకండ్ ప్లేస్ లో భరణి మరియు దివ్య. థర్డ్ ప్లేస్ లో సుమన్ మరియు శ్రీజ గెలిచారు. చివరి స్థానంలో రీతు మరియు పవన్ ఉన్నారు.
రీతు వలనే టాస్క్ పోయినందుకు పవన్ ఫీలయ్యాడు. మరో వైపు రీతు కూడా ఘోరంగా ఏడ్చి కన్నీళ్లు పెట్టుకుంది. గెలిస్తే హాగ్ ఇచ్చుకునే వీళ్ళ మధ్య ఇటువంటి సిచువేషన్ వస్తుందని ఎవరు ఊహించి ఉండరు.
స్కోర్ ఎక్కువగా ఉంది కాబట్టి భరణి మరియు దివ్య ను డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్ కి వెళ్లే అధికారం ఇచ్చారు బిగ్ బాస్. ఆ తర్వాత స్థానంలో ఉన్న ఒక్క టీం కి ఒకరి మాత్రమే సేఫ్ జోన్ కి వెళ్లే అవకాశం ఇచ్చారు. తనుజ మరియు కళ్యాణ్ మధ్య కొంత సేపు డిస్కషన్ జరిగిన తర్వాత కళ్యాణి సేఫ్ జోన్ కి పంపింది తనుజ.
Also Read: Bigg boss 9: దివ్య వచ్చాక భరణి నిజంగానే మారిపోయాడా? అసలు సంజన ఎమోషన్ వెనుక అర్థం ఉందా?