Bigg boss 9: బిగ్ బాస్ సీజన్ 9 మొదలయ్యేటప్పుడే ఇది చదరంగం కాదు రణరంగం అని ప్రోమోలో కట్ చేశారు. అదేవిధంగా కామనర్స్ ను హౌస్ లోకి ఎంటర్ అయ్యేలా చేశారు. మొత్తానికి కామనర్స్ కి సెలబ్రిటీస్ కి మధ్య ఈ పోటీ నడుస్తుంది అని అందరు ఊహించారు. కానీ రోజులు మారే కొద్ది కామనర్స్ సెలబ్రిటీస్ కలిసి పోయారు. ఇప్పుడు సెలబ్రిటీస్ మధ్య సెలబ్రిటీస్ కు పడట్లేదు. కామనర్స్ మధ్య కామనర్స్ కు పడటం లేదు.
ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకున్న ఈ సీజన్ లో ఒక సెలబ్రిటీ ముగ్గురు కామనర్లు బయటికి వెళ్లిపోయారు. అయితే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా దివ్య వెలమూరి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రెండు వారాలు బయట నుంచి బిగ్ బాస్ అబ్జర్వ్ చేసింది దివ్య వెలమూరి.
దివ్య హౌస్ లోకి ఎంటర్ ఇచ్చిన తర్వాత రెండు వారాలు పాటు గేమ్ ఏమి గమనించావు దానిని బట్టి ర్యాంక్స్ ఇవ్వాలి అని బిగ్ బాస్ చెప్పారు. అలానే గేమ్ గమనించి ర్యాంక్స్ కూడా ఇచ్చింది దివ్య. ప్రతి ర్యాంక్ కి ఎక్స్ప్లనేషన్ కూడా ఇచ్చింది. దివ్య ఇచ్చిన ర్యాంక్స్ తో చాలామంది ఒపీనియన్ కనెక్ట్ అయింది.
ఇక దివ్య భరణి కలిసి లీడ్ బోర్డ్ టీం లో మొదట స్థానంలో ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి జంటగా టాస్కులు ఆడుతున్నారు. అయితే దివ్య వచ్చిన తర్వాత భరణి కంప్లీట్ గా మారిపోయాడు. చెల్లిని పట్టించుకోవట్లేదు కూతురిని పట్టించుకోవట్లేదు అని ఎమోషనల్ అయిపోయింది సంజన. సంజన ఇలా అనడం ఎంతవరకు కరెక్ట్?
లీడ్ బోర్డులో సంజన మరియు ఫ్లోరా చివరి రెండవ స్థానంలో ఉన్నారు. అయితే వాళ్లను టాస్కుకు అనర్హులుగా ప్రకటించే బాధ్యతను దివ్య మరియు భరణికి బిగ్ బాస్ ఇచ్చాడు. ఈ తరుణంలో వాళ్లు డిసైడ్ చేసుకొని ఫ్లోరాను మరియు సంజనాను అనర్హులుగా ప్రకటించారు.
సంజన దీనిని పట్టుకొని బాగా ఎమోషనల్ అయిపోయారు. ఒక్కొక్కసారి శాక్రిఫైజ్ చేస్తారు, మరొకసారి నామినేషన్ లో పెడతారు. అసలు ఏమీ అర్థం కాదు. ఇక్కడ ఎవరిపైన ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోకూడదు అంటూ బిగ్ బాస్ కి చెప్పింది సంజన. సంజన కోసం తన బాక్సును కూడా ఓపెన్ చేసి లోపలికి మళ్ళీ ఎంట్రీ అయ్యేలా చేశాడు భరణి. బహుశా సంజన అది గుర్తుపెట్టుకుని భరణి గురించి అలా మాట్లాడి ఉంటుంది.
ఇదే విషయాన్ని ఇమ్మానుయేల్ తో మాట్లాడినప్పుడు, వాళ్ళిద్దరి మైండ్ సెట్ లు ఏవో కలిసి ఉంటాయి అని ఇమ్మానుయేల్ సంజనాకు చెప్పాడు.
Also Read: Mythri Ravi : కంటెంట్ బాగుంటే థియేటర్లు ఇస్తారు, కిరణ్ అబ్బవరం కు మైత్రి రవి కౌంటర్?