IND-W vs SA-W: మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో ఇవాళ రసవత్తర పోరు జరిగింది. టీమిండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య విశాఖపట్నంలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా పదవ మ్యాచ్ జరిగింది. అయితే ఇందులో ఎవరూ ఊహించని విధంగా టీమిండియా దారుణంగా ఓడిపోయింది. దీంతో వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా మహిళల జట్టు విజయాలకు బ్రేక్ పడింది. ఈ మ్యాచ్ లో టీమిండియాపై 3 వికెట్ల తేడాతో సౌత్ఆఫ్రికా గ్రాండ్ విక్టరీ కొట్టింది. 252 పరుగల లక్ష్యాన్ని 7 వికెట్లు నష్టపోయి చేధించింది. నదీన్ డి క్లర్క్ ( Nadine de Klerk ) సిక్స్ కొట్టి, మ్యాచ్ గెలిపించింది.
252 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా మొదట తడబడింది. కానీ ఓపెనర్ లారా వోల్వార్డ్ట్, చివరలో నదీన్ డి క్లర్క్ ( Nadine de Klerk ) అద్భుతంగా రానించడంతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. 48.5 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయిన దక్షిణాఫ్రికా, అదిరిపోయే విక్టరీని నమోదు చేసుకుంది. మహిళల వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ 2025లో ఇప్పటివరకు మూడు మ్యాచ్ లు ఆడిన సౌత్ ఆఫ్రికా ఒక్క మ్యాచ్ లో ఓడిపోయి రెండు మ్యాచ్ లలో విజయం సాధించింది. దీంతో పాయింట్లు పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. పాయింట్ల పట్టికలో ఎప్పటిలాగే టీమిండియా మూడో స్థానంలోనే నిలిచింది. ఇక ఇవాల్టి మ్యాచ్ లో వికెట్లు పడుతున్నా కూడా దక్షిణాఫ్రికా ప్లేయర్ నదీన్ డి క్లర్క్ 54 బంతుల్లో 84 పరుగులు చేసి దుమ్ము లేపింది. ఇందులో ఎనిమిది బౌండరీలతో పాటు ఐదు సిక్సర్లు ఉండడం గమనార్హం. మొత్తం 155 స్ట్రైక్ గ్రేడ్ తో టీమ్ ఇండియా బౌలర్లకు చుక్కలు చూపించింది. ఆమె దెబ్బకు టీమిండియా గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోయింది.
హర్మన్‌ప్రీత్ కౌర్ వల్లే టీమిండియా ఓడిపోయిందని విమర్శలు వస్తున్నాయి. ఈ మ్యాచ్ లో ఆమె బౌలింగ్ చేయడమే పెద్ద మిస్టేక్ అని విశ్లేషకులు అంటున్నారు. ఈ మ్యాచ్ లో 4 ఓవర్లు వేసి, 15 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ తీయలేదు హర్మన్‌ప్రీత్ కౌర్. ఆ సమయంలో దక్షిణాఫ్రికా 5 వికెట్లు నష్టపోయింది. అలాంటి సమయంలో మంచి బౌలర్ తో బౌలింగ్ చేయించి, బ్యాటర్లపై ప్రెషర్ పెట్టాలి. కానీ హర్మన్‌ప్రీత్ కౌర్ బౌలింగ్ వేయడంతో, భాగస్వామం రాబట్టగలిగారు సౌతాఫ్రికా ప్లేయర్లు. దీంతో టీమిండియా ఓడింది.
ఇవాల్టి మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా మహిళలు జట్టు 49.5 ఓవర్లలో 251 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. మొదట టాప్ ఆర్డర్ అలాగే మిడిల్ ఆర్డర్ అత్యంత దారుణంగా విఫలమైంది. అయినప్పటికీ, టీమిండియాను రిచా ఘోష్ ఆదుకున్నారు. మహేంద్ర సింగ్ ధోని అప్పట్లో టీమ్ ఇండియాను ఆడి ఎలా ఆదుకునేవాడో, అచ్చం మహిళల వికెట్ కీపర్ రిచాగోస్ కూడా ఆదుకున్నారు. ఈ మ్యాచ్ లో 77 బంతుల్లో 94 పరుగులు చేసి దుమ్ము లేపారు. ఈ ఇన్నింగ్స్ లో ఏకంగా 11 బౌండరీలతో పాటు నాలుగు సిక్సర్లు బాదారు.
Also Read: Abhishek Sharma Car: అభిషేక్ కారుకు ఇండియాలో నో పర్మిషన్…దుబాయ్ లో వదిలేశాడుగా !
Gave Away A Win On Platter With Bad Bowling 🤦🏻♂️
#INDvsSA pic.twitter.com/CBsV5N9rch
— RVCJ Media (@RVCJ_FB) October 9, 2025