BigTV English

Bigg Boss: 7వ వారం ఎలిమినేట్ అయ్యేది వారే.. షాక్ లో కంటెస్టెంట్స్..!

Bigg Boss: 7వ వారం ఎలిమినేట్ అయ్యేది వారే.. షాక్ లో కంటెస్టెంట్స్..!

Bigg Boss.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ (Bigg Boss) ఇప్పుడు అన్ని భాషలలో కూడా ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హిందీలో 18వ సీజన్ నడుస్తూ ఉండగా..కన్నడలో 11వ సీజన్ కూడా ప్రారంభమైంది. ప్రస్తుతం తెలుగులో ఎనిమిదవ సీజన్ నడుస్తోంది. అందులో భాగంగానే ఏడవ వారం చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే చర్చ అటు కంటెస్టెంట్స్ లో ఇటు ఆడియన్స్ లో కూడా మొదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఏడవ వారం ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


7 వారాలలో ఎనిమిది మంది ఎలిమినేట్..

అసలు విషయంలోకెళితే బిగ్ బాస్ సీజన్ 8 నాగార్జున హోస్టుగా ప్రారంభమైంది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన ఈ సీజన్ 7 వారాలు పూర్తి చేసుకోబోతోంది. అందులో భాగంగానే మొదటివారం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ బెజవాడ బేబక్క, రెండవ వారం ఆర్జే శేఖర్ భాష, మూడవ వారం అభయ్ నవీన్, నాలుగవ వారం సోనియా ఆకుల, ఐదవ వారం ఆదిత్య ఓం, నైనిక, ఆరవ వారం స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు దక్కించుకున్న కిర్రాక్ సీత ఎలిమినేట్ అవ్వగా.. అదే సమయంలో హౌస్ లోకి 8 మందిని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ప్రవేశపెట్టారు బిగ్ బాస్.


వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన మాజీ కంటెస్టెంట్స్..

వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హరితేజ , టేస్టీ తేజ, రోహిణి, గౌతమ్ కృష్ణ, ముక్కు అవినాష్, నయనీపావని, మెహబూబ్, గంగవ్వ ఇలా మొత్తం ఎనిమిది మంది బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ను మళ్ళీ వైల్డ్ కార్డు ద్వారా ప్రవేశపెట్టారు. వీరంతా ఒక గ్రూపుగా, మిగిలిన హౌస్ మేట్స్ అంతా ఒక గ్రూపుగా డివైడ్ చేసి టాస్కులు పెడుతూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఏడవ వారం నామినేషన్ రచ్చ వాడి వేడిగా సాగింది. పలు రకాల టాస్క్ లతో కంటెస్టెంట్స్ కూడా ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు. ఇక ఈవారం ఎలిమినేషన్స్ లో భాగంగా విష్ణు ప్రియ తో లవ్ ట్రాక్ నడుపుతూ, యష్మికి దగ్గరగా మూవ్ అవుతున్న పృథ్విరాజ్ శెట్టి ఎలిమినేట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఏడవ వారం ఎలిమినేట్ అయిన పృథ్వీరాజ్ శెట్టి..

తాజాగా ఈ వారం జరిగిన నామినేషన్ లో మొత్తం తొమ్మిది మంది నామినేషన్ లోకి రాగా.. ఆడియన్స్ నుంచి కూడా ఒక్కొక్కరికి ఓట్స్ బాగానే పడ్డాయి. ఇక టేస్టీ తేజ ,నిఖిల్ , పృథ్వీ డేంజర్ జోన్ లో ఉండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పృథ్వీ లీస్ట్ లో ఉన్నాడని , ఈవారం ఎలిమినేట్ అయ్యేది ఇతడే అంటూ వార్తలు వినిపిస్తున్నా. మొత్తానికైతే పృథ్వీరాజ్ ఎలిమినేషన్ అటు విష్ణుప్రియకు ఇటు యష్మీ కి భారీ షాక్ ఇవ్వబోతోంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే పృథ్వీ ఈ వారం ఎలిమినేట్ కాబోతున్నారని సమాచారం.

Related News

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Big Stories

×