E-Paper
Advertisement

Mahesh Babu: ఫ్యాన్స్ కు ముఖం చాటేసిన మహేష్.. ఇలా అయితే ఎలా..?

Mahesh Babu: ఫ్యాన్స్ కు ముఖం చాటేసిన మహేష్.. ఇలా అయితే ఎలా..?
Advertisement

Mahesh Babu: ఇండస్ట్రీ మాత్రమే కాదు యావత్ భారత దేశం ఎదురుచూస్తున్న చిత్రాల్లో SSMB 29 ఒకటి. పరాజయమే ఎరుగని దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో మొట్ట మొదటిసారి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంపై అభిమానులతో పాటు ఇండస్ట్రీ మొత్తం ఎన్నో అంచనాలను పెట్టుకుంది.ఆర్ఆర్ఆర్ తరువాత జక్కన్న తెరక్కేక్కిస్తున్న చిత్రం కావడంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందా.. ? ఈ సినిమాకు ఏ టైటిల్  పెడతారా.. ? అసలు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఎప్పుడు వస్తుందా.. ? అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఇక ఒకపక్కన ఈ SSMB29 స్క్రిప్ట్ వర్క్ నడుస్తుందని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చిన విషయం విదితమే. వేరే హీరోలకు అయితే రెండు మూడు వారాల్లో స్క్రిప్ట్ అయిపోయేదని, మహేష్ బాబు కాబట్టే రెండేళ్లు స్క్రిప్ట్ కోసం కష్టపడుతున్నామని చెప్పడంతో.. ఈ సినిమా ఏదో మళ్లీ రికార్డులు తిరగరాసేదానిలానే ఉంది అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఇక జక్కన్న స్క్రిప్ట్ పూర్తీ చేసేపనిలో ఉండగా.. మహేష్ తన లుక్ ను మార్చే పనిలో ఉన్నాడు. ఇప్పటికే గుబురు గడ్డం, లాంగ్ హెయిర్ పెంచి.. బీస్ట్ మోడ్ లో తయారయ్యాడు.

Advertisement

Star director: డైరెక్టర్ భార్యకు ఘోర అవమానం.. ఫ్యాబ్రిక్ స్టోర్ యజమానిపై రివేంజ్..!

జక్కన్న సినిమా అంటే.. మినిమమ్ లో మినిమమ్ మూడేళ్లు.. ఇంకా ఎక్కువే పట్టొచ్చు అని చెప్పినా ఆశ్చర్యం లేదు. మూడేళ్లు అయినా ఈ సినిమా రిలీజ్ కు పడుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ మూడేళ్లు మహేష్ బాబును వెండితెరపై చూడడం కష్టమే. సరే.. సినిమాలో కనిపించకపోయినా.. ఎయిర్ పోర్ట్ లోనో, ఫ్యామిలీ వెకేషన్స్ లోనో మహేష్ లుక్ ను చూసి మురిసిపోతున్న అభిమానులకు పెద్ద షాక్ నే తగిలింది. ఇప్పటివరకు మహేష్ హెయిర్ ను కవర్ చేసుకుంటూ క్యాప్ వాడుతూ కనిపిస్తున్నాడు.

Advertisement

ఇక నుంచి అసలు ముఖం చూపించకుండా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సినిమా లుక్ రివీల్ అయితే.. ఫ్యాన్స్ సినిమా చూసే టైమ్ కు ఆ కిక్ ఉండదని భావించిన జక్కన్న.. ఇకనుంచి కెమెరా కంటికి దూరంగా ఉండమని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో మహేష్.. అంతకుముందు వెకేషన్ లో కూతురుతో పాటు దిగిన ఫోటోలలో అయినా ముఖం చూపించేవాడు.. ఇప్పుడు మొత్తానికే ముఖం చాటేశాడు.

Priyanka Chopra: సిల్వర్ కలర్ డ్రెస్‌లో ప్రియాంక చోప్రా, ఎందుకు?

తాజాగా మహేష్ ఫ్యామిలీ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నారు. అందులో భాగంగా సితార.. తన తండ్రితో కలిసి దిగిన కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోలలో మహేష్ ముఖం కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. దీంతో అభిమానులు కొద్దిగా షాక్ అయ్యారు. అంటే.. మూడేళ్ళ వరకు మహేష్ ముఖం కూడా కనిపించదా.. ? ఇలా అయితే ఎలా అన్నా.. ? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే SSMB29.. వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ మీదకు వెళ్లనుందని టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమాకు గరుడ అనే టైటిల్ ను కూడా అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×