E-Paper
Advertisement

Bigg Boss: డేంజర్ జోన్ లో ఆ ఇద్దరే.. ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..?

Bigg Boss: డేంజర్ జోన్ లో ఆ ఇద్దరే.. ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..?
Advertisement

Bigg Boss.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్.. ఇప్పుడు 8వ సీజన్ జరుపుకుంటోంది. 8వ సీజన్లో భాగంగా మూడు వారాలు గడిచిపోయాయి. అందులో మొదటి వారం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన బెజవాడ బేబక్క ఎలిమినేట్ అవ్వగా , రెండవ వారం ఆర్జే శేఖర్ బాషా ఎలిమినేట్ అయిపోయారు. అయితే ఆయనకు కొడుకు పుట్టిన నేపథ్యంలోనే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు అనే వార్తలు వినిపించాయి. మరొకవైపు మూడవ వారం అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యారు. అయితే అభయ్ తన నోటి దూల కారణంగానే హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.

నామినేషన్ లోకి వచ్చిన ఆరుగురు వీరే..

Advertisement

ఇదిలా ఉండగా నాల్గవ వారం కూడా చివరి దశకు చేరుకుంది. ఈసారి నామినేషన్స్ కూడా అంతే రసవత్తరంగా సాగాయి. దీనికి తోడు ఓటింగ్ కూడా ఊహించని విధంగా జరిగింది. నాలుగవ వారానికి గానూ మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. వీరిలో ఇద్దరు మాత్రం డేంజర్ జోన్ లో ఉన్నట్లు సమాచారం. మరి ఆ ఇద్దరిలో ఎలిమినేట్ అయ్యేది ఎవరో ఇప్పుడు చూద్దాం. మంగళవారం నాడు నామినేషన్ ప్రక్రియ పూర్తవగా.. సోనియా ఆకుల, నాగమణికంఠ, పృథ్వీరాజ్ శెట్టి, నబీల్, ప్రేరణ , ఆదిత్య ఓం ఇలా మొత్తం ఆరుగురు నామినేషన్ లోకి వచ్చేసారు.

సేఫ్ జోన్లో నిలిచింది వీరే..

Advertisement

దీంతో ఎవరు సేవ్ అవుతారు అనే విషయానికి వస్తే.. మరొకవైపు వైల్డ్ కార్డు ఎంట్రీ లను ఆపేందుకు బిగ్ బాస్ ఇచ్చిన ఛాలెంజ్లను క్లియర్ చేస్తూ తన ఆట తీరుతో ఆడియన్స్ ని మెప్పించిన నబీల్ ఏకంగా మొదటి స్థానంలోకి వచ్చేసారు. సింపథీ గేమ్ ఆడుతున్నాడనే విమర్శలు వినిపించినా.. తన గేమ్ ను మెరుగుపరుచుకుంటూ పాయింట్స్ కూడా గట్టిగా మాట్లాడుతూ ఆడియన్స్ హృదయాలను దోచుకున్నాడు. దీంతో రెండవ స్థానానికి చేరుకున్నారు నాగమణికంఠ. ఇక మూడవ స్థానంలో కన్నడ సీరియల్ నటి ప్రేరణ నిలిచింది. నిజానికి ఈమెకు ఆడియన్స్ లో పెద్దగా గుర్తింపు లేదు. కానీ ఫిజికల్ టాస్క్ లలో కష్టపడుతూ అందరిని అలరిస్తోంది. ముఖ్యంగా గేమ్ పట్ల ఈమెకు ఉన్న మక్కువే ఈమె పై ఆడియన్స్ ప్రేమ పెంచుకునేలా చేసింది.

డేంజర్ జోన్ లో ఆ ఇద్దరే..

ఇక నాలుగవ స్థానంలో పృథ్వీరాజ్ నిలిచారు. పృథ్వి రాజ్ కూడా సీరియల్ నటుడే ముఖ్యంగా సోనియా – పృథ్వీరాజ్ ప్రవర్తన వివాదాస్పదంగా ఉంది. అందుకే ఇప్పుడు పృథ్వి రాజ్ పై కొంత నెగిటివిటీ ఏర్పడింది. అలాగే గేమ్స్ లో కూడా టెంపర్ కోల్పోతున్నాడు. గట్టిగా అరవడమే ఈయనకు మైనస్ గా నిలిచింది. ఇకపోతే చివరిగా ఐదవ స్థానంలో ఆదిత్య , ఆరవ స్థానంలో సోనియా నిలిచారు. నిజానికి ఆదిత్య ఓం ఒక హీరో, సోనియాకు ఆర్జీవి సపోర్ట్ ఉంది. పైగా రెండు రోజుల క్రితం సోనియాకు ఓటు వేయండి అంటూ ఆయన అభ్యర్థించాడు కూడా.. మరి ఈ ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అయితారు అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఒకరకంగా చెప్పాలి అంటే ఆదిత్య ఓం కంటే సోనియా హౌస్ లో కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇద్దరు అబ్బాయిలతో సన్నిహితంగా ఉంటూ కంటెంట్ ఇస్తోంది.కాబట్టి సోనియాను ఎలిమినేట్ చేసే అవకాశం లేదనే చెప్పాలి. మరి సోనియా సేఫ్ అయ్యి ఆదిత్య లేదా పృథ్వీ రాజ్ ఇద్దరిలో ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేసే అవకాశాలున్నట్లు సమాచారం.

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×