BigTV English

CM Revanth Reddy: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. తెలంగాణలో యంగ్ ఇండియా స్కూళ్లు, ఇవీ ప్రత్యేకతలు

CM Revanth Reddy: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. తెలంగాణలో యంగ్ ఇండియా స్కూళ్లు, ఇవీ ప్రత్యేకతలు

CM Revanth Reddy: తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఓకేసారి 28 స్కూళ్లకు శంకుస్థాపన చేయనున్నారు ముఖ్యమంత్రి. ఈ కార్యక్రమానికి షాద్ నగర్ నియోజకవర్గం కేంద్రమైంది.


ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఇతర వర్గాల్లోని విద్యార్థులు ఈ స్కూళ్లలో ఉండబోతు న్నాయి. అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలను ఇందులో ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో లైబ్రరీ (ఐదు వేల పుస్తకాలు), 60 కంప్యూటర్లు, తరగతి గదుల్లో డిజిటల్ బోర్డులు ఉండనున్నాయి.

ఒకేసారి 900 మంది కూర్చుని భోజనాలు చేసేలా డైనింగ్ హాలు నిర్మిస్తారు. ప్రతీ రూమ్‌లో 10 బెడ్స్, రెండు బాత్ రూమ్స్ ఉండనున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే విద్యార్థులకు, ఉపాధ్యాయులకు పూర్తిస్థాయి రెసిడెన్షియల్ క్యాంపస్ అన్నమాట.


కల్చరల్ కోసం ప్రత్యేక ఆడిటోరియం, ఇండోర్, అవుట్ డోర్, స్పోర్ట్స్ సదుపాయాలు వీటి సొంతం. హాస్పటల్ కూడా ఉండబోతోంది. ఒక్కో గురుకులంలో 2500 మంది వరకు చేరడానికి అవకాశం ఉంది.  5 నుంచి ఇంటర్ వరకు ఇందులో చదువు కొనసాగించవచ్చు.

ALSO READ: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌‌లో దారుణం.. అమ్మవారి విగ్రహం ధ్వంసం, అర్ధరాత్రి కరెంట్ తీసి..

ప్రతీ స్కూల్‌కు 120 మంది ఉపాధ్యాయులు ఉండనున్నారు. గురుకులాలు అందుబాటులోకి వస్తే విద్యార్థులకు వసతి కష్టాలు తీరనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా తొలి విడతగా 28 స్కూళ్లకు శంకుస్థాపన చేయనున్నారు. షాద్‌నగర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టున్నారు. మిగతా ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాలు చేయనున్నారు.

కొడంగల్, మధిర, హుస్నాబాద్, నల్గొండ, హుజూర్‌నగర్, మంథని, ములుగు, పాలేరు, ఖమ్మం, వరంగల్, కొల్హాపూర్, అందోలు, చాంద్రాయణగుట్టు, మంచిర్యాల, భూపాలపల్లి, అచ్చంపేట, స్టేషన్ ఘనపూర్, తుంగతుర్తి, మునుగోడు, చెన్నూరు, షాద్ నగర్, జడ్చర్లు, పరకాల, నారాయణఖేడ్, దేవరకద్ర, నాగర్ కర్నూల్, మానకొండూరు, నర్సంపేట వంటి నియోజకవర్గాలున్నాయి.

రెండో దశలో నిర్మించే నియోజకవర్గాల పరిధిలో భూముల గుర్తింపు ప్రక్రియ జరుగుతోంది.

Related News

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

Big Stories

×