BigTV English

BB Telugu 8: హౌస్ లోకి అడుగుపెట్టిన బ్రహ్మముడి కావ్య.. రచ్చ మామూలుగా లేదుగా..?

BB Telugu 8: హౌస్ లోకి అడుగుపెట్టిన బ్రహ్మముడి కావ్య.. రచ్చ మామూలుగా లేదుగా..?

ఎట్టకేలకు తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు చేరుకుంది. మరో ఐదు రోజుల్లో ఈ షో కూడా ముగియనుంది. ప్రస్తుతం 100వ రోజుకు సంబంధించి ప్రోమో ను విడుదల చేయగా.. హౌస్ లోకి బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ కావ్య వచ్చినట్లు చూపించారు. ఆమె తన ఆటలతో, మాటలతో కంటెస్టెంట్స్ ని తెగ నవ్వించింది .అంతేకాదు వచ్చిరాని తెలుగు మాటలతో ఇటు ఆడియన్స్ ని కూడా కడుపుబ్బా నవ్వించిందని చెప్పవచ్చు. ఇకపోతే తాజాగా ప్రోమోలో ఏముందో చూద్దాం.


ప్రోమో విషయానికి వస్తే.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లోకి బ్రహ్మముడి కావ్య ఎంటర్ అయ్యింది. వచ్చి రాగానే నేను హౌస్ లోకి వచ్చాను అంటూ అరిచేస్తూ గోల చేసింది. అంతేకాదు కంటెస్టెంట్స్ ని చూస్తూ..”మీరు బిగ్ బాస్ హౌస్ కి వచ్చారా? లేక వెయిట్ లాస్ థెరపీ సెంటర్ కి వచ్చారా?” అంటూ చమత్కరించింది. అనంతరం బిగ్ బాస్ మాట్లాడుతూ..” కావ్య మీకు బిగ్ బాస్ పరివారం లోకి స్వాగతం” అంటూ ఆమెను స్వాగతించారు. ఇక వెంటనే కావ్య మాట్లాడుతూ.. “అసలు మీ లైఫ్ లో రొమాన్స్ ఏ ఉండదా. మీకు అసలు రొమాన్స్ అంటే ఏంటో కూడా తెలియదా..? కావ్య మీరు బిగ్బాస్ హౌస్కి వచ్చారు కదా అంటూ పలకరించరా” అని కావ్య అడగగా.. అవినాష్ మాట్లాడుతూ.. “పలకరిస్తారమ్మా.. దానికి మీరు అందంగా ఉండాలి” అంటూ కౌంటర్ వేశారు.

ఇక తర్వాత బిగ్ బాస్ మాట్లాడుతూ..కావ్య మీరు కన్ఫెషన్ రూమ్ కి రండి అని పిలవగా.. కావ్య మాత్రం సంతోషంలో బిగ్ బాస్ నన్ను రూమ్ కి పిలిచాడు అంటూ గట్టిగా అరుస్తూ.. గెంతుతుంది. వెంటనే అవినాష్ మాట్లాడుతూ.. కావ్య అది రూమ్ కాదు కన్ఫెషన్ రూమ్ అంటూ ఆమె తెలుగు తప్పును సరి చేసే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత నిఖిల్ ఆమెను కన్ఫెషన్ రూమ్ కి తీసుకెళ్లారు. ఇక తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని చూపించలేదు. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో టాప్ ఫైవ్ గా నిలిచిన ప్రేరణ, నిఖిల్, గౌతమ్, నబీల్, అవినాష్ లతో కాసేపు ముచ్చటించింది. ఇక గౌతమ్ గతంలో రోహిణి, యష్మి ని అక్క అని పిలిచిన విషయాన్ని గుర్తు చేస్తూ.. ఒక అమ్మాయితో ఫ్యూచర్లో నీకు పెళ్లి అవుతుంది. పెళ్లి అయిన తర్వాత ఆ అమ్మాయి కి నువ్వు నచ్చలేదు. అప్పుడు నువ్వేం చేస్తావ్ అక్క అని పిలిచి వచ్చేస్తావా అంటూ కామెడీ చేసింది. ఆ తర్వాత ప్రేరణతో మాట్లాడుతూ.. నువ్వు, శ్రీ పద, ప్రకృతి ముగ్గురు ఐ ల్యాండ్ కి వెకేషన్ కి వెళ్తున్నారు. ముగ్గురు వెనక్కి రావాలి అయితే అలా రావాలంటే మిగతా ఇద్దరిలో నువ్వు ఎవరిని తీసుకొని వస్తావు అని ప్రశ్నించగా.. రిటర్న్ టిక్కెట్ లో ప్రకృతిని పంపించేసి, నేను శ్రీ పద హనీమూన్ చేసుకుని వచ్చేస్తామంటూ చాలా స్మార్ట్ గా సమాధానం తెలిసింది. ఇక తర్వాత వాటర్ టబ్లో కూరగాయలు పెట్టి, స్క్రీన్ పై చూపించే కూరగాయను నోటితో పట్టుకొని ఇంకొక బౌల్ లో వేసే టాస్క్ పెట్టారు. అలా కావ్య, అవినాష్ పోటీ పడగా అవినాష్ గెలిచారు. మొత్తానికైతే కావ్య తన కామెడీతో అందరిని కడుపుబ్బా నవ్వించింది అని చెప్పవచ్చు.


Related News

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Big Stories

×