South Central Railway Special Trains: శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే 34 రైళ్లు కేటాయించిన అధికారులు, తాజాగా మరో రెండు స్పెషల్ ట్రైన్లను షెడ్యూల్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ రైళ్లు మౌలాలి నుంచి కొల్లాం మధ్య నడుస్తాయి. రెండు వైపులా మొత్తం 12 సర్వీసులను షెడ్యూల్ చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. మొత్తం 29 స్టాప్‌లు ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన టికెట్ బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైంది.
స్పెషల్ ట్రైన్ల వివరాలు
⦿మౌలాలి- కొల్లాం స్పెషల్ రైలు(07193)
ఈ స్పెషల్ రైలు డిసెంబర్ 11, 18, 25 తేదీల్లో సాయంత్రం 06:55 గంటలకు మౌలాలి స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు రాత్రి 11:55 గంటలకు కొల్లం చేరుకుంటుంది. ఈ రైలు నెల్లూరు, సేలం, కోయంబత్తూరు మీదుగా ప్రయాణిస్తుంది. మరుసటి రోజు తెల్లవారుజామున 03:40 గంటలకు పాలక్కాడ్, 06:18 గంటలకు త్రిసూర్, 07:07 గంటలకు అలువాకు, 08:10 గంటలకు ఎర్నాకులానికి, 10:03 గంటలకు కొట్టాయం, 10:23 గంటలకు చంగనస్సేరి, 10:35 గంటలకు తిరువళ్ల, 10:50 గంటలకు చెంగనూర్, 11:15 గంటలకు కాయంకుళం మీదుగా చివరకు 11:55 గంటలకు కొల్లాం చేరుకుంటుంది.
ఇక కొల్లాం నుంచి తిరుగు ప్రయాణం అయ్యే ప్రత్యేక రైలు డిసెంబర్ 13, 20, 27 తేదీల్లో తెల్లవారు జామున 2:30 గంటలకు బయల్దేరుతుంది. మరుసటి రోజు 09:15 AMకి మౌలాలి స్టేషన్‌కు చేరుకుంటుంది. ఈ రైలులో ఎనిమిది ఏసీ త్రీటైర్ కోచ్‌లు, తొమ్మిది స్లీపర్ క్లాస్ కోచ్‌లు, మూడు చైర్ కార్ కోచ్‌లు, ఒక జనరల్ కోచ్ ఉంటాయి.
Read Also: వద్దన్నా వినని అయ్యప్ప భక్తులు, కేసు ఫైల్ చేసిన రైల్వే పోలీసులు
⦿మౌలా అలీ- కొల్లాం స్పెషల్ రైలు(07149)
ఈ స్పెషల్ రైలు డిసెంబర్ 14, 21, 28 తేదీల్లో మౌలాలి-కొల్లాం ప్రత్యేక రైలు మౌలాలి స్టేషన్ నుంచి సాయంత్రం 06:55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10:30 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. ఈ రైలు నెల్లూరు, సేలం, ఈరోడ్ మీదుగా వెళ్తుంది. తెల్లవారుజామున 03:35 గంటలకు పాలక్కాడ్ చేరుకుంటుంది. 05:52 గంటలకు త్రిసూర్, 06:31 గంటలకు అలువా, 07:05 గంటలకు ఎర్నాకులం, 08:01 గంటలకు ఎట్టుమనూరు, 08:15 గంటలకు కొట్టాయం, 08:36 గంటలకు చంగనస్సేరి చేరుకుంటుంది. 08:47 గంటలకు తిరువళ్లకు, 09:01 గంటలకు చెంగన్నూరుకు, 09:25 గంటలకు కాయంకుళం చేరుతుంది. రాత్రి 10:30 గంటలకు కొల్లాం స్టేషన్ కు చేరుకుంటుంది.
ఇక కొల్లాం నుంచి తిరిగి వచ్చే రైలు డిసెంబర్ 16, 23, 30 తేదీల్లో నడుస్తుంది. కొల్లాం నుంచి తెల్లవారుజామున 02:30 గంటలకు బయల్దేరి మరుసటి రోజు 09:50 గంటలకు మౌలాలి స్టేషన్ కు చేరుకుంటుంది. ఈ రైలులో ఎనిమిది ఏసీ త్రీటైర్ కోచ్‌లు, తొమ్మిది స్లీపర్ క్లాస్ కోచ్‌లు, మూడు చైర్ కార్ కోచ్‌లు, ఒక జనరల్ కోచ్ లు ఉంటాయి. శబరిమలకు వెళ్లే భక్తుల రద్దీని తగ్గించడంలో ఈ రైళ్లు ఉపయోగపడనున్నట్లు అధికారులు భావిస్తున్నారు. అయ్యప్ప భక్తులతో పాటు శబరిమల వెళ్లే భక్తులు ఈ రైళ్లను వినియోగించుకోవాలని సూచించారు.
Read Also: ప్రపంచంలోని బెస్ట్ స్లీపర్ రైళ్లు ఇవే.. జీవితంలో ఒక్కసారైనా ప్రయాణించాల్సిందే!