E-Paper
Advertisement

మనుషులా.. మృగాలా? ఆ తల్లి పడుతున్న నరకం చూస్తే మీ కళ్లు చెమర్చాల్సిందే!

మనుషులా.. మృగాలా? ఆ తల్లి పడుతున్న నరకం చూస్తే మీ కళ్లు చెమర్చాల్సిందే!
Advertisement

Karimnagar: కరీంనగర్  జిల్లాలో వెలుగు చూసిన ఘటన సమాజం ఎటువైపు వెళ్తోందో అన్న ఆందోళన కలిగిస్తోంది. మనిషి ప్రాణం కంటే మూఢనమ్మకాలు, పట్టింపులకే ఎక్కువ విలువ ఇచ్చే మనుషులు ఉన్నంత కాలం మానవత్వం అనే పదానికి అర్థం లేకుండా పోతుంది.

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గాంధీనగర్‌లో గాండ్ల శ్రీకాంత్ (40) అనే వ్యక్తి తన భార్య రూప, ఇద్దరు పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉండేవారు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునే శ్రీకాంత్ గత కొంతకాలంగా సరైన ఉపాధి లేక, ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉంటే.. అద్దె ఇంటి యజమాని ప్రవర్తన ఆ బాధను మరింత రెట్టింపు చేసింది.

Advertisement

శ్రీకాంత్ అంత్యక్రియలు ముగిసిన తర్వాత భార్యా పిల్లలు ఇంటికి తిరిగి రాగా, యజమాని వారిని లోపలికి రానివ్వలేదు. ‘చావు జరిగిన ఇంట్లోకి ఇప్పుడే రానివ్వను, పదవ రోజు కర్మకాండలు పూర్తయ్యాకే అడుగు పెట్టాలి’ అంటూ గేటుకు  తాళం వేశాడు. దిక్కుతోచని స్థితిలో, ఆశ్రయం కల్పించే వారు లేక ఆ తల్లి తన ఇద్దరు బిడ్డలతో కలిసి గత ఆరు రోజులుగా శ్మశాన వాటికలోనే తలదాచుకుంటోంది.

కళ్ల ముందు కన్న తండ్రి లేడన్న బాధ ఒకవైపు, ఉండటానికి నీడ లేక శ్మశానంలో గడపాల్సిన దుస్థితి మరోవైపు.. ఆ పిల్లల దీనస్థితి చూస్తుంటే  స్థానికుల కళ్లు చెమర్చుతున్న యి. మన చుట్టూ ఉన్న మనుషుల్లో ఇంతటి కఠినత్వం ఉందా అనిపిస్తోంది. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన మనుషులే అపశకునాల పేరుతో రోడ్డున పడేయడం అత్యంత బాధాకరం.

Advertisement

Also Read: హైదరాబాద్ శివార్లలో విషాదం.. భారీ వర్షానికి కూలిన క్రేన్లు.. ఐదుగురు వలస కార్మికుల మృతి

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×