Duvvada Madhuri : బిగ్ బాస్ సీజన్ 9 లో ఫైర్ స్ట్రోమ్ వస్తుంది అని ముందు నుంచే కింగ్ నాగార్జున చెబుతూనే ఉన్నారు. ఫైర్ స్ట్రోమ్ లో భాగంగా అయేషా, దువ్వాడ మాధురి, రమ్య మోక్ష, గౌరవ గుప్తా, నిఖిల్ నాయర్, శ్రీనివాస్ సాయి వీళ్ళందరూ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఎపిసోడ్ చాలా సాఫీగా సాగిపోతుంది అనుకున్న తరుణంలో ఈ ఫైర్ స్ట్రోమ్ వలన బిగ్ బాస్ 2.0 లా మారింది. దువ్వాడ మాధురి గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే శ్రీజ తో గొడవ పెట్టుకుంది. ఆమె మాట్లాడే పద్ధతి కూడా ఎవరికి పెద్దగా నచ్చట్లేదు. చిన్న చిన్న విషయాలు కూడా ఊరికే అరుస్తుంది. మాట్లాడే పద్ధతి అసలు తెలియడం లేదు.
వాష్ రూమ్ క్లీనింగ్ బాధ్యతను సంజన మరియు ఇమ్మానుయేల్ నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో దువ్వాడ మాధురి స్టిక్కర్స్ అద్దం దగ్గర ఉండిపోయాయి. అయితే తన స్టిక్కర్స్ కనిపించడం లేదు అని చెప్పి ఇమ్మానుయేల్ కు కంప్లైంట్ చేసింది.
నాకు స్టిక్కర్స్ గురించి పెద్దగా తెలియదు ఇందాక సంజనా గారు ఈ స్టిక్కర్స్ ఎవరివి అని అడిగారు అని చెప్పాడు. వెంటనే ఒకసారి ఆవిడని అడుగు అంటే నేను అడగను అక్క మీరు అడగండి అని చాలా పద్ధతిగా చెప్పాడు ఇమ్మానుయేల్.
సంజనాను తన స్టిక్కర్స్ అడిగింది మాధురి. సంజన పడేసాను అని చెప్పింది. వీరిద్దరి మధ్య బీభత్సమైన ఆర్గ్యుమెంట్ నడిచింది. వీళ్ళ ఆర్గ్యుమెంట్ చూస్తుంటే మాధురి కక్షగట్టుకొని హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది అని చెప్పాలి.
నా స్టిక్కర్స్ పోయాయి మీరు అవి దొంగతనం చేశారు. నీకు దొంగతనం అలవాటైపోయింది. నేను ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పుడు నుంచి చూస్తున్నాను ఏదో ఒకటి దొంగతనం చేస్తూనే ఉంటారు. నీకు చిన్నప్పటినుంచి ఇలా దొంగతనం చేయడం అలవాటైపోయిందా. మీకు అది ఎంటర్టైన్మెంట్ ఏమో వేరే వాళ్ళకి అది ఎమోషన్. మీకు అసలు బ్రెయిన్ ఉందా, మీకు అసలు సెన్స్ ఉందా. అసలు మీకు కామన్ సెన్స్ లేదు.
సంజన మాట్లాడుతూ నేను అదంతా ఎంటర్టైన్మెంట్ కోసం చేశాను. అందుకే నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావ్. నువ్వు హౌస్ లోకి రాగానే ఇంకా కూర్చోకముందే గొడవ మొదలు పెట్టావు. నువ్వు పెద్ద బిగ్ బాస్ కాదు. నీకు సినిమా అంటే ఏంటో నేను చూపిస్తాను అని సంజన చాలా సీరియస్ గా మాధురికి వార్నింగ్ ఇచ్చింది. ఆల్మోస్ట్ వీళ్లిద్దరూ జుత్తులు పట్టుకొని కొట్టుకుంటారేమో అనే స్థాయికి వెళ్లిపోయారు. చాలాసేపు ఆర్గ్యుమెంట్ తర్వాత వీరిద్దరికీ మధ్య జరిగింది కేవలం ప్లాన్ చేసిన ఫైట్ అని అర్థమైంది.
Also Read : Ram Pothineni : రామ్ పోతినేనికి యాటిట్యూడ్.. లవ్ స్టోరీపై రామ్ రియాక్షన్