Ram Pothineni : రామ్ పోతినేని సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికంటే ముందు తమిళ్ లో ఒక షార్ట్ ఫిలిం చేశాడు. అప్పటికి ఇంకా షార్ట్ ఫిలిమ్స్ పెద్దగా స్టార్ట్ కాలేదు. ఆ తరుణంలోనే రామ్ షార్ట్ ఫిలిం చేశాడు. ఆ షార్ట్ ఫిలిం చూసిన వెంటనే దర్శక నిర్మాత వైవిఎస్ చౌదరి రామ్ హీరోగా దేవదాస్ అనే సినిమాలు చేశాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమా అప్పట్లో మంచి సక్సెస్ సాధించింది.
దేవదాస్ సినిమాతో పాటు చాలా సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఈ సినిమాకి వెంటనే పాజిటివ్ టాక్ రాలేదు. రెండు మూడు వారాలు పోయిన తర్వాత విపరీతమైన ఆదరణ ఈ సినిమాకు లభించింది. ఆ తర్వాత అద్భుతమైన స్క్రిప్ట్స్ ఎంచుకుంటూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోగా సెటిల్ అయిపోయాడు. ఇప్పటికీ రామ్ కి ఒక మంచి ఫ్యాన్ బేస్ ఉంది.
ప్రముఖ నటులు జగపతిబాబు జయము నిశ్చయమ్మురా అని ఒక రియాలిటీ షో హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో కి ఇప్పటివరకు చాలామంది గెస్ట్లు హాజరయ్యారు. తాజాగా రామ్ పోతినేని కూడా ఈ షో కి గెస్ట్ గా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఒక ప్రోమో కొద్దిసేపటి క్రితమే విడుదలైంది.
ఈ షోలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను జగపతిబాబు అడుగుతారు అన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా రామ్ పోతినేని యారగెంట్ అలానే యాటిట్యూడ్ కూడా ఎక్కువ అని అడిగారు. తెలిసి అడుగుతున్నారా తెలియక అడుగుతున్నారా అని వెంటనే సమాధానం ఇచ్చాడు రామ్ పోతినేని. నువ్వు చాలా మంచోడు అని విన్నాను అనగానే. ఈ ప్రపంచంలో రెండే రకాల మనుసులు ఉన్నారు విడదీసే వాళ్ళు కలుపుకునేవాళ్లు.
నా గురించి అవతలవాడు ఏమనుకుంటాడో అనే భయం కంటే కూడా నా గురించి నేను ఏమనుకుంటాను అనే భయమే నాకు ఎక్కువగా ఉంటుంది.
నీకు పాటలు రాయడం అనే టాలెంట్ కూడా ఉంది. అది కేవలం ఒట్టి ప్రేమలో ఉన్న వాళ్ళు మాత్రమే రాయగలరు చెప్పు నీకు ఎన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయి అని జగపతిబాబు అడిగారు.
ప్రేమ ప్రస్తావని తీసుకురాగానే ఏమీ మాట్లాడకుండా అలా నవ్వుతూనే ఉన్నాడు రామ్ పోతినేని. అలానే బాగా సిగ్గు పడిపోయి మరి విన్నాడు. ప్రేక్షకులు అరవడం వలన సిగ్గు పడుతున్నాను అని కవర్ చేశాడు
మహేష్ బాబు దర్శకత్వంలో వస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమాలో రామ్ సాంగ్ రాసిన విషయం తెలిసిందే. ఒక పెద్ద సాహిత్య రచయిత పాటను ఎలా రాస్తారో అదే విధంగా రామ్ కూడా రాశాడు. మరోవైపు రామ్ భాగ్యశ్రీ తో లవ్ లో ఉన్నట్లు కథనాలు వినిపించాయి. అలా ఉండటం వలనే ప్రేమ పాటను కూడా రాయగలిగాడు అని కొంతమంది అభిప్రాయం.
Also Read: Bunny Vas : పోలీసులను ఆశ్రయించిన బన్నీ వాస్ , ముగ్గురును అదుపులోకి తీసుకున్న పోలీసులు