Crime News:గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలే నడి రోడ్డుపై ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం.. జ్యూటూరి బుజ్జి (50) అనే వ్యక్తి చెంచుపేటలోని తన కూతురు ఇంటికి వచ్చాడు. టిఫిన్ కోసం బయటకి వెళ్లిన సమయంలో గుర్తు తెలియని దుండగుడు కొబ్బరికాయల కత్తితో నరికి చంపాడు. సమాచారం అందుకున్న త్రీటౌన్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. దుండగుడు స్కూటీపై వచ్చి హత్య చేసి పరార్ అయినట్టు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.