Telangana BJP Leaders: బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పర్యటనలో.. ఇద్దరు బిజేపీ నేతల మద్య స్వల్ప వాగ్వాదం నెలకొంది. మంచిర్యాల జిల్లా నీల్వాయి గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఏట మధుకర్ కుటుంబాన్ని రామచంద్రరావు పరామర్శిస్తున్న సందర్బంలో ఈ ఘటన జరిగింది. పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్, ఎంపీ అభ్యర్ధిగా పోటీచేసిన గోమాసి శ్రీనివాస్ గొడవ పడ్డారు. మాజీ ఎంపీ వెంకటేష్ నేత అరేయ్ అని తిట్టడంతో తీవ్రస్థాయిలో మండిపడిన శ్రీనివాస్.. మాజీ వెంకటేష్‌ను గుడ్డలు ఊడ తీసి కొడతామన్నాడు. దీంతో ఇద్దరి మద్య వివాదం ఏర్పడింది. ఆదర్శనీయంగా ఉండవలసిన నాయకులు ఇలా గొడవ పడడంతో బీజేపీ వర్గాలలో చర్చనీయ అంశంగా మారింది.