Israel-Hamas: ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఇప్పటికే సంతకాలు జరిగిపోయాయి.. బందీల అప్పగింత కూడా అయిపోయింది. ఇక అంతా ప్రశాంతంగా ఉంటుందనుకున్నారు గాజా ప్రజలు. కానీ వారి ఆశలు అడియాశలు అయ్యాయి. మళ్లీ గాజా వీధుల్లో గన్ గర్జించింది. ప్రాణాలు పోయాయి. అయితే ఈ పాపం ఈసారి ఇజ్రాయెల్‌ది కాదు.. హమాస్‌దే. బందీల అప్పగింత ముగియగానే గాజా వీధుల్లో మారణహోమం సృష్టించింది హమాస్.
గాజాలో హమాస్‌కు పోటీగా మరో మిలిషియా ఎదుగుతోంది. అయితే ఇప్పటికీ దీనికి అంతగా గుర్తింపు లేదు. కానీ హమాస్‌కు పోటీగా ఉన్న ఈ సంస్థ సభ్యులను నడివీధిలో కాల్చి చంపారు హమాస్ సభ్యులు. ఇప్పటికే దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఇందులో 8 మందిని కాల్చి చంపేశారు. మొత్తం 50 మందిని హతమార్చారని.. స్థానిక న్యూస్ ఏజెన్సీలు చెబుతున్నాయి.
ALSO READ: Bus Fire Accident: అయ్యో ఎంత ఘోరం! కదులుతున్న బస్సులో చెలరేగిన మంటలు.. 15 మంది సజీవ దహనం
ఇక్కడ మరో హైలేట్ విషయం ఏంటంటే.. గాజాలో అంతర్గత భద్రతను హమాస్ చక్కగా నిర్వహిస్తోంది అనే ఆశాభావం తనకు ఉందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అంతలోనే హమాస్ ఈ పనిని చేసింది. వీడియోలు చూస్తుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బాధితుల కళ్లకు గంతలు కట్టి నడిరోడ్డుపై కూర్చొపెట్టి ఈ దారుణానికి ఒడిగట్టారు. వీరంతా నేరాలకు పాల్పడ్డారని.. ఇజ్రాయెల్ సైనికులకు సహకారం అందించారని హమాస్ ముఖ్య నేతలు ఆరోపించారు.
ALSO READ: IPS Puran Kumar: ఐపీఎస్ పూరన్ ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్.. మరో పోలీస్ అధికారి సూసైడ్
గాజాలో డోగ్ముష్ గ్యాంగ్ ప్రభావం పెరుగుతోంది. ఈ గ్యాంగ్‌కు ఇజ్రాయెల్ ఆర్మీ సహాయం అందిస్తోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అందుకే ఈ గ్యాంగ్‌ను అసలు లేకుండా చేసేందుకు నిన్న దాడి చేసింది. అంబులెన్స్‌లో వచ్చిన హమాస్ మిలిటెంట్లు.. దాడులు జరిపారు. ఈ దాడిలో 12 మంది హమాస్ ఫైటర్లు కూడా మరణించినట్టు తెలుస్తోంది. మృతి చెందిన వారిలో హమాస్ ముఖ్యనేత బస్సీమ్ నాయిమ్ కొడుకు కూడా ఉన్నట్టు సమాచారం. గత కొన్ని నెలలుగా హమాస్ ముఖ్య నేతలు, ఫైటర్లు ఇజ్రాయెల్ దాడుల భయంతో దాక్కొని ఉన్నారు. ఇప్పుడు శాంతి ఒప్పందం కుదరడంతో వారంతా బయటికి వచ్చారు. బయటికి రాగానే మొదటగా వీరిని టార్గెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది.