Nagarjuna100: కింగ్ నాగార్జున(Nagarjuna) ఇటీవల వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈయన హీరోగా మాత్రమే కాకుండా.. పలు సినిమాలలో క్యామియో పాత్రలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల కుబేర, కూలి వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగార్జున త్వరలోనే తన వందవ సినిమా పనులలో బిజీ కాబోతున్నారు. ఇటీవల నాగార్జున 100 వ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు “లాటరీ కింగ్”(Lottery King)అని టైటిల్ పెట్టబోతున్నట్లు వార్తలు వచ్చాయి.
ఈ సినిమాలో నాగార్జునతో పాటు టబు(Tabu) కూడా నటించబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇలా మరోసారి టబు నాగార్జున కాంబినేషన్ లో సినిమా రాబోతోందనే విషయం తెలిసి అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మరొక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా నుంచి టబు తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు ఆర్ కార్తీక్ దర్శకత్వం వహించబోతున్నారని, ఈ సినిమాలో నాగార్జునతో పాటు ఆయన వారసులు నాగచైతన్య, అఖిల్ కూడా కనిపించబోతున్నారని తెలియడంతో అభిమానులు సంతోషపడ్డారు.
ఇక తాజాగా ఈ సినిమా నుంచి టబు తప్పుకున్నారని తెలుస్తుంది. అయితే ఈమె తప్పుకోవడానికి కారణం లేకపోలేదు. ఆమె ఆరోగ్యం సహకరించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకుందంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు హీరోయిన్ గా టబు నటిస్తున్నారని అధికారిక ప్రకటన మాత్రం వెలబడలేదు కానీ ఈ వార్తలు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి. ఇలా టబు తప్పుకోవడంతో మరి ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారనే విషయంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు . టబు స్థానంలో మరొక స్టార్ హీరోయిన్ నయనతార(Nayanatara) ఈ ప్రాజెక్టులోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున…
నయనతార ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఈమె చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మన శంకర వరప్రసాద్ గారు ఈ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక నాగార్జున 100 వ సినిమాలో కూడా ఈమె నటించబోతున్నారని అయితే ఈ సినిమా కోసం నయనతార భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు బయటకు వచ్చాయి .మరి ఈ సినిమా హీరోయిన్ విషయంలో వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. అయితే త్వరలోనే ఈ సినిమా పూజ కార్యక్రమాలను జరుపుకొని రెగ్యులర్ షూటింగ్ పనులను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం నాగార్జున బిగ్ బాస్ 9 కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు.
Also Read: Duvvada srinivas: బిగ్ బాస్ ప్రైజ్ మనీతో ఆ పని చేస్తారా దువ్వాడ..మీలో ఈ యాంగిల్ కూడా ఉందా?