BigTV English

Trump Golden Statue: డాలర్ కాయిన్‌పై ట్రంప్ ఫోటో.. అసలేంటి బిల్డప్ బాబాయ్ లెక్క?

Trump Golden Statue: డాలర్ కాయిన్‌పై ట్రంప్ ఫోటో.. అసలేంటి బిల్డప్ బాబాయ్ లెక్క?
Advertisement

Trump Golden Statue: ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి ఉంటుంది. క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టర్ల నిధులతో ఈ ట్రంప్ గోల్డెన్ స్టాచ్యూ ఏర్పాటు చేశారు. ట్రంప్ కు ఇలాంటివి చాలా ఇష్టమే. విమర్శలైతే వచ్చాయి గానీ.. ట్రంప్ కు లోలోపల బాగా సంబరం కలిగించిన ఘటన ఇది. జస్ట్ ఇదే కాదు.. ట్రంప్ మైండ్ లో ఇంకా ఇలాంటి షేడ్స్ మస్తు ఉన్నాయి. చరిత్రలో నిలిచిపోయేందుకు ట్రంప్ తనకు తానే ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. అది రివర్స్ అవుతుందా.. సక్సెస్ అవుతుందా చూడాలి. ప్రపంచంలోనే బలమైన లీడర్ అనుకుంటున్నాడు. కానీ చైనా, భారత్, రష్యా మాత్రం తగ్గేది లేదంటున్నాయి. ఎంత వరకైనా తేల్చుకుందాం అంటున్నాయి.


డాలర్ కాయిన్ పై ట్రంప్ ఫోటో

ఫస్ట్ ఇంట గెలిచి రచ్చగెలవాలని ట్రంప్ అనుకుంటున్నారో ఏమోగానీ.. మొదట అమెరికాలో ప్రొజెక్ట్ అవ్వాలనుకుంటున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుల కంటే గొప్ప వ్యక్తిగా ఎలివేషన్స్ ఇచ్చుకుంటున్నారు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. 2026లో అమెరికా స్వాతంత్ర్యం 250 ఏళ్లు పూర్తిచేసుకోబోతోంది. ఈ సందర్భంగా అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ఒక డాలర్ ప్రత్యేక నాణెం విడుదల చేయడానికి ప్రణాళికలు రెడీ చేస్తోంది. ఈ డాలర్ కాయిన్ పై డొనాల్డ్ ట్రంప్ ఫోటో పెట్టుకుంటున్నారు. ట్రంప్ పిడికిలి ఎత్తి ఉన్న ఫోటో పెట్టి.. పక్కన ఫైట్, ఫైట్, ఫైట్ అన్న నినాదాలతో ఉన్న నాణెం డిజైన్‌ డ్రాఫ్ట్ రిలీజ్ చేశారు. ( GFX-13-10/TRUMP COIN ) నిజానికి ఇది అమెరికన్ కరెన్సీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సంప్రదాయాలకు విరుద్ధం. బతికి ఉన్న వారి ఫోటోలు కాయిన్లు, నోట్లపై వేయొద్దు. కానీ ట్రంప్ కు ముందు చూపు ఎక్కువ కదా. ఫ్యూచర్ ప్లాన్ తో గతంలోనే చట్టం చేయించుకున్నారు.


ఎప్పటి నుంచో మౌంట్ రష్మోర్ పై ట్రంప్ కన్ను

అమెరికాలో నా అంత ధీరుడు, వీరుడు లేరంటూ కితాబిచ్చుకుంటున్నారు ట్రంప్. అమెరికా చరిత్రలో తన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేందుకు తనకు తానే ఏర్పాట్లు చేసుకొంటున్నారు. అమెరికాలో ప్రముఖ నాయకుల ముఖాలను చెక్కిన మౌంట్‌ రష్మోర్‌ పై ట్రంప్ కన్ను ఎప్పటి నుంచో ఉంది. ఆ కొండపై నేషనల్‌ మెమోరియల్‌లో తన ఫేస్ స్టాచ్యూను చెక్కించాలని తెగ ఆసక్తి చూపారు. ట్రంప్ సోషల్ మీడియా అకౌంట్ లో ఏఐ వీడియోను కూడా షేర్ చేసుకున్నారు. అందులో అమెరికన్ లెజెండరీ ప్రెసిడెంట్ల పక్కనే తనది కూడా ఉన్నట్లు ఎలివేట్ చేసుకున్నారు. మౌంట్‌ రష్మోర్‌ నేషనల్‌ మెమోరియల్‌ సౌత్ డకోటాలోని కీస్టోన్‌ వద్ద ఉన్న బ్లాక్‌ హిల్‌పై ఉంది. ఇక్కడి భారీ గ్రానైట్‌ శిలలపై అధ్యక్షుల ముఖాల బొమ్మలను డిజైన్‌ చేశారు.

కొండకు మొదటికే నష్టమన్న అధికారులు

ఏటా కొన్ని మిలియన్ల మంది సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు. వాటిని చూసి వెళ్తుంటారు. ఈ మెమోరియల్‌పై అమెరికా మాజీ అధ్యక్షులైన జార్జి వాషింగ్టన్‌, థామస్‌ జెఫర్సన్‌, రూజ్ వెల్ట్‌, అబ్రహం లింకన్‌ ముఖాలు ఉన్నాయి. వీరంతా అమెరికాను వివిధ అంశాల్లో బలోపేతం చేసిన వారే. ఒక్కో శిల్పం 60 అడుగుల ఎత్తు ఉంటుంది. వీటిల్లో తన ముఖం కూడా ఉండాలని ట్రంప్‌ (Donald Trump) కోరుకుంటున్నారు. గతంలో జాన్‌ ఎఫ్‌ కెన్నడీ, రోనాల్డ్‌ రీగన్‌, బరాక్‌ ఒబామా తదితరులు అక్కడ తమ శిల్పం కూడా ఉండాలని కోరుకున్నారు. కానీ అవి వర్కవుట్ కాలేదు. ఎందుకంటే ఆ పర్వతంపై ఐదో ముఖం చెక్కడానికి చోటు సరిపోదు. మౌంట్‌ రష్మోర్‌ను నిర్వహించే నేషనల్‌ పార్క్‌ సర్వీస్‌ కూడా అక్కడ ఐదో తల ఏర్పాటుకు సేఫ్టీ కాదని, మొత్తం కూలిపోతాయన్నది.

ది అప్రెంటిస్ రియాల్టీ షోతో ఫేమస్

అసలు ట్రంప్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవారు. ఆ క్రమంలోనే ది అప్రెంటిస్ అనే రియాల్టీ టీవీ షో హోస్ట్ చేశారు. 2004 నుంచి 2017 వరకు NBC నెట్‌వర్క్‌లో 15 సీజన్‌లు రన్ అయింది. 14-18 మంది బిజినెస్ కంటెస్టెంట్లు పోటీ పడతారు. ప్రతి టాస్క్ తర్వాత ఒకరినొకరు ఎలిమినేట్ చేస్తారు. విన్నర్‌కి ట్రంప్ కంపెనీలో సాలరీతో 1 సంవత్సరం జాబ్ ఆఫర్ ఇవ్వడం ఫార్మాట్. ఈ షోలు ట్రంప్‌ని టఫ్ బిజినెస్‌మ్యాన్ గా బ్రాండ్ చేశాయి. అయితే ఈ షోలు స్క్రిప్టెడ్ అని, ట్రంప్ ఇమేజ్ మాస్క్ అని కొందరు అంటారు. ఆ షో లో యూ ఆర్ ఫైర్డ్.. ఇదీ ట్రంప్ నోట ఈజీగా వచ్చే మాట. రియాల్టీ షోలో జాబ్ ఇచ్చినట్లే ఇచ్చి రియల్ లైఫ్ లో ఫైర్డ్ అనడం కామన్ అయింది. ఇప్పుడు అధ్యక్షుడు అయినప్పటికీ అదే కథ నడుస్తోంది. అందుకే ట్రంప్ రూటే సపరేటు.

అసలేంటి ట్రంప్ లెక్క?

ప్రపంచంలోనే పవర్ ఫుల్ లీడర్ అవ్వాలని, తన మాటే చెల్లాలని, అంతా తన మాటే వినాలి.. తాను చెప్పిందే చేయాలని.. ఇలా ట్రంప్ తన మనసులో చాలా కలలు కంటున్నారు. ప్రపంచమంతా లైట్ అని అనుకుంటున్నారు. కంటి చూపుతో యుద్ధాలు ఆపేసే పవర్ తనకు ఉందనుకుంటున్నారు. ఇప్పటి వరకు 8 యుద్ధాలు ఆపానని, ఇక పాక్, అఫ్గాన్ యుద్ధం కూడా ఆపుతానంటున్నారు. అసలేంటి ట్రంప్ లెక్క?

209 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై ట్రంప్ సంతకాలు

2025లో జనవరి 20 నుంచి అక్టోబర్ 9 వరకు చూస్తే 209 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై ట్రంప్ సైన్ చేశారు. అంటే ఇది అసాధారణమే. ఇందులో కొన్ని దేశాలను భయపెట్టేవి ఉన్నాయి. కొందరిని దారికి తెచ్చుకునేవి ఉన్నాయి. ఇమ్మిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను పెంచి, ప్రో-పాలస్తీనియన్ స్టూడెంట్లు, రీసెర్చర్లను టార్గెట్ చేయడం, సాంక్షన్లు విధించడం, పారిస్ అగ్రిమెంట్ నుంచి ఉపసంహరణ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవి ప్రాజెక్ట్ 2025 అంటే కన్జర్వేటివ్ బ్లూప్రింట్ తో సమానంగా ఉన్నాయి.

భారత్ – పాక్ యుద్ధాన్ని ఆపినట్లు కలరింగ్

ఇప్పుడు భారత్ విషయంలో ట్రంప్ ఎలాంటి దూకుడు చూపుతున్నారో ఇప్పుడు చూద్దాం. ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్గామ్ లో 26 మంది టూరిస్టులను పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు చంపేశారు. కేవలం హిందువులనే టార్గెట్ చేసి చంపారు. దీనికి ప్రతీకారంగా భారత్ మే 7న పాకిస్తాన్ పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. అయితే ఉన్నట్లుండి భారత్ పాక్ మధ్య యుద్ధం ఆగిపోయింది. వెంటనే ట్రంప్ నోటికి పని చెప్పారు. ఇదంతా తన చలవే అని స్టేట్ మెంట్ ఇచ్చుకున్నారు.

50 సార్లు ఇదే మాట మాట్లాడిన ట్రంప్

ఇది భారత్ లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. అయితే పాకిస్తాన్ DGMO ఫోన్ చేసి యుద్ధం ఆపాలని కోరితేనే ఆపామని, ఇందులో ట్రంప్ ఘన కార్యం ఏమీ లేదని మోడీ పార్లమెంట్ లో చెప్పారు. అప్పటి నుంచి ట్రంప్ కు ఆ మాటే మింగుడుపడడం లేదు. ఇప్పటికి 50 సార్లకు పైగా ఇదే మాటన్నాడు ట్రంప్. అణుయుద్ధాన్ని ఆపానన్నాడు. తాజాగా హమాస్-ఇజ్రాయెల్ పీస్ డీల్ కు ముందు కూడా భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపానని ప్రకటించారు.

200% టారిఫ్ బెదిరింపులతోనే ఇండియా దిగొచ్చిందన్న ట్రంప్

పాక్ తో యుద్ధం ఆపకపోతే భారత్ పై 200 శాతం టారిఫ్ వేస్తానని బెదిరించానని ట్రంప్ ఘనంగా చెప్పుకుని తిరుగుతున్నారు. పాక్ కాళ్ల బేరానికి రావడంతోనే భారత్ యుద్దం ఆపింది. అయినా సరే మనం ట్రంప్ కి క్రెడిట్ ఇవ్వకపోవడంతో 50 శాతం టారిఫ్ లు బాదేశారు. దానికి రష్యా ఆయిల్ కొంటున్నారన్న లింక్ పెట్టారు. అదే రష్యన్ ఆయిల్ కొంటున్న చైనా, యూరప్ దేశాల జోలికి మాత్రం వెళ్లలేదు. ఇదంతా ట్రంప్ ఇగో హర్ట్ అవడంతోనే జరిగిందన్నది నిజం. డబ్బులు ఉన్నంత మాత్రాన.. వైట్ హౌజ్ లో పవర్ ఉన్నంత మాత్రాన పవర్ ఫుల్ కాదన్న వెర్షన్ లో రష్యా, చైనా, భారత్ ఉన్నాయి. ఈ విషయంలో తెగేదాకా లాగితే ట్రంప్ కే నష్టం. ట్రంప్ కు క్రెడిట్ ఇవ్వకపోవడం వల్ల వేసిన పనిష్మెంట్ ఇది. ఇప్పుడు వేసిన 50 శాతం టారిఫ్ కూడా ట్రంప్ యుద్ధాన్ని ఆపలేదు అని భారత్ చెప్పినందుకే. ఒకవేళ ట్రంప్ అద్భుతంగా మధ్యవర్తిత్వం వహించి భారత్ పాక్ యుద్ధాన్ని ఆపాడు అని మనం చెప్పి ఉంటే.. మనపై ఒక్క శాతం కూడా టారిఫ్ వేసి ఉండే వాడు కాదేమో.

UNGAలోనూ యుద్ధాలు ఆపినట్లు చెప్పుకున్న ట్రంప్

UN జనరల్ అసెంబ్లీ స్పీచ్‌లో కూడా ట్రంప్ ఏడు యుద్ధాలు ఆపానని చెప్పుకోవడానికే ఆ మీటింగ్ కు వెళ్లారు. 8వ యుద్ధం హమాస్-ఇజ్రాయెల్ ది. ఇక తొమ్మిదవ యుద్ధం పాక్-అఫ్ఘానిస్తాన్ ది అవుతుందన్న మాట. ఇదంతా ట్రంప్ లెక్కలు. నిజానికి 8 యుద్ధాల లెక్కలన్నీ నోబెల్ ప్రైజ్ కోసమే చేశారు ట్రంప్. కానీ దురదృష్టం ఆయన్ను వెంటాడింది. నోబెల్ శాంతి బహుమతి రాలేదు. యుద్ధాలు ఆపితే నోబెల్ బహుమతి ఇస్తారా.. అందుకు చాలా లెక్కలు ఉంటాయి. నోబెల్ శాంతి పురస్కారం రాజకీయాలకు అతీతం. నోబెల్ దక్కకపోయినా తానేంటో తన స్టేచర్ ఏంటో ప్రజలకు తెలుసు అని ట్రంప్ సర్దుకుపోతున్నారు. 2026లో ట్రంప్ ప్రైవేట్ నోబెల్ అవార్డ్ సృష్టించినా ఆశ్చర్యపోనవసరం లేదన్న సెటైర్లు కూడా వస్తున్నాయి.

తానేంటో జనానికి తెలుసంటున్న ట్రంప్

తాజాగా ట్రంప్ ఇజ్రాయెల్ కు వెళ్లారు. అక్కడ నెతన్యాహు ఘన స్వాగతం పలికారు. ఆ సందర్భంగా తమ దగ్గర బందీలుగా ఉన్న ఇజ్రాయెలీలందరినీ హమాస్ క్షేమంగా విడిచిపెట్టింది. రెడ్ క్రాస్ సంస్థకు అప్పగించింది. ఇదంతా ట్రంప్ ఇజ్రాయెల్ రాక సందర్భంగా జరిగింది. ఇక హమాస్-ఇజ్రాయెల్ వార్ ముగిసిందని ట్రంప్ ఘనంగా ప్రకటించారు. ట్రంప్ కు ఇజ్రాయెల్ అత్యున్నత పౌర పురస్కారాన్ని నెతన్యాహు అందించారు. నోబెల్ రాకపోయినా ఇజ్రాయెల్ పురస్కారంతో ట్రంప్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Related News

Karnataka RSS: ఆరెస్సెస్ చుట్టూ కర్ణాటక రాజకీయాలు.. సంఘ్ బ్యాన్ ఖాయమా.. ?

Visakhapatnam AI Hub: 5 ఏళ్లలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు.. విశాఖలో అడుగుపెడుతున్న గూగుల్.. కీలక ఒప్పందం!

MLA Anirudh Reddy: అనిరుధ్ రెడ్డికి భయం పట్టుకుందా?

Dharmana Krishna Das: తిరగబడ్డ క్యాడర్.. ధర్మాన పోస్ట్ ఊస్ట్?

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఛాలెంజ్.. బావ బామ్మర్దులకు అగ్నిపరీక్ష..

Bojjala Sudheer Reddy: బొజ్జల ఫ్యూచర్ ఏంటి.. చంద్రబాబు ఏం చేయబోతున్నాడు?

Telangana Politics: మరోసారి హాట్ టాపిక్‌గా మారిన కొండా ఫ్యామిలీ

Big Stories

×