BB Telugu OTT 2:బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్(Bigg Boss)తెలుగులో ఎనిమిదవ సీజన్ చివరి దశకు చేరుకుంది. డిసెంబర్ 15వ తేదీన చాలా గ్రాండ్ గా ఫినాలే నిర్వహించనున్నారు. ముఖ్యంగా నిఖిల్ , గౌతమ్ టైటిల్ రేస్ లో ఉండగా.. ఇద్దరిలో ఎవరికి టైటిల్ ఇస్తారని బిగ్ బాస్ అభిమానులు సైతం ఆతృతగా ఎదురు చూస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే డిసెంబర్ 15వ తేదీన ఈ సీజన్ కూడా పూర్తి కాబోతున్న నేపథ్యంలో బిగ్ బాస్ తెలుగు ఓటీటీ వెర్షన్ మొదలు పెట్టేందుకు బిగ్ బాస్ యాజమాన్యం ప్రయత్నిస్తోందని సమాచారం. తెలుగు బిగ్ బాస్ ఓటీటీ సీజన్2 త్వరలోనే ప్రారంభం కానుంది అని ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది..
త్వరలో బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. జనవరి నుంచి బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ 2 ప్రారంభించడానికి బిగ్ బాస్ నిర్వహకులు అన్ని ఏర్పాట్లు చేశారని సమాచారం. అంతేకాదు బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ 2 కంటెస్టెంట్లు ఎవరనేది కూడా ప్రాథమికంగా ఖరారు అయిందట. ఇకపోతే ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ టీవీ వెర్షన్ కంటే ఓటీటీ వెర్షన్ ఎక్కువ మంది వీక్షించినట్టు గణాంకాలు కూడా చెబుతున్నాయి. అందుకే బిగ్ బాస్ యాజమాన్యం కూడా ఓటీటీ పై దృష్టి పెట్టిందని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఓటిటి సీజన్ 2 ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారట.
బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 కంటెస్టెంట్స్..
ఇకపోతే ఈ సీజన్ కి ఎవరెవరు కంటెస్టెంట్స్ గా పాల్గొనబోతున్నారు అనే విషయానికి వస్తే.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో మొదట్లోనే ఎలిమినేట్ అయిన ఆర్జె శేఖర్ భాషా తో పాటు అభయ్ నవీన్ కూడా ఓటీటీలో పాల్గొనబోతున్నారట. అలాగే సీరియల్ నటి మహేశ్వరి, బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ ప్రియాంక జైన్ కూడా ఓటీటీ వెర్షన్ లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. వీరితో పాటు యూట్యూబ్ వర్ష , సీజన్ 4 కంటెస్టెంట్ హారిక తో పాటు బంచిక్ బబ్లు, సహార్ కృష్ణన్, జ్యోతి రాజ్ వంటి వారు ఈ సీజన్లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. అంతేకాదు ఓటీటీ వెర్షన్ కి కూడా హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఓటీటీ సీజన్ 2 కూడా ప్రారంభం కాబోతోంది అని తెలిసి బిగ్ బాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈవారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..?
ఇదిలా ఉండగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విషయానికి వస్తే.. మొదటి ఫైనలిస్ట్ గా అవినాష్ నిలవగా ప్రేరణ, విష్ణు ప్రియ, రోహిణి, నబీల్, గౌతమ్, నిఖిల్ నామినేషన్ లోకి వచ్చారు. ఇక ముగిసిన ఓటింగ్ ప్రకారం రోహిణి, ప్రేరణ లీస్ట్ లో వుండగా.. ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఆ ఒక్కరు ఎవరు అనే విషయం కాసేపట్లో తేలనుంది. ఈ వారం అనగా శనివారం జరగబోయే ఎపిసోడ్లో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో తెలియనుంది.