BigTV English

Allu Arjun: తొక్కిసలాటలో మహిళ చనిపోయిందని నాకు తెలియదు.. అందుకే టైమ్ తీసుకున్నాను

Allu Arjun: తొక్కిసలాటలో మహిళ చనిపోయిందని నాకు తెలియదు.. అందుకే టైమ్ తీసుకున్నాను

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప 2. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ పై భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని యలమంచిలి రవి శంకర్, ఎర్నేని నవీన్ నిర్మించారు. డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం 294 కోట్లతో డే1 వసూళ్లతో రికార్డు సాధించింది. ప్రపంచమంతటా పాజిటివ్ టాక్ తో ఈ చిత్రం దూసుకెళ్తున్న సందర్భంగా చిత్ర బృందం బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ నిర్వహిచారు.


ఇక ఈ సందర్భంగా చిత్ర బృందం అంతా ఈ ప్రెస్ మీట్ హాజరయ్యారు. ఇంత సక్సెస్ అందుకున్నా కూడా ఈ సినిమా సమయంలో జరిగిన ఒక విషాద సంఘటన ఇండస్ట్రీ మొత్తానికి ఆవేదనను మిగిల్చింది. పుష్ప 2 ప్రీమియర్ షోలో రేవతి అనే మహిళ మృత్యువాత  పడిన విషయం విదితమే. దిల్షుఖ్ నగర్ ఏరియాకి చెందిన రేవతి (39) తన భర్త భాస్కర్, ఇద్దరు పిల్లలు శ్రీ తేజ్ (9) , సన్వీక (7) సంధ్య థియేటర్ లో  పుష్ప 2 ను చూడడానికి వచ్చారు. ఆ సమయంలోనే అల్లు అర్జున్ సైతం అభిమానులతో కలిసి సినిమా చూడడానికి వచ్చాడు.

BB Telugu OTT 2: బిగ్ బాస్ లవర్స్ కి గుడ్ న్యూస్.. త్వరలో ఓటీటీ సీజన్2..!


ఇక అభిమాన హీరో  కనిపించడంతో ఫ్యాన్స్ అదుపు తప్పారు. బన్నీని చూడడానికి పరుగులు పెట్టారు. ఆ తొక్కిసలాటలో రేవతి మరణించగా.. శ్రీ తేజ్ గాయపాలపాలయ్యాడు. ఇక  ఈ ఘటనపై అల్లు అర్జున్ టీమ్, మైత్రీ మూవీ మేకర్స్  స్పందించారు. గత రాత్రి స్క్రీనింగ్ సమయంలో జరిగిన విషాద సంఘటనతో మేము చాలా బాధపడ్డాము.  ఆ కుటుంబం మరియు వైద్య చికిత్స పొందుతున్న చిన్న పిల్లవాడి ఆరోగ్యంగా బయటపడాలని మేము ప్రార్థిస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో వారికి అండగా నిలవడానికి, వారికి సాధ్యమైన అన్ని సహాయాన్ని అందించడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పుకొచ్చారు. ఇక  నిన్న అల్లు అర్జున్ సైతం మాట్లాడుతూ.. ఆ కుటుంబానికి రూ. 25 లక్షలు ఆర్థిక సహాయం అందించాడు.

తాజాగా నేడు  సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ ఈ ఘటనపై మాట్లాడాడు. ” అనుకోకుండా సంధ్య థియేటర్లో జరిగిన సంఘటన మమ్మల్ని ఎంతగానో కదిలించింది. గత 20 సంవత్సరాలుగా ఇలాగే వస్తున్నాము కానీ ఆరోజు కొంచం ఎక్కువ జనం ఉండటంతో ఇబ్బంది అవుతుంది అని థియేటర్ యాజమాన్యం చెప్పగానే వెళ్ళిపోయాం. కానీ, ఇంటికి వచ్చిన తరువాత రోజు జరిగిన సంఘటన గురించి తెలిసింది. అది తెలిసి చాల బాధ కలిగింది. ఆ షాక్ నుంచి నేను వెంటనే కోలుకోలేకపోయాను. చాలాసేపు దాని గురించే ఆలోచించాను. అందుకే ఆ ఘటనపై స్పందించడానికి టైమ్ పట్టింది.

Allu Arjun: టికెట్ రేట్స్ పెంచేసరికి కళ్యాణ్ బాబాయ్ అయ్యాడా.. బన్నీ బాబు

సభాముఖంగా మరొకసారి చెప్తున్నాను.. ఆ కుటుంబం కోసం 25 లక్షలు కేవలం ఒక సాయంగా అనుకుని ఇస్తున్నాము. అయినా ఒక మనిషి లేని లోటు ఎవరు తీర్చలేము. అందుకు నేను ఎంతో విచారిస్తున్నాను. అంత కుదుటపడిన తరువాత వ్యక్తిగతంగా వెళ్లి ఆ కుటుంబాన్ని కలుస్తాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

 

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×