CM Revanth Reddy Songs: మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అన్న నినాదంతో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ ఆ దిశగా తొలి ఏడాదిలోనే మార్పు చూపించింది. సంక్షేమంతో పాటే అభివృద్ధి పనులు చేపట్టింది. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ నెల 9 సాయంత్రం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచకా పూర్తి చేస్తున్నారు.
తెలంగాణ తల్లి విగ్రహ నమూనా ఫోటోలను కూడా ప్రభుత్వం నిన్న రిలీజ్ చేసింది. దొరసాని కాదు.. రాజమాత అంతకంటే కాదు.. అచ్చ తెలంగాణ మహిళకు నిండైన ప్రతిరూపంగా కొత్త విగ్రహం నమూనా విడుదలైంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహ నమూనా బయటికొచ్చింది. తెలంగాణ సామాన్య మహిళను ప్రతిబింబించేలా రూపాన్ని తీసుకొచ్చారు.
సామాన్య తెలంగాణ మహిళను ప్రతిభంబించేలా తయారు చేయాలని సీఎం తమకు చెప్పారని విగ్రహా రూపకర్త గంగాధర్, శిల్పి రమణ అన్నారు. తెలంగాణ పోరాటం చరిత్ర అని.. ఇప్పుడు సామాన్యులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అయితే తాజాగా రేవంత్ రెడ్డి సంవత్సరం పాలనపై కొత్త పాటను రిలీజ్ చేశారు. ఇంకెందు ఆలస్యం మీరు ఓ లుక్కేయండి.