BigTV English

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్‌కు భారీ లక్.. ప్రైజ్ మనీని మరింత పెంచిన నాగార్జున

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్‌కు భారీ లక్.. ప్రైజ్ మనీని మరింత పెంచిన నాగార్జున

Bigg Boss 8 Telugu Prize Money: మామూలుగా బిగ్ బాస్ రియాలిటీ షోలో విన్నర్ అయ్యేవారికి ప్రైజ్ మనీ ఎంత వస్తుంది అనే విషయాన్ని మొదట్లోనే రివీల్ చేస్తారు మేకర్స్. కానీ బిగ్ బాస్ సీజన్ 8లో అలా జరగలేదు. బిగ్ బాస్ 8లో విన్నర్‌కు ప్రైజ్ మనీ జీరోతో మొదలయ్యింది. ఈ సీజన్ అంతా అన్‌లిమిటెడ్ అని ముందే ప్రకటించిన మేకర్స్.. ప్రైజ్ మనీ కూడా అంతే అన్‌లిమిటెడ్ అని చెప్పి కంటెస్టెంట్స్‌తో పాటు ప్రేక్షకులను కూడా ఆశ్చర్యపరిచారు. అంటే కంటెస్టెంట్స్ అంతా కలిసి ఆటలు ఆడి, టాస్కులు గెలిచి ప్రైజ్ మనీని జీరో నుండి పెంచుకుంటూ ఉండాలి. వారు ఎంత గెలిస్తే ప్రైజ్ మనీ అంతా పెరుగుతూ ఉంటుంది. అలా కంటెస్టెంట్స్ అంతా ప్రైజ్ మనీని ఏ రేంజ్‌కు తీసుకెళ్లారో తాజాగా నాగార్జున రివీల్ చేశారు.


ఇప్పుడు కూడా టాస్క్ ఆడాల్సిందే

కంటెస్టెంట్స్ అంతా కలిసి చివరి వారం వరకు కూడా తమ ప్రైజ్ మనీని పెంచుకోవడానికి ఎన్నో టాస్కులు ఆడారు. అలా మొత్తానికి ప్రైజ్ మనీ రూ.54,99,999కు చేరుకుంది. ఇప్పటివరకు బిగ్ బాస్ తెలుగులో ఏడు సీజన్స్ పూర్తిచేసుకుంది. కానీ ఏ సీజన్‌లో అయినా ప్రైజ్ మనీ రూ.50 లక్షలు మాత్రమే ఉండేది. ఈసారి కంటెస్టెంట్స్ తమ కష్టంతో మరింత ఎక్కువ ప్రైజ్ మనీని సంపాదించుకున్నారు. అయితే ఈ ప్రైజ్ మనీకి రూ.55 లక్షలు చేస్తానని ఫైనల్స్‌లో కూడా టాప్ 5 కంటెస్టెంట్స్‌కు ఒక టాస్క్ పెట్టారు నాగార్జున. వారు గెలిస్తే ప్రైజ్ మనీని రూ.55 లక్షలు చేస్తానని మాటిచ్చారు. పైగా ఆ టాస్క్‌కు రోహిణిని సంచాలకురాలిగా ప్రకటించారు.


Also Read: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ అతడే.. ఫైనల్‌గా గెలిచేశాడుగా!

ప్రైజ్ మనీ పెరిగింది

హౌస్‌లో టాప్ 5 కంటెస్టెంట్స్ నాగార్జున చెప్పేదానికి రివర్స్ చేయాలి. వాళ్లు కరెక్ట్‌గా చేస్తున్నారా లేదా అనే విషయాన్ని బయట ఉన్న రోహిణి గమనిస్తూ ఉండాలి. అలా ఈ టాస్క్ సీరియస్‌గా స్టార్ట్ అయినా సరదాగా సాగింది. అవినాష్, నబీల్, నిఖిల్ ఔట్ అయినా కూడా దానిని పరిగణనలోకి తీసుకోకుండా మొత్తానికి ప్రైజ్ మనీని రూ.55 లక్షలకు పెంచారు నాగార్జున. అలా బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్‌కు లక్ భారీగా పెరిగినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు బిగ్ బాస్ హిస్టరీలోనే ఏ విన్నర్ ఇంత ప్రైజ్ మనీని గెలుచుకోలేదు. దీంతో పాటు ఒక కారు కూడా విన్నర్‌కు బహుమతిగా దక్కనుంది. అలా బిగ్ బాస్ సీజన్ 8 భారీ లాభంతో తిరిగి ఇంటికి వెళ్లనున్నారు.

తనే విన్నర్

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో టాప్ 5 కంటెస్టెంట్స్‌లో తమకు నచ్చిన కంటెస్టెంట్ విన్ అవ్వాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కానీ మొత్తానికి కన్నడ బ్యాచ్ నుండి నిఖిలే విన్నర్ అని సమాచారం బయటికొచ్చింది. దీంతో ప్రైజ్ మనీ అయిన రూ.55 లక్షలతో పాటు కారును కూడా తన ఇంటికి తీసుకువెళ్లనున్నాడు నిఖిల్. కన్నడ బ్యాచ్ అంటూ తనపై ఎంత నెగిటివిటీ వచ్చినా తన ఆటతీరుతో చాలామంది ప్రేక్షకులను ఇంప్రెస్ చేసి విన్నర్‌గా నిలిచాడు ఈ సీరియల్ హీరో.

Related News

Bigg Boss 9: చెప్పినా వినలేదు.. ప్రియా శెట్టి పేరెంట్స్ ఆవేదన.. ఏమైందంటే?

Bigg Boss 9 Promo: ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు.. సందిగ్ధంలో కంటెస్టెంట్స్!

Bigg Boss 9: బిగ్ బాస్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న బాస్, ఇదేవరూ ఊహించలేదు భయ్యా!

Bigg Boss 9 Promo: ఇట్స్ ఎమోషన్స్ టైం.. దుఃఖంలో కూడా త్యాగం చేసిన ఇమ్ము!

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?

Bigg Boss 9 Telugu: రీతూకి డిమోన్ వెన్నుపోటు.. ల*త్కో*ర్ పనులంటూ.. శ్రీజ సేవ్, నామినేషన్ లో ఉన్నదేవరంటే..

Divvela Madhuri: నా రాజాను వదిలి ఉండలేను.. కానీ, వైల్డ్ కార్డ్ ఎంట్రీ పై మాధురి క్లారిటీ!

Big Stories

×