AI Chef : ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో ఏఐ చేయని పనులు ఏమున్నాయి. ప్రతీ విషయంలో సలహాలు ఇవ్వడంతో పాటు ముందుకు నడిపించడంలో ముందుంటున్నాయి. ఇక ఇప్పుడు ఈ ఏఐ వంటింట్లోకి సైతం వచ్చేసింది. ఏఐ షెఫ్ లు వచ్చేసారు. యాప్రాన్ వేసుకోకుండా, హ్యాట్ పెట్టుకోకుండానే మనకు కనిపించకుండా వంట చేసేస్తారు. నిజం నమ్మలేకపోతున్నారు కదా.. మరి అసలు వీటి వెనక ఉన్న కథ ఏంటి? ఇవి ఎలా వంట చేసి పెడతాయో ఒకసారి తెలుసుకుందాం.
వంటలు ప్రత్యేకంగా చేయాలని ఎవరికి మాత్రం ఉండదు.. అయితే ఈ హడావిడి ఉరుకుల పరుగుల జీవితంలో ఈ విషయం అంత తేలికేమి కాదు. అందులో పొద్దున్నే లేచి ఆఫీస్ కి వెళ్లేవాళ్లు, బాక్సులు చేసి ఇవ్వాల్సిన వారు సైతం హడావిడి పడుతూనే ఉంటారు. అందులో కొన్ని కాయగూరలు మాత్రమే ఉన్నప్పుడు వాటితో వంట చేయడం మరింత కష్టం. ఒకవేళ ఏ యూట్యూబ్ నో, గూగుల్ నో అడిగితే మరికొన్ని వంట సామాన్లు కావాలని అడుగుతుంది. ఏవేవో చెప్తుంది. కాస్త సమయం ఉన్నప్పుడు వీటితో ప్రయోగాలు చేయడం పెద్ద విషయం కాదు కానీ సమయం తక్కువగా ఉన్నప్పుడు ఉన్న వాటితోనే ఎలా వంట చేయాలి అనేది పెద్ద టాస్క్. ఇలాంటి వారి కోసమే ఎంతగానో ఉపయోగపడతాయి ఈ ఏఐ షెఫ్స్.
ఇంట్లో ఉండే పదార్థాలతోనే గూగుల్ లోకి వెళ్లి వాటిని టైప్ చేస్తే సెకన్ల తేడాతోనే ఓ వంటకం మీ కళ్ల ముందు కనిపిస్తుంది. కేవలం మీ దగ్గర ఉన్న పదార్థాలతోనే ఎలా చక్కగా కొత్తగా వండి పెట్టొచ్చో చెప్పేస్తుంది. పోషక విలువలు సైతం తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఇందులో అవసరాలకు అనుగుణంగా వంటలు చేసి పెట్టడంతో పాటు ఆరోగ్యం, తీసుకోవాల్సిన పోషకాలు, ఇష్టాలు, సమయాన్ని బట్టి చేయాల్సిన వంటలను సైతం వివరిస్తుంది.
అసలు ఎలా పనిచేస్తుందంటే –
వంటింట్లో ఉండే పదార్థాలతోనే కొత్తగా ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ఎంతగానో ఉపయోగపడతాయి ఈ షెఫ్స్. ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో డిఫరెంట్ వెరైటీస్ ఎలా చేయాలో చెబుతుంది. ఇక వాటిలో ఉండే పోషక విలువలను సైతం స్క్రీన్ మీద చూపిస్తుంది. ఇక మధుమేహం, రక్తపోటు ఉన్న వారికి తగిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో చెబుతుంది. కీటో, జపనీస్, చైనీస్ వంటి వంటకాలను సైతం తేలికగా వండే అవకాశం ఉంటుంది. ఈ రోజు డిన్నర్ కి ఏం వంట చేయాలి? పంచదార లేకుండా స్వీట్స్ ఏమైనా చేయవచ్చా? తక్కువ నూనెతో చేసే స్నాక్స్ ఏంటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి ఏఐ చక్కగా సమాధానాలు చెప్తుంది. ఇక మనకంటూ సొంతంగా చెఫ్ ను పెట్టుకున్నట్టే పనిచేస్తుంది.
ఇక ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఈ ఏఐ షెఫ్స్ తో కలిసి పనిచేయాలనుకుంటున్నారా? వీటితో కలిసి వంటలు చేయాలనుకుంటే ‘మై షెఫ్ ఏఐ’, ‘షెఫ్ జీపీటీ’, ‘ఏఐ షెష్ రెసిపీ జనరేటర్’, ‘స్మార్ట్ రెసిపీ ఏఐ షెఫ్’ వంటి వాటిలో లాగిన్ అయితే చాలు. ఎప్పుడూ మీ వెంట ఉంటే ఓ చెఫ్ ఉండే ఫీలింగ్ కలిగిస్తూ చక్కని సలహాలు ఇచ్చేస్తుంది.
ALSO READ : రూ.12000లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఆఫ్షన్స్ ఇవే