BigTV English

Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ అతడే.. ఫైనల్‌గా గెలిచేశాడుగా!

Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ అతడే.. ఫైనల్‌గా గెలిచేశాడుగా!

Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఫైనల్స్‌కు చేరుకుంది. ప్రేక్షకులంతా తమ ఫేవరెట్ కంటెస్టెంట్స్ గెలవాలని కోరుకుంటున్నారు. మొత్తానికి టాప్ 5లో చేరుకున్న కంటెస్టెంట్స్ అందరి మధ్య ఓటింగ్ విషయంలో గట్టి పోటీనే జరిగింది. మొత్తానికి బిగ్ బాస్ 8 ప్రారంభం అయినప్పటి నుండి కష్టపడి ఆడి అవినాష్, ప్రేరణ, నిఖిల్, నబీల్, గౌతమ్ టాప్ 5 కంటెస్టెంట్స్‌గా నిలిచారు. కానీ ఇందులో గౌతమ్, నిఖిల్ ఓటింగ్ విషయంలోనే మరింత గట్టి పోటీ మొదలయ్యింది. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు విన్నర్ అనే విషయం బయటపడింది. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన వారు ఎప్పుడూ విన్ అవ్వలేదు కాబట్టి నిఖిలే విన్నర్ అని చాలామంది కరెక్ట్‌గా గెస్ చేశారు. చాలామంది నెటిజన్ల గెస్సే కరెక్ట్ అయ్యింది.


మధ్యలో నెగిటివిటీ

బిగ్ బాస్ సీజన్ 8లో మొదటి చీఫ్‌గా విన్ అయిన నిఖిలే సీజన్ విన్నర్ కూడా అయ్యాడు. సీజన్ గడుస్తున్నకొద్దీ కన్నడ బ్యాచ్ అంటూ నిఖిల్‌పై నెగిటివిటీ ఏర్పడింది. కానీ తను మాత్రం పెద్దగా కాంట్రవర్సీల్లోకి వెళ్లకుండా ప్రేక్షకులను ఎక్కువగా దృష్టిలో పెట్టుకొని గేమ్స్ ఆడుతూ అందరి మనసును గెలుచుకున్నాడు. బిగ్ బాస్ 8 ప్రారంభమయిన కొన్నిరోజుల్లోనే నిఖిల్ విన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చాలామంది అనుకున్నారు. కానీ మధ్యలో అమ్మాయిలతో లవ్ ట్రాక్, కన్నడ బ్యాచ్ అనే ట్యాగ్ రావడంతో తను విన్నర్ అవ్వకపోవచ్చనే అనుమానాలు మొదలయ్యాయి. మొత్తానికి అందరి అనుమానాలకు చెక్ పెట్టి నిఖిలే విన్నర్‌గా నిలిచాడు.


Also Read: డబ్బే ప్రదానం.. డబ్బు కోసమే ఇదంతా.. నిఖిల్ కామెంట్స్ వైరల్..!

కన్నడ బ్యాచ్

బిగ్ బాస్ 8లో ఎక్కువగా కన్నడ సెలబ్రిటీలు ఉన్నారని, వారంతా కలిసి తెలుగు సెలబ్రిటీలను ఆడనివ్వడం లేదని కొన్నాళ్ల పాటు సోషల్ మీడియాలో చర్చలు నడిచాయి. అందుకే చాలామంది ప్రేక్షకులు ఈ కన్నడ బ్యాచ్‌కు నెగిటివ్ అయిపోయారు. వారికి ఓట్లు వేయకూడదని ఫిక్స్ అయ్యారు. అందుకే ఆ బ్యాచ్ నుండి పృథ్వి, యష్మీ వెంటవెంటనే ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్లిపోయారు. నిఖిల్, ప్రేరణ మాత్రమే టాప్ 5 వరకు రాగలిగారు. చాలామంది ప్రేరణ కూడా విన్నర్ అయితే బాగుంటుందని అనుకున్నారు. కానీ ప్రేరణ కంటే నిఖిల్ ఫ్యాన్ బేస్ చాలా గట్టిగా ఉంది. అందుకే ఎక్కువ ఓట్లు వేసి తమ ఫేవరెట్ కంటెస్టెంట్‌ను గెలిపించుకున్నారు నిఖిల్ ఫ్యాన్స్.

ఫ్యాన్స్ కోపం

టాప్ 5 కంటెస్టెంట్స్‌లో గౌతమ్ కూడా విన్నర్ అయితే చాలా బాగుంటుందని చాలామంది ప్రేక్షకులు కోరుకున్నారు. చాలామంది తనే విన్నర్ అని ఫిక్స్ అయిపోయారు కూడా. కానీ ఒక వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా వచ్చిన వ్యక్తి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయినట్టుగా చరిత్రలోనే లేదు. అందుకే గౌతమ్‌కు కప్ దక్కనివ్వకుండా చేశారని అప్పుడే తన ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిఖిల్ ఆటతీరు నచ్చని వారు తను విన్నర్ అవ్వడమేంటి అని కామెంట్స్ చేస్తున్నారు. అందుకే గత సీజన్‌లో లాగా ఈ సీజన్ ఫైనల్స్‌లో ఎలాంటి గొడవ జరగకూడదని, కంటెస్టెంట్స్‌కు ఏమీ కాకూడదని హైదరాబాద్ పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×