Bigg Boss 9 Wildcard Entry: బిగ్ బాస్ సీజన్ 9 దాదాపుగా 32 రోజులు పూర్తి చేసుకుంది. నాలుగు వారాల్లో నలుగురు కంటెస్టెంట్లు బయటకు వెళ్లిపోయారు. అందులో ముగ్గురు కామనర్స్. ఒక సెలబ్రిటీ. మొదట కామనర్స్ మరియు సెలబ్రిటీస్ అని హౌస్ లో రెండు రోజుల కొద్దిపాటి వ్యత్యాసం ఉండేది. కానీ రోజులు మారుతున్న కొద్దీ ఎవరు గేమ్ వాళ్ళు ఆడుకోవడం మొదలుపెట్టారు. కామనర్స్, సెలబ్రిటీస్ అని పూర్తిగా మర్చిపోయి ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకోవడం మొదలుపెట్టారు.
బిగ్ బాస్ కూడా చాలా తెలివిగా కామనర్స్ లో కామనర్స్ కి. సెలబ్రిటీస్ లో సెలబ్రిటీస్ కి మధ్య గొడవలు పెట్టేసారు. ఇకపోతే కొత్తగా మరో కామనర్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఎంట్రీ ఇవ్వనన్న హౌస్ మేట్స్ గురించి చెబితే షాక్ అవుతారు. శనివారం జరగబోయే ఎపిసోడ్ లో వీరందరూ ఎంట్రీలో కనిపిస్తారు.
మొత్తానికి ఆరుగురు వైల్డ్ కార్డు ఎంట్రీ తో హౌస్ లోపలికి రానున్నారు. ఈ ఆరుగురిలో నలుగురు మహిళలు ఉండటం విశేషం. ఇంకో ఇద్దరు మగవాళ్ళు. ఇంటర్ ఇచ్చే ఆరుగురు మరి ఎవరో కాదు. ఆయేషా, శ్రీనివాస, గౌరవ గుప్త, దివ్యెల మాధురి, చిట్టి పికిల్స్ రమ్య, నిఖిల్ నాయర్ వీళ్లు హౌస్ లోకి ఎంటర్ ఇస్తున్నారు.
వీళ్ళ గురించి ప్రత్యేకించి పరిచయాలు అవసరం లేదు సోషల్ మీడియా ఉపయోగించే ఎవరికైనా కూడా వీళ్ళు మోకాలు నిత్యం కనిపిస్తూనే ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఫేమస్ అయ్యారు. ఇలాంటి వాళ్లందర్నీ తెచ్చి బిగ్ బాస్ హౌస్ లో పెడుతున్నారు.
బిగ్ బాస్ మొదటి సీజన్ మొదలైనప్పుడు ఎక్కువ శాతం మంది తెలిసిన వాళ్లే వచ్చారు. ఇద్దరూ ముగ్గురు తెలియకపోయినా కూడా వాళ్ల వర్క్ గమనించిన తర్వాత వాళ్ల గురించి కూడా ఒక అవగాహన వచ్చింది. అయితే బిగ్ బాస్ సీజన్లు మారుతున్న కొద్దీ తెలిసిన వాళ్ళకంటే తెలుసుకోవాల్సిన వాళ్ళు ఎక్కువగా ఎంట్రీ ఇవ్వడం మొదలుపెట్టారు.
బిగ్ బాస్ అంటే కేవలం సెలబ్రెటీస్ మాత్రమే కాదు కామనర్స్ కూడా ఉండాలి అని అప్పట్లో కొంత వాదన నడిచింది. దాని ప్రకారమే కామనర్సని కూడా ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టారు. ఏకంగా ఈ సీజన్లో అయితే మొదట ఏడుగురు కామనర్స్ హౌస్ లోకి ఎంటర్ ఇచ్చారు. ఒకరు ఎలిమినేట్ అవ్వగానే దివ్య వెలమూరి కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
ఇప్పుడు ఏకంగా మరో ఆరుగురు కామనర్లు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇలా వారానికి ఒకరు ఎలిమినేట్ అయిపోయి, మరొకరు ఎంట్రీ ఇస్తుంటే ఇది ఎంతవరకు సాగుతుందో అవగాహన లేకుండా పోతుంది. మొత్తానికి వచ్చినవాళ్లు రకరకాల ఇష్యుల వలన ఫేమస్ అయ్యారు. వీళ్లు పేర్లు తెలిస్తే కొంత మంది యాడ దొరికిన సంత అంటూ కామెంట్ చేయడం మొదలుపెట్టారు.
Also Read: Funky Teaser Review : సాలిడ్ కం బ్యాక్ మామ, ప్యూర్ అనుదీప్ స్టఫ్, నవ్వులే నవ్వులు