BigTV English

Bigg Boss 9 Promo: పొట్టిగా ఉండడం ఆయన చేసిన తప్పా.. ఏంటమ్మా ఫ్లోరా?

Bigg Boss 9 Promo: పొట్టిగా ఉండడం ఆయన చేసిన తప్పా.. ఏంటమ్మా ఫ్లోరా?

Bigg Boss 9 Promo: బిగ్ బాస్.. ప్రస్తుతం తెలుగులో 9వ సీజన్ కొనసాగుతోంది. ఇప్పటికే 4 వారాలు పూర్తయ్యాయి. మరో రెండు రోజుల్లో 5వ వారం కూడా పూర్తవుతుంది. దీంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు? అనే ఉత్కంఠ చూసే ఆడియన్స్ లో నెలకొంది. ఇదిలా ఉండగా తాజాగా 33వ రోజుకు సంబంధించిన మొదటి ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. ఇందులో పాపం సుమన్ శెట్టి బలైపోయారు అని చెప్పవచ్చు. పొట్టిగా ఉండడం ఆయన చేసిన తప్పా.. ఏంటమ్మా ఫ్లోరా కాస్తైనా జాలి లేదా అంటూ ఆమెపై నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


సేఫ్ జోన్ కోసం కంటెస్టెంట్స్ తిప్పలు..

డేంజర్ జోన్ లో ఉన్న సభ్యుల అందరికీ వైల్డ్ స్ట్రోమ్ నుండి బయటపడడానికి మరో అవకాశం కల్పిస్తున్నాను.. అదే ఫైట్ ఫర్ సర్వైవల్. ఇదే మీకు లాస్ట్ అవకాశం.. ఎదురుగా నీటితో ఉన్న పూల్స్ ఉన్నాయి. అందులో ఎవరు పడుకోవాలి అన్నది సేఫ్ జోన్ లో ఉన్న హౌస్ మేట్స్ డిసైడ్ చేస్తారు. అంటూ టాస్క్ వివరించారు. బిగ్ బాస్. ఇక సేఫ్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఆ పూల్ లో ఎవరు పడుకోవాలి అన్న విషయంపై డిస్కషన్ చేస్తూ ఆఖరికి సుమన్ శెట్టి, శ్రీజతో పాటు మరో ఇద్దరు ఆ పూల్ లో పడుకుంటారు. ఇక నీటి దాటికి తట్టుకోలేక ఎవరైతే లేచి కూర్చుంటారో వారు ఎలిమినేట్ అవుతారని కూడా బిగ్ బాస్ తెలిపారు.

పాపం సుమన్ శెట్టి..

మిగిలిన కంటెస్టెంట్స్ ఒక పూల్ లో నుంచి ఇంకొక పూల్ లోకి నీటిని వేయడం వల్ల నీటిలో పడుకున్న కంటెస్టెంట్స్ తట్టుకోలేక పోతారు. ఆఖరికి సుమన్ శెట్టి కాస్త ఇబ్బంది పడడంతో వెంటనే ఫ్లోరా సుమన్ శెట్టి అన్న ఎలిమినేటెడ్ అంటూ చెబుతుంది. మీరు కాళ్లతో సపోర్ట్ తీసుకున్నారు అని ఫ్లోరా చెప్పగా లేదు సిస్టర్ నేను సీరియస్గా చెబుతున్న ఎటువంటి సపోర్ట్ తీసుకోలేదు అంటూ చెబుతారు. నేను చూశానండి అంటూ ఫ్లోరా చెప్పగా.. ఆరడుగులు ఉండాలా అతనిలాగా.. పొట్టిగా ఉండడం నా తప్ప అంటూ పూల్ లో నుంచి లేచి సీరియస్గా వెళ్లిపోయారు.


ALSO READ:Shobha Shetty: శోభా శెట్టి కొత్త వ్యాపారం.. దీని వెనుక ఉన్న సీక్రెట్ తెలుసా?

ఫ్లోరాను ఏకిపారేస్తున్న నెటిజన్స్..

ఎప్పుడు హౌస్ లో అందరిని నవ్వించే సుమన్ శెట్టి ఇప్పుడు ఇలా సీరియస్ గా వెళ్లిపోవడం చూసి అందరూ పాపం ఆయన కష్టానికి ప్రతిఫలం లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంతమంది పొట్టిగా ఉన్నాడు అలా ఎలా జరుగుతుంది ఫ్లోరా కాస్త జాగ్రత్తగా గమనించాల్సింది కదా.. కనీసం జాలి కూడా లేదా అంటూ ఆమెను ఏకీపారేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇదిలా ఉండగా ఈ వారం వైల్డ్ కార్డు ఎంట్రీస్ ఉంటుందంటూ బిగ్ బాస్ హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. మరి వైల్డ్ కార్డు ద్వారా ఎవరు హౌస్ లోకి అడగపెట్టబోతున్నారో తెలియాల్సి ఉంది.

Related News

Bigg Boss 9 New Captain: భరణికి చెక్ పెట్టిన కళ్యాణ్.. హౌజ్‌ కొత్త కెప్టెన్‌గా అతడే!

Bigg Boss 9 Promo: అదిరిపోయిన కెప్టెన్సీ టాస్క్.. అతి నమ్మకం పనికిరాదు పాపా!

BB 9 Wild Card: వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్న కాంట్రవర్సీ క్వీన్.. రచ్చ మాములుగా ఉండదు మరి..!

Bigg Boss 9 : 2 టాస్క్ లతో స్కోర్స్ తారుమారు, నాశనం చేసిన రీతు, సేఫ్ జోన్ కి వెళ్ళిపోయిన ఆ ముగ్గురు

Bigg boss 9: దివ్య వచ్చాక భరణి నిజంగానే మారిపోయాడా? అసలు సంజన ఎమోషన్ వెనుక అర్థం ఉందా?

Bigg Boss 9 Promo: రేస్ నుంచి సంజన-ఫ్లోరా అవుట్.. కర్మ సిద్దాంతమంటూ హితబోధ చేసిన గుడ్డు దొంగ!

Bigg Boss: బిగ్ బాస్ కోసం ఉపముఖ్యమంత్రి.. తెరుచుకున్న గేట్లు!

Big Stories

×