BigTV English

BB 9 Wild Card: వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్న కాంట్రవర్సీ క్వీన్.. రచ్చ మాములుగా ఉండదు మరి..!

BB 9 Wild Card: వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్న కాంట్రవర్సీ క్వీన్.. రచ్చ మాములుగా ఉండదు మరి..!

BB 9 Wild Card: తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ రియాల్టీ షో ప్రస్తుతం సీజన్ 9 ప్రసారమవుతున్న విషయం తెలిసిందే.. నాలుగు వారాలు పూర్తి చేసుకున్న ఈ షో ఐదో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఐదో వారం కూడా పూర్తి కావస్తున్న నేపథ్యంలో వైల్డ్ కార్డు ఎంట్రీ గురించి రోజుకో వార్త బయటకు వస్తుంది. ఈసారి వైల్డ్ కార్డు ద్వారా సెలబ్రిటీలు ఎంట్రీ ఇస్తారా? లేక సామాన్యులు ఎంట్రీ ఇస్తారా అన్న ఆసక్తి నెలకొంది. తాజాగా వైల్డ్ కార్డు గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈసారి వైల్డ్ కార్డు ద్వారా కాంట్రవర్సీ క్వీన్ రాబోతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆమె ఎవరో ఒకసారి తెలుసుకుందాం..


రమ్య చిట్టి వైల్డ్ కార్డు ఎంట్రీ..

బిగ్ బాస్ లో ప్రతి సీజన్ ఆసక్తికరంగా ఉంటుంది. మొదటిగా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ లతో పోలిస్తే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చిన కంటెస్టెంట్లతో షో మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది.. అయితే గత సీజన్లో పాత కంటెస్టెంట్లు మళ్ళీ హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వడం సహజం. ఈసారి బిగ్ బాస్ లో మాత్రం అలా జరగదని తెలుస్తుంది. పాత కంటెంట్ ను కాకుండా కొత్త వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నంలో యాజమాన్యం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐదోవారం నుంచి హౌస్‌లోకి మరికొంత మంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అడుగు పెట్టబోతున్నారు. ఏకంగా ఆరుగురు కంటెస్టెంట్స్ ఒకేసారి హౌస్‌లోకి వెళ్లబోతున్నారని తెలుస్తుంది. అందులో అలేఖ్య చిట్టి పికెల్స్ సిస్టర్ రమ్య ఎంట్రీ ఇవ్వబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి..

Also Read: ప్రేమ కుటుంబాన్ని కలిపేందుకు నర్మద ప్లాన్.. సాగర్ సర్ప్రైజ్.. ధీరజ్ కు లవ్ లెటర్..


రమ్య ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్.. 

ఈ సీజన్లో కాంట్రవర్సీలకు కేరాఫ్ గా మారిన రమ్య చిట్టి పాల్గొనబోతుందంటూ బిగ్ బాస్ మొదలైనప్పటి నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అప్పుడు హౌస్ లోకి పంపించకుండా వైల్డ్ కార్డు ద్వారా టైం చూసి పంపించాలని బిగ్ బాస్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈమె ద్వారా బిగ్ బాస్ గట్టిగానే రణరంగం సృష్టించబోతున్నారు. వివాదాలు కేరాఫ్ అడ్రస్ అయిన రమ్య.. మంచి అందగత్తె కూడా. అసలే హౌస్‌లో కామంతో కటకటలాడిపోతున్నారు డీమాన్ పవన్, కళ్యాణ్‌ లు. ఈ బ్యూటీ ఎంట్రీ తో హౌస్ లో కొత్త కంటెంట్ క్రియేట్ అవుతుందని బిగ్ బాస్ భావించిందని టాక్. మరి వైల్డ్ కార్డు ద్వారా ఈవారం ఎంట్రీ ఇస్తుందా? లేదా వచ్చేవారం వస్తుందా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా కూడా ఈమె సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ తో విన్నర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు ఓ వార్త అయితే వినిపిస్తుంది. మరి ఈ సీజన్ విన్నర్ ఎవరో అవుతారు తెలియాలంటే ప్రతి ఎపిసోడ్ ను మిస్ అవ్వకుండా చూడాల్సిందే..

Related News

Bigg Boss 9 Promo: అదిరిపోయిన కెప్టెన్సీ టాస్క్.. అతి నమ్మకం పనికిరాదు పాపా!

Bigg Boss 9 Promo: పొట్టిగా ఉండడం ఆయన చేసిన తప్పా.. ఏంటమ్మా ఫ్లోరా?

Bigg Boss 9 : 2 టాస్క్ లతో స్కోర్స్ తారుమారు, నాశనం చేసిన రీతు, సేఫ్ జోన్ కి వెళ్ళిపోయిన ఆ ముగ్గురు

Bigg boss 9: దివ్య వచ్చాక భరణి నిజంగానే మారిపోయాడా? అసలు సంజన ఎమోషన్ వెనుక అర్థం ఉందా?

Bigg Boss 9 Promo: రేస్ నుంచి సంజన-ఫ్లోరా అవుట్.. కర్మ సిద్దాంతమంటూ హితబోధ చేసిన గుడ్డు దొంగ!

Bigg Boss: బిగ్ బాస్ కోసం ఉపముఖ్యమంత్రి.. తెరుచుకున్న గేట్లు!

Bigg Boss 9 Telugu : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమె? ఆ వీడియోనే కారణమా?

Big Stories

×