Bigg Boss 9 Promo: బిగ్ బాస్ సీజన్ 9… ఐదవ వారం చివరి దశకు చేరుకుంది. తాజాగా 33వ రోజుకు సంబంధించిన రెండవ ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. ఇందులో కెప్టెన్సీ టాస్క్ కోసం నిర్వహించిన ఒక టాస్క్ అందరిలో ఆసక్తి పెంచింది. ముఖ్యంగా ఈ టాస్క్ చాలా కొత్తగా ఉంది అని చూసే ఆడియన్స్ కూడా చెబుతున్నారు. అయితే ఈ టాస్క్ లో పాపం కామనర్ దివ్య నికిత అతి నమ్మకం పనికి రాలేదు అని చెప్పాలి. మరి కెప్టెన్సీ టాస్క్ కోసం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటి ? అందులో దివ్య అతి నమ్మకం ఎవరిపై? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
తాజాగా విడుదల చేసిన ప్రోమోలో బిగ్ బాస్ మాట్లాడుతూ.. బిగ్ బాస్ సీజన్ 9.. 5 కెప్టెన్ అవ్వడానికి.. పోటీదారునికి ఇస్తున్న టాస్క్ “కనుక్కోండి చూద్దాం”.. బజర్ మోగినప్పుడల్లా.. సంచాలక్ చైర్స్ లో కూర్చున్న ఒకరిని ఎంపిక చేసుకొని.. పోటీదారుని భుజం పై తట్టాలి. అప్పుడు ఆ పోటీదారుడు తమ కళ్లకున్న గంతులు తీసి.. మిగిలిన సభ్యుల్లో ఒకరిని ఎంచుకొని.. వారి తలపై వేలాడుతున్న లైట్ ని ఆఫ్ చేసి.. తిరిగి వారి చైర్ లో కళ్లకు గంతలు పెట్టుకుని యధావిధిగా కూర్చోవాలి. అయితే వారు గెస్ చేసిన సభ్యులు కరెక్ట్ అయితే.. ఆ లైట్ ఆఫ్ చేసిన వ్యక్తి ఎలిమినేట్ అవుతారు అంటూ టాస్క్ నిర్వహించారు బిగ్ బాస్.
అలా మొదట సంచాలక్ గా వ్యవహరించిన సంజన.. రాము రాథోడ్ భుజం తట్టగా ఆయన వెళ్లి దివ్య నికిత లైట్ ఆఫ్ చేశాడు. ఆమె రాము పేరు చెప్పింది. సంజన ఫైనల్ ఆన్సర్ కావాలని రెండు సార్లు అడిగినా.. రెండుసార్లు ఆమె రాము పేరు చెప్పింది. దాంతో రాము ఎలిమినేట్ అయిపోయాడు. ఆ తర్వాత భరణి శంకర్ ..కళ్యాణ్ లైట్ ఆఫ్ చేయగా కళ్యాణ్.. కరెక్ట్ గా భరణి శంకర్ పేరు చెప్పి.. ఆయనను టాస్క్ నుంచి తప్పించారు. ఇక తనూజ కూడా దివ్య లైట్ ఆఫ్ చేసింది. అయితే అప్పుడు దివ్య తనూజ పైన ఉన్న అతి నమ్మకంతో.. లైట్ ఆఫ్ చేసింది కళ్యాణ్ అంటూ చెప్పింది. తనుజ నా లైట్ ఆఫ్ చేయదని నాకనిపిస్తోంది అంటూ చెప్పింది. కానీ అక్కడ తనుజ దివ్య లైట్ ఆఫ్ చేసింది. పాపం తనూజ పైన అతి నమ్మకంతో అసలు విషయాన్నీ గుర్తించలేక కెప్టెన్సీ టాస్క్ నుంచి ఎలిమినేట్ అయింది దివ్య. ఇక కెప్టెన్సీలో మిగిలి ఉన్నది ఇమ్మానుయేల్, తనూజ, కళ్యాణ్ మాత్రమే.. ఈ ముగ్గురిలో ఎవరు ఈ వారం కెప్టెన్ గా బాధ్యతలు తీసుకుంటారో తెలియాలి అంటే ఈ ఎపిసోడ్ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.
ALSO READ: Stranger things Season 5: ఒక్క ఎపిసోడ్ రన్ టైం ఒక సినిమా అంత… బడ్జెట్‌ను అయితే భరించలేం!