Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9 డే 33 లోకి ఎంట్రీ అయింది. అయితే సేఫ్ జోన్ లోకి వెళ్లే అవకాశం కేవలం ఒకరికి మాత్రమే లీడ్ బోర్డ్ నుంచి ఇచ్చారు కాబట్టి, కళ్యాణ్ సేఫ్ జోన్ కి వెళ్ళిపోయాడు. తనుజ ను ఎందుకు కళ్యాణి పంపించావు అని ఇమ్మానుయేల్ దివ్య మాట్లాడ్డంతో ఎపిసోడ్ మొదలైంది.
డేంజర్ జోన్ లో ఉన్న సభ్యులకు ఫైర్ స్ట్రోమ్ నుంచి సేవ్ అవ్వడానికి బిగ్ బాస్ ఈ టాస్క్ ఇచ్చారు. గార్డెన్ ఏరియాలో కొన్ని స్విమ్మింగ్ పూల్స్ పెట్టారు. వాటిలో చల్లగా నీళ్లు ఉంటాయి. డేంజర్ లో ఉన్న సభ్యులు ఆ పూల్ లోకి వెళ్లి వాటిలో ఉన్న రోప్స్ పట్టుకొని దానిలో పడుకోవాలి.
సేఫ్ జోన్ లో ఉన్నవాళ్లు ఎవరినైతే డేంజర్ లో పడేయాలి అనుకుంటారో వాళ్ళ పూల్లో వాటర్ నింపవచ్చు. ఎవరినైతే సేవ్ చేయాలి అనుకుంటారు దానిలో నుంచి వాటర్ ని బయటకు తీయాలి. ఎప్పుడైతే కంటెస్టెంట్ పూల్లో ఉండలేము అని డిసైడ్ అయిపోతారో అప్పుడే దానిలో నుంచి లేచి కూర్చుని పోవచ్చు. వాళ్లు ఆటను ఎలిమినేట్ అయిపోతారు. ఆఖరి వరకు ఉన్నోళ్లు విన్నర్. ఈ టాస్క్ కు ఫ్లోరా సంచాలకులుగా వ్యవహరించారు.
ఈ టాస్కులో మొదట సుమన్ శెట్టి ఎలిమినేట్ అయిపోయారు. తనను అనవసరంగా ఎలిమినేట్ చేశారు అంటూ సుమన్ శెట్టి ఆర్గ్యుమెంట్ పేర్కొన్నారు. తర్వాత డిమాన్ పవన్ ఎలిమినేట్ అయిపోయారు. తర్వాత రీతు ఎలిమినేట్ అయిపోయారు. మొత్తానికి ఈ రౌండ్లో తనుజ సేఫ్ అయిపోయింది.
5వ వారం కెప్టెన్ అవ్వడానికి బిగ్ బాస్ కనుక్కోండి చూద్దాం అనే కొత్త టాస్క్ ఇచ్చారు. సంజన సంచాలకులుగా వ్యవహరించారు. గార్డెన్ ఏరియాలో కొన్ని చైర్లు ఏర్పాటు చేశారు. పోటీదారులు కళ్ళకు గంతలు కట్టుకొని ఆ చేరు మీద కూర్చోవాలి. బజార్ మోగినప్పుడు సంచాలకులు ఒక వ్యక్తిని ఎంచుకొని వాళ్ళ భుజం పైన తట్టాలి.
అప్పుడు ఆ పోటీదారులు తమ కళ్ళకు ఉన్న గంటలు తీసి, చైర్ మీద కూర్చున్న మిగిలిన సభ్యుల ఒకరిని ఒకరిని ఎన్నుకొని వాళ్ల ముందున్న లైట్ ఆఫ్ చేసి మళ్లీ కళ్లకు గంతలు కట్టుకొని వాళ్ల చైర్ లో వాళ్ళు కూర్చుని పోవాలి. ఎవరి లైట్ అయితే ఆఫ్ అయిందో వాళ్లు లేచి వాళ్ళ లైట్ ను ఎవరు ఆఫ్ చేశారు కనుక్కోవాలి. ఆ గెస్ కరెక్టే అయితే లైట్ ఆఫ్ చేసిన వ్యక్తి ఎలిమినేట్ అవుతారు. గెస్ రాంగ్ అయితే ఎవరి లైట్ ఆఫ్ అయిందో వాళ్లు ఎలిమినేట్ అయిపోతారు. ఇద్దరు సభ్యులు మిగిలిన అంతవరకు ఇది కంటిన్యూ అవుతుంది.
ఈ టాస్క్ లో తనుజ మరియు కళ్యాణ్ కెప్టెన్సీ పోటీ కోసం మిగిలారు. వీరిలో ఒకరిని కెప్టెన్ గా డిసైడ్ చేసే అవకాశం బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి ఇచ్చారు. వెంటనే అందరూ కలిసి కళ్యాణ్ ను కెప్టెన్ గా ఎంచుకున్నారు.
తనుజ ను కెప్టెన్ గా ఎంచుకోలేదు అని చెప్పి హౌస్మెట్స్ అందరి పైన ఒక్కసారిగా అరిచింది. అసలు ఈ హౌస్ లో ఎవరు సపోర్ట్ చేయట్లేదు. గేమ్స్ స్టార్ట్ అవ్వగానే గ్రూప్ స్టార్ట్ చేస్తారు. నాకు నాన్న తప్ప ఎవరూ సపోర్ట్ చేయట్లేదు అని హౌస్ మేట్స్ పై అరిచింది.
Also Read: Pradeep Ranganathan: ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నా, నాకు అలాంటివి చేయాలని కోరిక