Bigg Boss 9 New Captain: బిగ్ బాస్ షో ఫ్యామిలీ షో అయిపోయింది. నువ్వా–నేనా అంటూ పోటీ పడాల్సిన కంటెస్టెంట్స్.. బంధాలు పెట్టుకుంటూ రిలేషన్స్ కలిపేసుకుంటున్నారు. దీంతో బిగ్బాస్ తెలుగు షో అన్నగారి కుటుంబం అన్నట్టు అయిపోయింది. ఎందుకంటే భరణి హౌజ్లో పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడు. టాస్క్లు, ఆటలు, ఎంటర్టైన్మెంట్స్ పెట్టి రిలేషన్స్ బిల్డ్ చేసుకోవడంపై కంటెస్టెంట్స్ ఫోకస్ పెట్టారనిపిస్తోంది. ఈ విషయమైన హోస్ట్ నాగార్జున వారిన హెచ్చరించిన ఎవరూ పెద్ద పట్టించుకోవడం లేదనిపిస్తోంది.
హౌజ్లో రిలేషన్స్, బంధాలు ఏం లేవంటూ తనూజ ఫేవరేట్ వస్తువులను భరణితో.. భరణి ఇష్టమైన వస్తువులన తనూజతో పగలగొట్టించారు. అయినా అది వారిక తలకెక్కినట్టు కనిపించడం లేదు. ఆటలు, టాస్క్లు ఆడండంటే.. నాన్న, కూతురు, అన్నయ్య అంటూ బంధాలపైనే ఫోకస్ పెడుతున్నట్టుగా కంటెస్టెంట్స్ తీరు. ఇక హౌజ్లో బంధాల మధ్య నలిగిపోతున్న భరణి చివరికి కెప్టెన్సీ కూడా చేజార్చుకున్నాడు. సేఫ్ జోన్లో ఉన్న ఇమ్మాన్యుయేల్, రాము భరణి, దివ్య పవన్ కళ్యాన్ తనూజ కెప్టెన్సీ కోసం పోటీ పడ్డారు. వీళ్లందరి కళ్లకు గంతలు కట్టి ఉంటాయి. తమ తలపై ఉన్న బల్బులను ఎవరూ ఆఫ్ చేశారో కరెక్ట్ గెస్ చేసి చెబితే.. బల్బు అన్ చేసిన వారు పోటీ నుంచి ఎలిమినేట్ అవుతారు.
Also Read: Suniel Shetty: కన్నీళ్లు, గర్వం, గూస్బంప్స్ ఒకేసారి.. ‘కాంతార‘ మూవీపై బాలీవుడ్ నటుడు రివ్యూ!
అలా దివ్య ఈ గేమ్లో మొదటి రౌండ్ దివ్య తలపై ఉన్న బల్బుని రాము ఆఫ్ చేశాడని కరెక్ట్ గా చెప్పి అతడిని ఎలిమినేట్ చేస్తుంది. అలా సాగిన ఈ ఆటలో చివరిగా సోల్జర్ పవన్ కళ్యాణ్ వంతు వచ్చింది. ఈ గేమ్లో కళ్యాణ్తో పాటు భరణి, దివ్య, తనూజ, ఇమ్మాన్యుయేలు ఉన్నారు. అదే భరణికి మైనస్ అయ్యింది. మొదటి రిలేషన్పై ఫోకస్గా ఉన్న భరణికి దివ్య, తనూజ, ఇమ్మాన్యుయేల్తో మంచి అనుబంధం ఉంది. కాబట్టి భరణి వారేవరిని టాస్క్ నుంచి తియాలి అనుకోడు. కాబట్టి కళ్యాణ్ బల్బుని ఆర్పింది భరణి అని గెస్ చేసి.. హౌజ్ కెప్టెన్గా నిలిచాడు. దీంతో ఐదోవారం కెప్టెన్గా కామనర్ కళ్యాణ్ అయ్యాడు.
కాగా ఈ వారం హౌజ్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ వైల్డ్ కార్డు ద్వారా ఆరుగురు హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వారిలో సోషల్ మీడియా ఇన్ప్లూయేన్సర్, పొలిటిషియన్ దివ్వెల మాధురి, అలేఖ్యా చిట్టి పిక్కిల్స్ సిస్టర్స్ రమ్య, నటి అయేషా, బుల్లితెర నటుడు నిఖిల్ నాయర్, శ్రీనివాస, మల్లీ సీరియల్ పేం గౌరవ్ లు ఎంట్రీ ఇస్తున్నారు. ఈ వారం హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యేవారిలో రీతూ చౌదరి, దివ్యల పేర్లు వినిపిస్తున్నారు. వీరిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని టాక్.