BigTV English

Teja Sajja: అంత మంచి సినిమా ఎలా వదిలేసావు భయ్యా?

Teja Sajja: అంత మంచి సినిమా ఎలా వదిలేసావు భయ్యా?

Teja Sajja: కొంతమంది దర్శకులు కొన్ని సందర్భాలలో ఒక సినిమాను ఈ హీరోతో చేద్దాం అని ఫిక్స్ అయి ఉంటారు. అలా చాలామంది హీరోలు వద్దకు దర్శకులు వెళ్తూ ఉంటారు. అయితే ఒకరితో చేయాలి అనుకున్న సినిమా వేరే వాళ్ళతో పట్టాలెక్కడం అనేది ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో జరుగుతుంది. ఆ సినిమా సక్సెస్ అయినప్పుడు రిజెక్ట్ చేసిన హీరోలు కొన్ని సందర్భాల్లో ఫీల్ అవుతారు. సినిమా ఫెయిల్ అయినప్పుడు నేను మంచి డెసిషన్ తీసుకున్నాను అని కూడా అనుకుంటారు.


అయితే ఇండస్ట్రీలో చాలా కాంబినేషన్స్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత కూడా ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా డివివి దానయ్య ప్రొడ్యూసర్ గా సినిమా వస్తుంది అని పబ్లిక్ గా అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటివరకు ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీ ఎంట్రీ సినిమా చేస్తున్నట్లు కూడా పబ్లిక్ గా అనౌన్స్ చేశారు. కానీ మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ సినిమాను వివి వినాయక్ దర్శకత్వం వహించారు. ఇలాంటి ఉదాహరణలు ఇండస్ట్రీలో చెప్పడానికి కోకొల్లలు ఉన్నాయి.

తేజ వదిలేసిన ప్రాజెక్ట్ 

అసలు విషయానికి వస్తే అనుదీప్ కేవీ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలో నటించిన జాతి రత్నాలు సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. జాతి రత్నాలు సినిమా కథను మొదట దర్శకుడు అనుదీప్ తేజకు చెప్పాడట. కానీ కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. మొత్తానికి నవీన్ పోలిశెట్టి వెళ్లడం నాకు చాలా ఆనందంగా ఉంది అని తేజ సజ్జ మిరాయి సినిమా ప్రమోషన్స్ లో తెలిపాడు. జాతి రత్నాలు సినిమా చూస్తున్న తరుణంలో కూడా 100% తన పాత్రకు నవీన్ పోలిశెట్టి న్యాయం చేశాడు అనిపించేలా ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ యాసను నవీన్ పోలిశెట్టి పట్టుకున్న విధానం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది.


హీరోలు వదిలేసిన ప్రాజెక్టులు 

గతంలో కూడా చాలామంది హీరోలు కొన్ని ప్రాజెక్టులు వదిలేశారు. అర్జున్ రెడ్డి సినిమాను సందీప్ రెడ్డి వంగ సందీప్ కిషన్ తో చేద్దాం అని ప్రయత్నాలు చేశారు. అయితే ప్రస్థానం సినిమాలో ఆల్రెడీ డ్రగ్స్ తీసుకునే వ్యక్తుల సందీప్ కిషన్ క్యారెక్టర్ ఉండటం వలన ఈ సినిమాలో కూడా డ్రగ్స్ ఆల్కహాలు ఉన్నాయి అని చెప్పి అర్జున్ రెడ్డి సినిమాను సందీప్ రిజెక్ట్ చేశాడు. అలానే మంచు మనోజ్ కూడా ఒక తరుణంలో అర్జున్ రెడ్డి సినిమా చేయాల్సి ఉంది కానీ అది కుదరలేదు. స్వప్న దత్ ప్రొడ్యూసర్ గా శర్వానంద్ కూడా అర్జున్ రెడ్డి సినిమా చేయాల్సి ఉంది కానీ అది కుదరలేదు. మొత్తానికి విజయ్ దేవరకొండ హీరోగా అర్జున్ రెడ్డి సినిమా బయటకు వచ్చింది. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. మొత్తానికి జాతి రత్నాలు సినిమా మాత్రం తేజ చేయవలసింది పక్కకు వెళ్లిపోయింది.

Also Read: TVK Vijay: తలపతి విజయ్ పార్టీ పైన త్రిష ఆసక్తికర కామెంట్స్

Related News

Bandla Ganesh: కొడితే నీలా కొట్టాలి రా బాబు దెబ్బ, బండ్లన్న కొత్త భజన?

Teja Sajja: ఒక పెద్ద దర్శకుడు నన్ను మోసం చేశాడు

Ileana D’Cruz: ఆ క్షణం నరకం అనుభవించా.. కొడుకు విషయంలో నిజాలు బయటపెట్టిన ఇలియానా!

TVK Vijay: తలపతి విజయ్ పార్టీ పైన త్రిష ఆసక్తికర కామెంట్స్

Pookie: సోషల్ మీడియా దెబ్బకి పూకి ను కాస్త బూకి చేశారు

Big Stories

×