E-Paper
Advertisement

Abhay Naveen::బిగ్ బాస్ అభయ్ కి అభయమిచ్చిన తారక్..ఎందుకో తెలుసా?

Abhay Naveen::బిగ్ బాస్ అభయ్ కి అభయమిచ్చిన తారక్..ఎందుకో తెలుసా?
Advertisement

Jr. Ntr praised big boss 8 contestant Abhay Naveen::బిగ్ బాస్ సీజన్ 8 ఈ సారి ఎక్కువ పరిచయం లేని ముఖాలతో నిర్వహిస్తున్నారని వీక్షకులు మండిపడుతున్నారు. పైగా ప్రతి ప్రోమోలో ఎంటర్ టైన్ మెంట్ డబుల్ డోస్ అంటూ ఊదరగొట్టారు. ఇప్పటిదాకా ఆ రేంజ్ లో వినోదాన్ని ప్రేక్షకులు ఆస్వారించలేకపోతున్నారు. అసలు వారితో కలిసి ట్రావెల్ కావాలంటే మరో మూడు నాలుగు వారాలు పట్టేలా ఉంది. తొలి వారంలోనే బేబక్క ఎలిమినేటర్ అయింది. ఇక మిగిలిన కంటెస్టంట్లంతా ఘర్షణ వాతావరణంలో కొనసాగుతున్నారు. దెబ్బలాటలు, అరుపులు, కేకలు, పెడబొబ్బలు, ఏడ్పులు ప్రతి సీజన్ లాగానే ఈ సారి కూడా జరుగుతున్నాయి. మరి ఇందులో కొత్తదనం ఏముంది అని అడుగుతున్నారు వీక్షకులు. అయితే బిగ్ బాస్ నిర్వాహకులు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మరికొందరు హాట్ హీరోయిన్లను రంగంలోకి దించాలని చూస్తున్నారు. ఇప్పటికే టీవీ సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన జ్యోతిరాయ్ ని తీసుకోవాలని చూస్తున్నారు.

మల్టీ ట్యాలెంటెడ్

Advertisement

బిగ్ బాస్ కంటెస్టెంట్లలో కొద్దో గొప్పో గుర్తుంచుకోవలసిన వారు వేళ్ల మీద లెక్కపెట్టుకునేవాళ్లే ఉన్నారు. వారిలో ఒకరు అభయ్ నవీన్. విజయ్ దేవరకొండ లీడ్ రూల్ పోషించిన పెళ్లిచూపులు చిత్రంలో విజయ్ కి స్నేహితులలో ఒగరుగా నటించారు అభయ్ నవీన్. అయితే అభయ్ నవీన్ కేవలం నటుడిగానే తెలుసు అందరికీ. అతనిలో మల్టీ ట్యాలెంట్స్ ఉన్నాయని చాలా మందికి తెలియదు. అభయ్ గతంలో దర్శకత్వం కూడా చేశారు. ఆ మూవీ థియేటర్లలో ఫరవాలదనిపించుకుంది. ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అయితే అభయ్ నవీన్ బిగ్ బాస్ కు వెళ్లే ముందు ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి చెప్పారు. తాను గతంలో చేసిన ఓ సినిమా స్టోరీ గురించి తారక్ తో చర్చించానన్నారు. తారక్ తో తన సినిమా కథను చెప్పి ఎలా ఉందో చెప్పాలని అన్నారు. తారక్ సీరియస్ గా కథంతా విన్నాక మర్నాడు చెబుతానని అన్నారు. ఏదో మొక్కుబడి కోసం తారక్ అలా అని ఉంటాడని అనుకున్నానని అన్నారు. అయితే తారక్ మర్నాడు తనని పిలిచి స్టోరీ బాగుందని చెప్పి తనని ప్రోత్సహించారన్నారు. నాకు ఎప్పుడూ కథను వినగానే ఓకే చెయ్యను. ఒక రోజు తీసుకుంటాను.

తారక్ స్పందన

Advertisement

నేను ఇంటికెళ్లి పడుకున్నా..ఆ కథ నన్ను వెంటాడాలి. మళ్లీ మళ్లీ గుర్తుకు రావాలి. అప్పుడే నేను స్పందిస్తానని ఎన్టీఆర్ అన్నారు. ఆ మాత్రం అభయమిస్తే ఇక అభయ్ ఆగుతాడా దానినే సినిమాగా తీసి హిట్టు కొట్టారు ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద కూడా మంచి ఆదరణ పొందిందని ఆ మూవీ పేరు రామన్న అని తెలిపారు అభయ్. అయితే బిగ్ బాస్ తర్వాత అభయ్ తన నటనను కొనసాగిస్తారా లేక దర్శకత్వ శాఖలో ప్రావీణ్యం సంపాదించుకుంటారా అని జనం చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చే నటులు మల్టీ ట్యాలెంటెడ్ గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. విశ్వక్ సేన్, నవీన్ పోలిశెట్టి వంటి నటులు సినిమాలకు కథలను సైతం అందిస్తున్నారు.

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×