E-Paper
Advertisement

Bigg Boss : బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తున్న మహేష్ బాబు రిలేటివ్.. ఇక రచ్చ రంబోలానే..

Bigg Boss : బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తున్న మహేష్ బాబు రిలేటివ్.. ఇక రచ్చ రంబోలానే..
Advertisement

Bigg Boss : బుల్లితెర పై టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న ఏకైక షో బిగ్ బాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రతి ఇండస్ట్రీలోని క్రేజ్ ను అందుకుంది. కోట్ల మంది అభిమానుల మనసు దోచుకుంది. ప్రేక్షకులను ఎంతగా మెప్పిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో ఈ షో ప్రదర్శితం అవుతోంది. తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో ఎనిమిదోవ సీజన్ ప్రసారం అవుతుంది. కానీ బాలీవుడ్ లో మాత్రం 18 సీజన్ మొదలు కాబోతుంది. ఈ షో కోసం బాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సీజన్ లో ఎవరు పాల్గొంటారా అని తెలుసుకోవాలని ఆత్రుతగా ఉన్నారు. అక్కడ జరగబోతున్న షోలో మహేష్ బాబు రిలేటివ్ ఎంట్రీ ఇవ్వనున్నారని టాక్.. మరి ఆమె ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

తెలుగు, తమిళ భాషల్లో బిగ్ బాస్ హిందీ సీజన్ 18 త్వరలోనే మొదలు కాబోతుంది. ఈ సారి కూడా సల్మాన్ ఖాన్ గెస్ట్ గా హోస్ట్ చేస్తున్నాడు.  తాజాగా హిందీ బిగ్ బాస్ సీజన్ 18 కు చెందిన ప్రోమోని విడుదల చేసారు. అలాగే ఈ సీజన్ అక్టోబర్ 6 నుంచి మొదలు కాబోతుందని అధికారికంగా తెలిపారు. ఎప్పుడూ సెన్సేషనల్ అవుతూ వార్తల్లో నిలిచే హిందీ బిగ్ బాస్ లోకి కంటెస్టెంట్స్ ఈ సారి ఎవరు వస్తారో చూడాలి.. అయితే అందుతున్న సమాచారం మేరకు ఈ సీజన్ లోకి టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు భార్య నమ్రత అక్క శిల్ప శిరోద్కర్ ఎంట్రీ ఇవ్వనుందని టాక్.. అందులో నిజమేంత ఉందో తెలియదు ఈ వార్త మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ వార్తే నిజమైతే విన్నర్ ఆమె అవుతుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Mahesh Babu's entry into Bigg Boss is relative.
Mahesh Babu’s entry into Bigg Boss is relative.
Advertisement

శిల్ప శిరోద్కర్ భ్రష్టాచార్ అనే సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె నటించిన ఎన్నో సినిమాలు సక్సెస్ సాధించడంతో పాటు కలెక్షన్ల పరంగా టాప్ లో నిలిచాయి.. తెలుగులో కూడా సినిమాలు చేసింది. ఇక పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయ్యింది. ఆ తర్వాత సీరియల్స్ లో మెరిసిన ఈమె పలు సీరియల్స్ చేసింది. ప్రస్తుతం బుల్లితెరకు సైతం దూరంగా ఉన్న శిల్ప శిరోద్కర్ త్వరలో బిగ్ బాస్ షోలో అడుగుపెడతారా? లేదా? అనే చర్చ సైతం జరుగుతోంది. శిల్ప శిరోద్కర్ బిగ్ బాస్ షోలో ఎంట్రీ ఇస్తే ఆమె కెరీర్ మళ్లీ ఫాంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. శిల్ప శిరోద్కర్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలనే చర్చ కూడా జరుగుతుండటం గమనార్హం. మరోవైపు మహేష్, నమ్రత తెలంగాణ రాష్ట్రానికి 50 లక్షల విరాళం అందించిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమా కోసం మహేష్ బాబు తన లుక్ ను సైతం మార్చుకున్న సంగతి తెలిసిందే.. రాజమౌళితో భారీ బడ్జెట్ సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో సినిమా ఎలా ఉండబోతుందా అని ఫ్యాన్స్ ఇప్పటినుంచే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×